తక్కువ ధర, లెక్కకు మించిన ఫీచర్లు..అప్డేట్ వెర్షన్ కోసం షోరూంలకు క్యూ కడుతున్న జనాలు

ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా 2025 నవంబర్ నెలలో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో కలిపి మొత్తం 66,840 యూనిట్లను విక్రయించి హ్యుందాయ్ దూసుకుపోయింది. దేశీయంగా 50,340 యూనిట్లు అమ్మి 4.34% వృద్ధిని సాధించింది. ఎప్పటిలాగే క్రెటా (17,344 యూనిట్లు) తన హవా కొనసాగించగా, ఇటీవల పూర్తి అప్‌డేట్‌తో విడుదలైన కొత్త తరం వెన్యూ కూడా భారీ అమ్మకాలతో సత్తా చాటింది. లాంచ్ అయిన నెల రోజుల్లోనే 32,000 బుకింగ్‌లు సాధించిన వెన్యూ డిమాండ్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 2025లో ఏకంగా 11,645 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గత ఏడాది (నవంబర్ 2024)లో 9,754 యూనిట్లు మాత్రమే విక్రయించింది. అంటే, ఏడాది కాలంలో 1,891 యూనిట్లు అదనంగా విక్రయించగలిగింది. దీంతో వార్షిక వృద్ధి ఏకంగా 19 శాతంగా నమోదైంది.

Hyundai Venue Sales Jump 19 in November After Major Update Demand Surges

ఈ అమ్మకాలతో గత నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో వెన్యూ 15వ స్థానంలో నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మాత్రం టాటా నెక్సాన్, టాటా పంచ్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్ తర్వాత ఆరో స్థానంలో ఉంది. రాబోయే నెలల్లో వెన్యూ సేల్స్ చార్ట్‌లో మరింత పైకి వెళ్తుందని హ్యుందాయ్ ఆశిస్తోంది.

సెగ్మెంట్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన వెన్యూకు ఇటీవల పూర్తి స్థాయి జనరేషన్ అప్‌డేట్ లభించింది. ఈ అప్‌డేట్‌లో కొత్త డిజైన్, అప్‌గ్రేడ్ అయిన ఫీచర్ల జాబితా, కొత్త పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా డిజైన్ పరంగా చూస్తే, కొత్త వెన్యూ ముందు భాగం హ్యుందాయ్ అల్కాజార్, క్రెటా వంటి మోడళ్లను పోలి ఉంది.

Hyundai Venue Sales Jump 19 in November After Major Update Demand Surges

పక్క భాగంలో మస్కులర్ లుక్‌తో పాటు వెన్యూ బ్యాడ్జింగ్‌తో C-పిల్లర్ ఇన్‌సర్ట్ ఉన్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లతో 3D మోటిఫ్‌ను ఇచ్చి, కొత్త లుక్‌ను అందించారు. న్యూ జనరేషన్ వెన్యూలో క్యాబిన్ మరింత విశాలంగా, కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌తో ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం డ్యూయల్ 12.3-అంగుళాల కర్వ్‌డ్ స్క్రీన్ సెటప్‌ను ఇవ్వడం వలన ఇది మరింత ప్రీమియంగా కనిపిస్తోంది.

అంతేకాకుండా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, వాయిస్ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవ్ మోడ్‌లు, 4-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Hyundai Venue Sales Jump 19 in November After Major Update Demand Surges

సేఫ్టీ విషయంలో కూడా కొత్త వెన్యూ అదరగొట్టింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, ఆటో-హోల్డ్, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సాధారణ ఫీచర్లతో పాటు, అప్‌గ్రేడ్ చేసిన లెవెల్ 2 ADAS (Advanced Driver Assistance System) సూట్ కూడా లభిస్తోంది.

ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, పాత తరం మోడల్‌లో ఉన్న 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లను కొత్త వెన్యూలో కూడా కొనసాగిస్తున్నారు. అయితే, డీజిల్ ఇంజిన్‌కు ఇప్పుడు ఆప్షనల్‌గా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లభించడం ఒక హైలైట్.

ఈ కొత్త వెన్యూ లీటరుకు 17.9 కి.మీ నుండి 20.99 కి.మీ వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అప్‌డేట్ చేసిన వెన్యూ ధరలు రూ. 7.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కు రూ.15.69 లక్షల వరకు ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు లభిస్తుండటంతోనే వెన్యూ కోసం జనం షోరూమ్‌ల ముందు క్యూ కడుతున్నారు.

More from DriveSpark

Article Published On: Sunday, December 14, 2025, 9:38 [IST]
English summary
Hyundai venue sales jump 19 in november after major update demand surges
Read more on: #hyundai #new car #car sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+