33 అంగుళాల టైర్లతో ఇది రోడ్డు మీద పోతున్న రాక్షసుడు..అడవుల్లో తిరిగే సైతాన్..టాటా, మహీంద్రాకు చుక్కలే

హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ ఎల్ఏ ఆటో షో 2025లో తన కొత్త క్రేటర్ ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ప్రదర్శించి ఆటోమొబైల్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పూర్తిస్థాయిలో ఆఫ్-రోడింగ్ కోసం రూపొందించబడింది. ఇది హ్యుందాయ్ XRT సిరీస్‌లో నెక్ట్స్ స్టెప్‎గా నిలుస్తుంది. దీనిని కేవలం రోడ్లపైనే కాకుండా ఎలాంటి కఠినమైన భూభాగంలోనైనా సులభంగా ప్రయాణించగలిగేలా తీర్చిదిద్దారు. హ్యుందాయ్ ఆఫ్-రోడ్ సెగ్మెంట్‌లో ఈ క్రేటర్ ఒక పెద్ద మార్పు తీసుకువస్తుందని అంచనా.

ఈ క్రేటర్ కాన్సెప్ట్ డిజైన్‌ను హ్యుందాయ్ ఆర్ట్ ఆఫ్ స్టీల్ అని పిలుస్తోంది. కఠినమైన, ఎక్స్‌ట్రీమ్ వాతావరణాల నుంచి ప్రేరణ పొంది, కాలిఫోర్నియాలోని హ్యుందాయ్ అమెరికా టెక్నికల్ సెంటర్‌లో దీనిని అభివృద్ధి చేశారు. ఈ కారు రూపురేఖలు చాలా బోల్డ్‌గా, రగ్గడ్‌గా, మస్కులర్‌గా కనిపిస్తాయి. మోనోకోక్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించినప్పటికీ దీని భారీ హుడ్ కారణంగా ఇది స్ట్రెయిట్‌గా, నిటారుగా ఉండే స్టాన్స్ను కలిగి ఉంది.

Hyundai Unveils Crater Off-Road Concept SUV at LA Auto Show 2025 XRT Series Next Evolution

దీనిలో అత్యంత ముఖ్యమైనవి 33 అంగుళాల ఆఫ్-రోడ్ టైర్లు. ఇవి 18 అంగుళాల చక్రాలకు అమర్చబడి ఉంటాయి. ఎలాంటి కఠినమైన ప్రదేశాలలోనైనా, ట్రాక్‌లలోనైనా ఇవి తట్టుకుని ముందుకు పోగలవు. లైటింగ్‌లో భాగంగా పారామెట్రిక్ పిక్సెల్ ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. రూఫ్‌పై అదనంగా ఏర్పాటు చేసిన ఆక్సిలరీ లైట్ దీనికి మరింత షార్ప్ ఆఫ్-రోడ్ లుక్‌ను ఇచ్చింది. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనాలలో కనిపించే నాలుగు చుక్కల లోగో కూడా ఈ కాన్సెప్ట్‌లో ఉంది.

హ్యుందాయ్ కార్లలో ఉండే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఈ క్రేటర్ కాన్సెప్ట్ ఇంటీరియర్‌లో కూడా ఉంది. ఇక్కడ మరింత ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డైనమిక్ హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, పట్టుకోవడానికి సులభంగా ఉండే ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఉన్నాయి.

Hyundai Unveils Crater Off-Road Concept SUV at LA Auto Show 2025 XRT Series Next Evolution

క్యాబిన్ మొత్తం హై క్వాలిటీ గల బ్రౌన్ క్రాష్‌ప్యాడ్‌తో సహా స్మూత్, మన్నికైన పదార్థాలతో తయారు చేశారు. దీనికి ఆరెంజ్ యాక్సెంట్స్ జోడించి, స్పోర్టీ లుక్ ఇచ్చారు. ఇందులో స్నో, శాండ్, మడ్, ఆటో, XRT వంటి అనేక డ్రైవింగ్ మోడ్‌లను ప్రదర్శించే సెంటర్ పిక్సెల్ డిస్‌ప్లే ఉంది. సాంప్రదాయ సీట్లకు బదులుగా, 3డీ వ్రాప్‌అరౌండ్‌లు అమర్చారు. ఇవి ఆఫ్-రోడింగ్ సమయంలో కూడా డ్రైవర్, ప్రయాణికులకు స్టెబిలిటీ, సౌకర్యాన్ని అందిస్తాయి.

బీవైఓడీ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన విధంగా కొన్ని మార్పులు చేసుకునే అవకాశం (కస్టమైజేషన్) కల్పించారు. సాధారణ ఎస్‌యూవీల మాదిరిగా కాకుండా ఈ క్రేటర్ కాన్సెప్ట్ పూర్తిస్థాయి ఆఫ్-రోడింగ్‌కు అవసరమైన హార్డ్‌వేర్‌ను కలిగి ఉంది.

Hyundai Unveils Crater Off-Road Concept SUV at LA Auto Show 2025 XRT Series Next Evolution

ఇందులో డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ట్రైలర్ బ్రేక్ కంట్రోల్, కంపాస్, ఆల్టిమీటర్, మల్టీ-ఫంక్షన్ ఆఫ్-రోడ్ కంట్రోలర్ వంటి టూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ముందు, వెనుక లాకింగ్ డిఫరెన్షియల్‌లు, ట్రాక్షన్, బ్రేకింగ్ మేనేజ్‌మెంట్ వంటి కీలకమైన ఆఫ్-రోడ్ ఫీచర్లను జోడించారు. ఇంజన్ గురించి హ్యుందాయ్ స్పష్టమైన వివరాలు ఇవ్వనప్పటికీ ఈ మోడల్ ఐసీఈ (పెట్రోల్/డీజిల్), ఎలక్ట్రిక్ (EV) వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు.

హ్యుందాయ్ కంపెనీ త్వరలోనే పూర్తిస్థాయి ఆఫ్-రోడ్ సామర్థ్యం గల ఎస్‌యూవీని భారత మార్కెట్‌లోకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఈ కొత్త కారులో క్రేటర్ కాన్సెప్ట్ నుంచి అనేక డిజైన్, ఆఫ్-రోడ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇది భారతీయ ఆఫ్-రోడ్ సెగ్మెంట్‌లో (ముఖ్యంగా మహీంద్రా థార్ వంటి వాటికి) బలమైన పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Sunday, November 23, 2025, 11:15 [IST]
English summary
Hyundai unveils crater off road concept suv at la auto show 2025 xrt series next evolution
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+