మారుతి, టాటాకు చెమటలు పట్టేలా హ్యుందాయ్ మాస్టర్ ప్లాన్.. త్వరలో మైలేజీ ఫుల్‎గా ఇచ్చే 8 హైబ్రిడ్ కార్లు

సాధారణ ఐసీ ఇంజిన్ కార్లతో పోలిస్తే హైబ్రిడ్ కార్లు ఎక్కువ మైలేజీని అందిస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్ల వైపు వెళ్లడానికి బదులు, మైలేజీని కోరుకునే కస్టమర్లు ఇప్పుడు హైబ్రిడ్ కార్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి మారుతి సుజుకి, టాటా వంటి అగ్రగామి సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అదే దారిలో ఇప్పుడు హ్యుందాయ్ కంపెనీ ఒక సంచలన ప్రకటన చేసింది. రాబోయే 2030 నాటికి భారత మార్కెట్లో ఏకంగా 8 కొత్త హైబ్రిడ్ కార్లను విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. ఈ వివరాలు, మార్కెట్లో హ్యుందాయ్ వ్యూహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Hyundai to Launch 8 New Hybrid Cars by 2030 A Direct Challenge to Maruti and Tata in the Mileage Segment

భారత మార్కెట్లో మైలేజీ కారు కోసం చూసే కస్టమర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, హ్యుందాయ్ మోటార్స్ పెద్ద ప్రణాళికను ప్రకటించింది. హ్యుందాయ్ ఇండియా ఇన్వెస్టర్ డే సందర్భంగా ఈ ప్రకటన చేసింది. రాబోయే 2030వ సంవత్సరం నాటికి భారతీయ మార్కెట్‌లో మొత్తం 8 కొత్త హైబ్రిడ్ కార్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఇందులో ఇప్పటికే అమ్మకాల్లో ఉన్న కొన్ని మోడళ్లకు కొత్త హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌ను అందించడంతో పాటు, పూర్తిగా కొత్త హైబ్రిడ్ కార్లను కూడా మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. హ్యుందాయ్ మొదటగా తమ అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌ను తీసుకురావాలని భావిస్తోంది.

Hyundai to Launch 8 New Hybrid Cars by 2030 A Direct Challenge to Maruti and Tata in the Mileage Segment

ఈ 8 కార్లలో మొదటి దశలో, మార్కెట్‌లో మంచి అమ్మకాలు ఉన్న హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీలకు కొత్త హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌లను తీసుకురావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం హ్యుందాయ్ అమ్ముతున్న ప్రతి 100 కార్లలో 99 కార్లు పెట్రోల్, సీఎన్‌జీ ద్వారా నడిచేవే.

కానీ, 2030 నాటికి 8 హైబ్రిడ్ కార్లు విడుదలైన తర్వాత, ప్రతి 100 కార్ల అమ్మకాల్లో దాదాపు 16 కార్లు హైబ్రిడ్ ఇంజిన్ కలిగినవిగా ఉంటాయని హ్యుందాయ్ అంచనా వేసింది. హైబ్రిడ్ కార్ల ప్రకటనతో పాటు, హ్యుందాయ్ కంపెనీ మరో రెండు కొత్త సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు కూడా తెలిపింది.

Hyundai to Launch 8 New Hybrid Cars by 2030 A Direct Challenge to Maruti and Tata in the Mileage Segment

భారత మార్కెట్లో కొత్తగా ఒక ఎంపీవీ (మల్టీ పర్పస్ వెహికల్), ఒక ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ మోడళ్లను కూడా విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ ఈ ఈవెంట్‌లో ప్రకటించింది. ఈ కార్లు కూడా హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది.

సాధారణంగా భారత మార్కెట్‌లో కస్టమర్లు ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ విడుదల చేయబోయే కొత్త హైబ్రిడ్ కార్లకు మంచి ఆదరణ లభిస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త వ్యూహం ద్వారా మారుతి, టాటా వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, భారత కార్ల మార్కెట్‌లో హ్యుందాయ్ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, October 16, 2025, 12:14 [IST]
English summary
Hyundai to launch 8 new hybrid cars by 2030 a direct challenge to maruti and tata in the mileage seg
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+