యూతే దీని టార్గెట్.. రేపే దిగుతున్న మొనగాడు.. ఇప్పటికే రూ.25000లతో బుక్ చేసుకున్న కస్టమర్లు

హ్యుందాయ్ కార్స్ ఇండియా (Hyundai Cars India) తమ పాపులర్ ఎస్‌యూవీ వెన్యూ (Venue)ను పూర్తిగా రీడిజైన్ చేసి, మరింత స్పోర్టీ లుక్‌తో ఎన్ లైన్ (N Line) వెర్షన్‌ను తీసుకురాబోతోంది. నవంబర్ 4, 2025న విడుదల కానున్న ఈ 2026 మోడల్‌కు సంబంధించి బుకింగ్స్ ఇప్పటికే రూ.25,000 అడ్వాన్స్‌తో మొదలయ్యాయి.

ఈ కొత్త ఎస్‌యూవీ యూత్ లక్ష్యంగా చేసుకుని తయారు చేయబడింది. ఇది కేవలం ఫేస్‌లిఫ్ట్ మాత్రమే కాదు, పూర్తిగా రీడిజైన్ చేయబడిన మోడల్. పాత మోడల్ కంటే ఇది 48 మి.మీ ఎత్తుగా, 30 మి.మీ వెడల్పుగా ఉండటం విశేషం. లేటెస్ట్ డిజైన్, మెరుగైన భద్రత, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త వెన్యూ ఎన్ లైన్ వివరాలు తెలుసుకుందాం.

Hyundai Venue N Line Unveiled Sporty Look New Features Launching November 4

హ్యుందాయ్ కొత్త వెన్యూ ఎన్ లైన్ మోడల్‌ను నవంబర్ 4, 2025న అధికారికంగా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మోడల్‌ను కేవలం ఫేస్‌లిఫ్ట్‌గా కాకుండా, పూర్తిగా రీడిజైన్ చేయడం జరిగింది. ఈ కొత్త మోడల్ పాత వెన్యూతో పోలిస్తే 48 మి.మీ ఎత్తుగా, 30 మి.మీ వెడల్పుగా ఉంటుంది. దీని మొత్తం కొలతలు 3995 మి.మీ పొడవు, 1800 మి.మీ వెడల్పు, 1665 మి.మీ ఎత్తుగా ఉన్నాయి. వీల్‌బేస్ (2520 మి.మీ) మాత్రం పాత మోడల్ మాదిరిగానే కొనసాగుతుంది.

ఇది స్పోర్టీ స్టైలింగ్‌తో పాటు మెరుగైన సస్పెన్షన్, ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ థీమ్‌తో వస్తుంది. వెన్యూ ఎన్ లైన్ ఎక్సటర్నల్ డిజైన్ దీనికి మరింత డైనమిక్, పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ లుక్‌ను ఇస్తుంది. ఇందులో LED DRLs, క్వాడ్ బీమ్ LED హెడ్‌ల్యాంప్స్, సీక్వెన్షియల్ LED టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. ముందు, వెనుక బంపర్లపై రెడ్ కలర్ యాక్సెంట్లు, ట్విన్ టిప్ ఎగ్జాస్ట్, వింగ్ టైప్ స్పాయిలర్ దీని స్పోర్టీ అప్పీల్‌ను పెంచుతాయి.

Hyundai Venue N Line Unveiled Sporty Look New Features Launching November 4

N ఎంబ్లెమ్‌తో కూడిన R17 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, రెండ్ కలర్ బ్రేక్ కాలిపర్‌లు ఈ మోడల్‌కు స్పెషల్ అట్రాక్షన్. ఇది మొత్తం 7 రంగులలో లభిస్తుంది. మోనో-టోన్ ఆప్షన్లలో హేజెల్ బ్లూ, డ్రాగన్ రెడ్, టైటాన్ గ్రే, అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్ ఉన్నాయి. డ్యూయల్-టోన్ ఆప్షన్లలో అబిస్ బ్లాక్ రూఫ్‌తో కూడిన హేజెల్ బ్లూ, డ్రాగన్ రెడ్, అట్లాస్ వైట్ రంగులు అందుబాటులో ఉన్నాయి.

కొత్త వెన్యూ ఎన్ లైన్ క్యాబిన్ లోపల పూర్తిగా బ్లాక్ థీమ్‌తో పాటు, టెక్నాలజీ పరంగా అనేక ముఖ్యమైన అప్‌డేట్‌లను కలిగి ఉంది. డ్యాష్‌బోర్డ్‌పై డ్రైవర్ సమాచారం, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం డ్యూయల్ 12.3 అంగుళాల కర్వ్డ్ పానోరామిక్ డిస్‌ప్లే అమర్చారు. ఇది ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.

Hyundai Venue N Line Unveiled Sporty Look New Features Launching November 4

ఇంటీరియర్‌లో N లైన్ ఎక్స్‌క్లూజివ్ స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్ట్ నాబ్, స్పోర్టీ మెటల్ పెడల్స్, రెడ్ హైలైట్‌లతో కూడిన బ్లాక్ లెదరెట్ సీట్స్ ఉన్నాయి. అంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

వెన్యూ ఎన్ లైన్ పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ ఎస్‌యూవీ అయినప్పటికీ, సేఫ్టీకి పెద్ద పీట వేసింది. ఈ కారు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 118 బీహెచ్‌పీ శక్తిని, 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏడు-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

సేఫ్టీ పరంగా ఈ మోడల్ 6 ఎయిర్‌బ్యాగ్స్, 70+ అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. ముఖ్యంగా ఇందులో ADAS లెవల్ 2, సరౌండ్ వ్యూ మానిటర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, November 3, 2025, 14:15 [IST]
English summary
Hyundai venue n line unveiled sporty look new features launching november 4
Read more on: #hyundai #new lauch #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+