21 కి.మీ మైలేజ్, 5-సీటర్.. ఒకప్పుడు నెం.1, కానీ ఇప్పుడు కస్టమర్లు వెనుకాడుతున్నారు!

హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta) పేరు వినగానే భారత మార్కెట్లో SUV లవర్స్‌కు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. తన స్టైలిష్ డిజైన్‌, ఫీచర్లు, రోడ్డు మీద ఇచ్చే రైడింగ్ అనుభవం కారణంగా ఇది ఎప్పటినుంచో బెస్ట్ సెల్లింగ్ SUVలలో ఒకటిగా కొనసాగుతోంది. తాజాగా ఆగస్టు 2025 నెలలో కార్ల అమ్మకాల గణాంకాలు విడుదల కాగా, క్రెటా మరోసారి టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించింది. ఈ జాబితాలో క్రెటా మూడవ స్థానంలో నిలిచింది. ఆగస్టు నెలలో మొత్తం 15,925 యూనిట్లు అమ్ముడవడం దీని స్థిరమైన డిమాండ్‌ను మరోసారి చాటిచెప్పింది. అయితే, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ అమ్మకాలలో కొంత వెనుకడుగు పడింది. 2024 ఆగస్టులో క్రెటా అమ్మకాలు 16,762 యూనిట్లు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గి -5 శాతం పడిపోయింది.

ఇది SUV మార్కెట్లో ఉన్న తీవ్రమైన పోటీని సూచించే అంశంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు అమ్మకాల రేసులో మొదటి స్థానాన్ని మారుతి సుజుకి ఎర్టిగా దక్కించుకుంది. మొత్తం 18,445 యూనిట్లు అమ్ముడవడం ద్వారా ఎర్టిగా తన మల్టీపర్పస్ వెహికల్ ఇమేజ్‌ను మరింత బలపరిచింది. రెండవ స్థానంలో మారుతి సుజుకి డిజైర్ నిలిచింది. ఈ సెడాన్ మోడల్ ఆగస్టులో 16,509 యూనిట్లు అమ్ముడవడం ద్వారా తన స్థిరమైన క్రేజ్‌ను కొనసాగించింది.

Hyundai Suv Creta August 2025 Sales 5 Percent Down Compared To Previous

అయితే, ఈ పోటీ మధ్యలో కూడా క్రెటా స్థానాన్ని కాపాడుకుంది. SUV సెగ్మెంట్‌లో హోండా, కియా, టాటా వంటి కంపెనీలు కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ పోటీని పెంచుతున్నా, క్రెటా మాత్రం తన ఫ్యామిలీ ఫ్రెండ్లీ SUV ఇమేజ్‌, అధునాతన ఫీచర్లు, నమ్మకమైన ఇంజిన్ పనితీరుతో బలంగా నిలబడుతోంది. మొత్తం మీద, ఆగస్టు నెలలో క్రెటా అమ్మకాలు కొంత తగ్గినా, టాప్ 3లో స్థానం సంపాదించడం స్థిరమైన ప్రజాదరణకు నిదర్శనం.

కొత్త హ్యుందాయ్ క్రెటా అమ్మకాల తగ్గుదల వెనుక పలు అంశాలు ఉన్నాయని ఆటోమొబైల్ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటిగా, ఈ SUV యొక్క ఎక్స్-షోరూమ్ ధర స్వల్పంగా పెరగడం కొనుగోలుదారుల నిర్ణయంపై ప్రభావం చూపింది. ప్రస్తుతం చాలా మంది కస్టమర్లు రూ.10 లక్షల లోపు అందుబాటులో ఉన్న కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అందువల్ల, ధర పరంగా కాస్త ఎక్కువగానే ఉండే క్రెటా వైపు కొత్తగా కస్టమర్లు తగ్గుతున్నారని చెబుతున్నారు.

Hyundai Suv Creta August 2025 Sales 5 Percent Down Compared To Previous

అలాగే, ఆగస్టు నెలలోనే ప్రభుత్వం కార్లపై జీఎస్టీ తగ్గిస్తారనే ఊహాగానాలు మరింతగా కొనుగోళ్లను వెనక్కు నెట్టాయి. చాలా మంది కస్టమర్లు ఇంకా కొద్ది రోజులు వేచిచూడాలి, ధరలు తగ్గిన తర్వాత కొనుక్కుందాం అనే ఆలోచనలోకి వెళ్లిపోయారు. ఈ కారణం కూడా ఆగస్టులో క్రెటా అమ్మకాల సంఖ్యను తగ్గించిందని విశ్లేషిస్తున్నారు. అయితే, ఇదంతా తాత్కాలికమని నిపుణుల అంచనా. సెప్టెంబర్ నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తాయి.

ధరలు తగ్గడం వల్ల క్రెటా అమ్మకాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు ఆటో మార్కెట్ వర్గాలు నమ్ముతున్నాయి. పండుగ సీజన్ కూడా దగ్గరపడుతుండటంతో, కొత్త ఆఫర్లు, డిస్కౌంట్‌లు, ధర తగ్గింపులు అన్ని కలిపి క్రెటాకు మరింత వేగం తెచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధరలు రూ.11.11 లక్షల నుంచి రూ.20.50 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వరకు ఉంది.

Hyundai Suv Creta August 2025 Sales 5 Percent Down Compared To Previous

ఇది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి, ఇది 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్, CVT, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌ను జతచేయబడి ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది 17 నుండి 21.8 kmpl మైలేజీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 11, 2025, 14:54 [IST]
English summary
Hyundai suv creta august 2025 sales 5 percent down compared to previous
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+