వెన్యూ vs సోనెట్: రెండింటిలో ఏది బెస్ట్? తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఏది ఇస్తుంది? అసలైన తేడా ఇదే!

హ్యుందాయ్ (hyundai) తాజాగా విడుదల చేసిన 2025 వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కొత్తదనం తీసుకొచ్చింది. కియా సోనెట్‌తో తలపడే ఈ కొత్త వెర్షన్, స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో ప్రత్యేకతను సంతరించుకుంది. వెన్యూ ఫేస్‌లిఫ్ట్ కొత్త టెక్నాలజీ, మెరుగైన రైడ్ క్వాలిటీ, కొత్త ఇంటీరియర్ ఫినిష్‌తో మరింత ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇదే సమయంలో, కియా సోనెట్ కూడా తన తాజా ఫేస్‌లిఫ్ట్ ద్వారా మరింత సేఫ్టీ ఫీచర్లు, కనెక్టివిటీ ఆప్షన్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసింది. కొత్తగా కారు కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారు ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ రెండు కార్ల మధ్య ఉన్న తేడాలను ఒకసారి చూద్దాం.

ఇంజిన్ పరంగా చూసుకుంటే, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ రెండూ తమ విభాగంలో అత్యంత వైవిధ్యమైన ఇంజిన్ ఎంపికలను అందిస్తున్నాయి. కియా సోనెట్ మూడు ఇంజన్ ఆప్షన్లతో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్‌లో వస్తోంది. ఈ ఇంజిన్‌లు మాన్యువల్, ఆటోమేటిక్, iMT ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉండటం వల్ల ప్రతి డ్రైవర్‌కు తగిన అనుభవాన్ని ఇస్తాయి.

Hyundai Venue And Kia Sonet Price Milegae And Engine Details

హ్యుందాయ్ వెన్యూ కొత్త వెన్యూ కప్పా 1.2 లీటర్ MPI పెట్రోల్ యూనిట్, 1.0 లీటర్ టర్బో GDI పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ CRDi డీజిల్ ఇంజన్ ఎంపికలను అందిస్తోంది. ఇంజిన్ పరంగా ఈ రెండు SUVs మధ్య తేడా కేవలం నంబర్లలో మాత్రమే కాకుండా, వాటి డ్రైవింగ్ క్యారెక్టర్‌లో కనిపిస్తుంది. సోనెట్ స్పోర్టీనెస్, స్మార్ట్ డైనమిక్స్‌పై దృష్టి పెడుతుండగా, వెన్యూ స్మూత్‌నెస్, కంఫర్ట్, బ్యాలెన్స్‌డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకర్షిస్తోంది.

ధరల విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మధ్య పోటీ నిజంగా గట్టిగానే ఉంది. 2025 హ్యుందాయ్ వెన్యూ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.90 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ రూ.15.69 లక్షల వరకు వెళ్తుంది. ఈ విస్తృత ధర శ్రేణి కారణంగా వెన్యూ, బడ్జెట్ కస్టమర్‌ నుండి ప్రీమియం SUV అనుభవం కోరుకునే వరకు ప్రతి విభాగానికి సరిపోయే వేరియంట్‌లను అందిస్తోంది.

Hyundai Venue And Kia Sonet Price Milegae And Engine Details

అదే సమయంలో, కియా సోనెట్ తన ధరల నిర్మాణంలో కాస్త బడ్జెట్-ఫ్రెండ్లీగా ఉంది. సోనెట్ ప్రారంభ ధర రూ.7.30 లక్షలు మాత్రమే, అంటే వెన్యూ కంటే కొద్దిగా తక్కువ. టాప్ ట్రిమ్ ధర మాత్రం రూ.14.09 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలతో, కియా సోనెట్ ఎంట్రీ-లెవల్ SUV కొనుగోలుదారులకు ఒక ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. సరసమైన ధరతో పాటు, ఫీచర్లలో తగ్గింపులు లేకపోవడం సోనెట్‌కి మరో ప్లస్ పాయింట్.

మైలేజ్ విషయానికి వస్తే, కార్ కొనుగోలుదారుడు ప్రాధాన్యతనిచ్చే అంశం. ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, మంచి మైలేజ్ అంటే జేబుకూ, మీ రోజువారీ ప్రయాణానికీ రెండింటికీ రిలీఫ్ అని చెప్పొచ్చు. వెన్యూ NA పెట్రోల్ ఇంజన్ లీటరుకు 18.05 కి.మీ, టర్బో పెట్రోల్ ఇంజన్ లీటరుకు 20 కి.మీ మైలేజ్ ఇస్తుంది. డీజిల్ ఇంజన్ మాన్యువల్‌లో లీటరుకు 20.99 కి.మీ, ఆటోమేటిక్‌లో లీటరుకు 17.9 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

Hyundai Venue And Kia Sonet Price Milegae And Engine Details

కియా సోనెట్ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్లు 18.4 kmpl మైలేజీని అందిస్తాయి. డీజిల్ మాన్యువల్ 24.1 kmpl, డీజిల్ ఆటోమేటిక్ 19 kmpl, పెట్రోల్ IMT వేరియంట్లు 18.4 kmpl మైలేజీని అందిస్తాయి. మొత్తం మీద, హ్యుందాయ్ వెన్యూ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లలో రెండింటిలోనూ మంచి మైలేజ్ ఫిగర్లు చూపిస్తూ, డ్రైవింగ్ ఆనందాన్ని తగ్గించకుండా ఆర్థికంగా కూడా సమతుల్యమైన SUVగా నిలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, November 14, 2025, 9:25 [IST]
English summary
Hyundai venue and kia sonet price milegae and engine details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+