సరికొత్త ఆయుధాన్ని దింపుతున్న హ్యుందాయ్! రోడ్డుపై కనిపించిన కొత్త వెర్షన్.. పెరిగిన హైప్!

భారత ఆటోమొబైల్ రంగం అభివృద్ది మరింత వేగవంతం అయింది. ప్రతి నెలా కొత్త కార్లు మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి. వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్న నేపధ్యంలో, వాహన తయారీ సంస్థలు కూడా అదే వేగంతో తమ వ్యూహాలను మార్చుకుని కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అలాగే ఇప్పటికే ఉన్న పాపులర్ కార్లను మరింత ఆకర్షణీయంగా మార్చి తీసుకురావడంలో తయారీదారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి సమయంలో హ్యుందాయ్ నుండి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మరో కొత్త కారును భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతుంది. రాబోయే తదుపరి తరం హ్యుందాయ్ వెన్యూ 2026లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

దేశీయ రహదారులపై ఈ కొత్త కారును పరీక్షలు చేస్తూ కనిపించింది. ఇప్పటివరకు స్పై ఇమేజ్‌ల ఆధారంగా అందిన వివరాల ప్రకారం, ఇది హ్యుందాయ్ కారు డిజైన్ పరంగా ఓ కొత్త లుక్‌ను అందించే అవకాశం ఉంది. క్తివంతమైన ప్రొఫైల్, స్పోర్టీ లుక్, మెరుగైన ఫీచర్లతో ఈ SUV రూపొందించబడుతోంది. 2026లో ఈ మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశాలున్నాయని చర్చలు జరుగుతున్న సమయంలో దీని గురించి మరిన్ని వివరాలు చూద్దాం.

Hyundai Upcoming Venue

హ్యుందాయ్ భారత మార్కెట్లో ఇప్పటికే బాగా ప్రజాదరణ పొందిన బ్రాండ్. క్రెటా, వెర్నా వంటి మోడళ్లతో ప్రజల మనసుల్లో నిలిచిన ఈ సంస్థ, ఇప్పుడు సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఈ మోడల్‌ను తీసుకురావడానికి సిద్ధం అయింది. ఇది విడుదలైతే, మార్కెట్లో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. టాటా, మారుతి, కియా లాంటి వాటికి పోటీ తప్పదు.

టెస్టింగ్ స్టేజీలో ఉన్న ఈ కొత్త సబ్ కాంపాక్ట్ SUV కారును బయటకు కనిపించకుండా జాగ్రత్తగా ముసుగుపెట్టినా, దాని డిజైన్ వివరాలు కొంతవరకూ బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, వీల్ కవర్లతో కూడిన స్టీల్ రిమ్‌లు స్పష్టంగా కనిపించాయి. ఇవి ఈ మోడల్ ప్రీ-ప్రొడక్షన్ స్టేజీలో ఉందని సూచిస్తున్నాయి. ముందుభాగానికి వస్తే, ఇది స్ప్లిట్ LED DRL డిజైన్, హెడ్‌లాంప్ సెటప్‌తో స్క్వేర్డ్-ఆఫ్ స్టైలింగ్‌తో కనిపిస్తోంది.

Hyundai Upcoming Next Gen Venue Will Be Launch Soon

LED DRLs లేటెస్ట్ టచ్‌ను ఇచ్చినా, ప్రధాన హెడ్‌లైట్లు మాత్రం LEDలకు బదులుగా హాలోజన్ లైట్లతో వస్తుండటం కొంత ఆశ్చర్యకరం. ఇది తక్కువ ట్రిమ్ వేరియంట్‌కు సంబంధించిన మోడల్ కావచ్చు అని అంచనాలు కూడా వెలువడుతున్నాయి. వెనుక పార్కింగ్ సెన్సార్లను కొత్త వేరియంట్లో కూడా కొనసాగించే అవకాశముంది. వెనుక భాగం విషయానికి వస్తే, కొత్త వెన్యూ మరింత ఆకర్షణీయమైన, లేటెస్ట్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

కనెక్ట్ చేయబడిన LED టెయిల్ లాంప్స్ దీనికి స్టైలిష్ లుక్ ఇవ్వడమే కాకుండా, ప్రీమియం ఫీలింగ్‌ను అందిస్తాయి. సిల్వర్ ఫినిష్‌తో ఉన్న బంపర్ ఈ కారుకు రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తుంది. ఇది బ్లాక్ షార్క్ ఫిన్ యాంటెన్నా లేటెస్ట్ SUVలలో కనిపించే డిజైన్‌ మాదిరిగా ఉంటుంది. ప్రస్తుత వెన్యూ మోడల్‌తో పోలిస్తే, కొత్త మోడల్‌లో అల్లాయ్ వీల్ డిజైన్ మరింత స్పోర్టీగా మారింది. డైనమిక్ డిజైన్ అందరిని ఆకట్టుకుంటుంది.

Hyundai Upcoming Next Gen Venue Spotted

బాడీకి కలర్ కాంట్రాస్ట్‌లో ఉండే స్టైలిష్ ORVMలు ఒక స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి. ఇంజిన్ విభాగంలో మార్పులు పెద్దగా లేవు. బేసిక్ వేరియంట్‌కి 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 82bhp శక్తిని, 114Nm టార్క్‌ను అందిస్తుంది. మరోటి 1.0-లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ఉండగా, ఇది 118bhp పవర్, 172Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్ 1.5-లీటర్ డీజిల్ 114bhp శక్తిని, 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, May 2, 2025, 15:36 [IST]
English summary
Hyundai upcoming next gen venue will be launch soon in india its spotted on while testing
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+