మూడు టైర్ల కారు.. ఆటోకి ఎక్కువ, కారుకి తక్కువ.. టీవీఎస్, హ్యుందాయ్ భాగస్వామ్యంలో మార్కెట్‌లోకి!
ఆటోమోబైల్ రంగంలో వినియోగదారులకు మంచి వాహనాలను అందించేందుకు పెద్ద సంస్థలు చేతులు కలపడం జరుగతూ ఉంటుంది. మారుతి సుజుకి, టయోటా వంటి దిగ్గజ సంస్థలు ఉమ్మడిగా ఇప్పటికే వాహనాలను కూడా తీసుకువచ్చాయి. ఇప్పుడు మరో రెండు దిగ్గజ సంస్థలు కలిసి పని చేయడానికి ముందుకు వచ్చాయి. దిల్లీలో జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్, అలాగే మరో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ జట్టు కట్టినట్లు ప్రకటించాయి. భారత మార్కెట్లో.. ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను, మైక్రో 4 వీలర్ వాహనాలను తీసుకువచ్చేందుకు కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదే వేడుకలో... హ్యుందాయ్ సంస్థ ఈ మైక్రో మొబిలిటీ వాహనాల కాన్సెప్ట్‌లను కూడా పరిచయం చేసింది. ఆ విశేషాలేంటో చూసేద్దాం.
సాంకేతికతలో హ్యూందాయ్ అనుభవం, స్థానిక మార్కెట్లో టీవీఎస్‌కు ఉన్న పట్టుతో తమ కలయుక నుంచి రానున్న కొత్త వాహనాల సేల్స్ పెరుగుతాయని ఈ రెండు సంస్థలూ ఆశిస్తున్నాయి. భారత విలక్షణ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మైక్రో మొబిలిటీ వాహనాల తయారీలో తాము ఉన్నట్లు హ్యూందాయ్ సంస్థ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయిన సాంగ్యూబ్ లీ తెలిపారు.

మరో వైపు.. వినూత్న వాహనాలతో అందిరికీ అందుబాటులో ఉండేలా టీవీఎస్ మోటార్ కంపెనీ గ్రూప్ స్ట్రేటజీ హెడ్ శరద్ మిశ్ర తెలిపారు. తమ కలయికలో రానున్న వాహనాలను ఎకో- ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు, యూజర్- ఫ్రెండ్లీగా ఉండేందుకు రెండు కంపెనీలు దృష్టి పెట్టాయి. ఈ భాగస్వామ్యంలో.. హ్యూందాయ్ సంస్థ డిజైన్, ఇంజినీరింగ్, సాంకేతికతలపై పని చేయనుండగా.. టీవీఎస్ సంస్థ ఆ వాహనాల తయారీ, డిస్ట్రిబ్యూటింగ్ అంశాలపై దృష్టి సారించనుంది.
ఈ జాయింట్ వెంచర్‌లో రూపొందనున్న ఎలక్ట్రిక్ త్రీ- వీలర్.. కాంపాక్ట్ డిజైన్‌లో ఉండనుంది. భారత బిజీ రోడ్లపై, ఇరుకు వీధుల్లో, వర్షాకాలంలో నీటిగుంతలు ఉండే ప్రాంతాల్లో ప్రయాణానికి అనువుగా ఉండేలా తయారు చేయనున్నారు. ఇందులోని స్లోపింగ్ ఎయిర్ బ్లాకర్, ఫ్లాట్ ఫ్లేర్, ఎక్స్‌టెండెడ్ వీల్ బేస్, అడ్జస్టబుల్ బాడీ హైట్, లార్జ్ టైర్స్, towing హుక్ వంటి డిజైన్ ఎలిమెంట్స్.. ఈ వాహనానికి వినూత్నతతను అందించనున్నాయి.
ఈ ఈవీలో మాడ్యూలర్ ఇంటీరియర్స్, ఫ్లెక్సిబిలిటీ కోసం పెగ్ బోర్డ్- స్టైల్ ప్యానెల్స్, స్టోరేజ్ సొల్యూషన్స్, వీల్‌ఛైర్ యాక్సెస్ కోసం ఫ్లోడేబుల్ సీట్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఇది 'Akashi Blue' షేడ్‌లో రానుంది. అదే సమయంలో ఇందులో హీట్- రెడ్యూసింగ్ మెటీరియల్స్, వాటర్- రెసిస్టెంట్ ఇంటీరియర్స్ వంటివి భారత వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పని చేస్తాయి.
ఇది కేవలం ప్యాసెంజర్ వాహనంలానే కాకుండా ఓ ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనంలానూ, లాజిస్టిక్స్ సొల్యూషన్‌లాను, ఒక అంబులెన్స్‌లాను పని చేస్తుంది. ఇదే క్రమంలో హ్యూందాయ్, టీవీఎస్ సంస్థలు మరో ఎలక్ట్రిక్ ఫోర్- వీలర్ కాన్సెప్ట్‌ను కూడా అభివృద్ధి చేశాయి. గ్లోబల్ మార్కెట్లో వివిధ రకాల ప్రయోజనాల కోసం వీటిని పరిచయం చేసేందుకు ఈ రెండు సంస్థలు పని చేస్తున్నాయి.
లాస్ట్ మైల్ మొబిలిటీ డిమాండ్లను తీర్చడంతో పాటు, కొత్త- తరం వాహనాలను అంతర్జాతీయ స్థాయిలో అందించడానికి ఈ రెండు సంస్థలు కృషి చేస్తున్నాయి. తమ అనుకూలతలతో.. ఈ రెండు కంపెనీలు భారత వినియోగదారులకు సౌకర్యవంతమైన, స్థిరమైన, వినూత్నతతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు దృష్టి కేంద్రీకరించాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








