లగ్జరీ సెగ్మెంట్‌ను ఏలడానికి హ్యుందాయ్ రెడీ.. 2027లో మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడికి పోటీగా జెనెసిస్ ఎంట్రీ

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో లగ్జరీ విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి దిగ్గజ బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి తమ హై-ఎండ్ లగ్జరీ బ్రాండ్ అయిన జెనెసిస్‎ను 2027 లో భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే యూరోపియన్, అమెరికన్ మార్కెట్లలో తనదైన ముద్ర వేసిన జెనెసిస్, తన అద్భుతమైన డిజైన్, నాణ్యమైన ఇంటీరియర్స్, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో భారతీయ లగ్జరీ మార్కెట్‌ను శాసించడానికి సిద్ధమవుతోంది. ఆ కంపెనీ ప్రధాన మోడల్ GV80 వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Hyundai to Launch Luxury Brand Genesis in India by 2027 Set to Challenge Mercedes BMW and Audi

జెనెసిస్ బ్రాండ్ G70, G80, G90, GV60, GV70, GV80 వంటి ప్రధాన మోడళ్లను కలిగి ఉంది. అయితే, కియా వలె కాకుండా, ఎంజీ తరహాలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద భారతదేశంలోనే వెహికల్స్ అసెంబుల్ చేయడానికి కంపెనీ ప్రధానంగా ప్రణాళిక వేసింది. ఇందుకోసం దేశంలో కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని, లగ్జరీ వాహనాల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని హ్యుందాయ్ ఆలోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో జెనెసిస్ GV80 లగ్జరీ ఎస్‌యూవీ మెర్సిడెస్ బెంజ్ GLE, బీఎండబ్ల్యూ X5, ఆడి Q7 వంటి పెద్ద కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. విదేశీ మార్కెట్లలో ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధర రూ.65 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. జెనెసిస్ GV80 ను హ్యుందాయ్ యొక్క M3 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. దీని డిజైన్ లగ్జరీ ఎస్‌యూవీ బెంటలీ బెంటైగాను కూడా గుర్తుచేస్తుంది.

Hyundai to Launch Luxury Brand Genesis in India by 2027 Set to Challenge Mercedes BMW and Audi

GV80 ఎస్‌యూవీ రూపకల్పనలో క్రోమ్‌తో కూడిన జి-మ్యాట్రిక్స్ క్రెస్ట్ గ్రిల్, క్వాడ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, మిచెలిన్ టైర్లతో కూడిన 22 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ మోడల్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది.

2.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ : ఇది ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి, 300 bhp శక్తిని, 421 Nm టార్క్‌ను అందిస్తుంది.
3.5 లీటర్ ట్విన్-టర్బో V6 డీజిల్ ఇంజిన్: ఇది 375 bhp పవర్, 530 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ V6 ఇంజిన్ కేవలం ఆరు సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదని జెనెసిస్ చెబుతోంది.

Hyundai to Launch Luxury Brand Genesis in India by 2027 Set to Challenge Mercedes BMW and Audi

జెనెసిస్ GV80 ఎస్‌యూవీ ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. అనేక ఆధునిక సౌకర్యాలను స్టాండర్డ్‌గా అందిస్తుంది. మినిమలిస్టిక్ డిజైన్‌లో రూపొందించబడిన లెథరెట్ డాష్‌బోర్డ్ నిజమైన లగ్జరీ అనుభూతిని ఇస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేలకు సపోర్ట్ చేసే 14.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ వెనుక మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన పెద్ద డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా కనిపిస్తుంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, లెక్సికాన్ 21-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఇతర ఫీచర్లు కూడా GV80 ఎస్‌యూవీలో ఉన్నాయి. ఈ లగ్జరీ బ్రాండ్ కోసం ప్రత్యేకంగా కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని హ్యుందాయ్ ప్రణాళికలు రచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 16, 2025, 7:13 [IST]
English summary
Hyundai to launch luxury brand genesis in india by 2027 set to challenge mercedes bmw and audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+