కిరాక్ లుక్స్, అదిరే ఫీచర్లు.. హ్యుందాయ్ వెర్నా కొత్తగా ముస్తాబై వచ్చేస్తోంది.. త్వరగా కొనేయండి
భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్లలో హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) ఒకటి. స్టైలిష్ లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, మంచి పెర్ఫార్మెన్స్‌కు ఇది పెట్టింది పేరు. తమ సెడాన్ విభాగంలో కొత్త స్థాయిని సృష్టించేందుకు లక్ష్యంగా, హ్యుందాయ్ సంస్థ 2026 వెర్నా ఫేస్‌లిఫ్ట్ (Verna Facelift) ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇటీవల బయటికొచ్చిన ఈ కొత్త వెర్నా స్పై షాట్‌ల ఆధారంగా, ఈ మోడల్ అప్‌డేటెడ్ డిజైన్, మరింత మెరుగైన టెక్నాలజీ, లెవెల్ 2 ADAS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది. కొత్త వెర్నా డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.

2026 వెర్నా ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, కొన్ని అప్‌డేట్‌లను ఇది అందిస్తోంది. ఇందులో చాలా ఫీచర్లు ఇటీవల విడుదలైన హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) మోడల్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు బంపర్ మరింత షార్ప్ లైన్స్‌తో తీక్షణంగా ఉండేలా డిజైన్ చేసే అవకాశం ఉంది. అలాగే, లైటింగ్ ఎలిమెంట్స్, గ్రిల్లో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉంది.
సైడ్ ప్రొఫైల్ పెద్దగా మారకపోయినా, షార్ప్ క్యారెక్టర్ లైన్స్‌తో పాటు కొత్త అల్లాయ్ వీల్స్‌ను జోడించవచ్చు. డోర్ లైన్‌పై క్రోమ్ ట్రిమ్ లైన్‌లు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. వెనుకవైపు, కొత్త డిజైన్ గల టెయిల్‌ల్యాంప్స్, బూట్-లిడ్-మౌంటెడ్ స్పాయిలర్ ఉండే అవకాశం ఉంది.
వెర్నా ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ లోపల టెక్నాలజీ పరంగా అనేక అప్‌డేట్‌లు ఉన్నాయి. ఇవి దీన్ని మరింత మోడ్రన్‌గా మారుస్తాయి. ఇంటీరియర్‌లో తాజా హ్యుందాయ్ వెన్యూను గుర్తుచేసేలా, కర్వ్డ్ డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్ ఉండే అవకాశం ఉంది. ఇది డ్రైవర్‌కు మరింత అల్ట్రా మోడ్రన్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

కొత్త స్టీరింగ్ వీల్‌కు టెక్నాలజీ కంట్రోలర్‌లను జతచేయడం, టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద స్క్రీన్‌లతో పాటు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మెరుగైన వాయిస్/కనెక్టెడ్ కార్ ఇంటర్‌ఫేస్ కూడా ఉంటాయి.
ప్రస్తుత మోడల్‌లోని సేఫ్టీ ఫీచర్లను కొనసాగిస్తూ, కొత్త వెర్నాను మరింత పవర్ఫుల్ పాసివ్ సేఫ్టీతో తయారు చేస్తున్నారు. కొత్త వెర్నాలో లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్ కొనసాగుతుంది. ఇందులో లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి స్మార్ట్ టెక్నాలజీలు ఉన్నాయి.
సేఫ్టీని మరింత పెంచుతూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అందరు ప్రయాణీకులకు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి ఉంటాయి. దీంతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు కొత్త వెర్నాలో అందుబాటులో ఉంటాయి.
వెర్నా ఫేస్‌లిఫ్ట్ దాని తరగతిలో అత్యంత ఇంధన సామర్థ్యం గల సెడాన్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. పాత ఇంజిన్ ఆప్షన్లు కొనసాగే అవకాశం ఉంది. హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ దాని తరగతిలో అత్యధిక ఇంధన సామర్థ్యం గల సెడాన్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్ ప్రస్తుత వెర్నాలో ఉన్న రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లను కొనసాగిస్తుంది.
1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 115 bhp (బ్రేక్ హార్స్‌పవర్) శక్తిని, 143.8 Nm (న్యూటన్ మీటర్) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లేదా IVT (ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. మైలేజ్ పరంగా ఈ ఇంజిన్ సుమారుగా లీటరుకు 18 నుంచి 19కిమీ వరకు ఇవ్వగలదని అంచనా.
1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్-ఆధారిత డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ అత్యంత పవర్ఫుల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా అందిస్తుంది. ఈ ఇంజిన్ 160 bhp శక్తిని, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది విభాగంలోనే అత్యధిక శక్తినిచ్చే ఇంజిన్లలో ఒకటి.
ఇది కేవలం 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఇంతటి పవర్పుల్ ఇంజిన్ అయినప్పటికీ, ఇది సుమారుగా లీటరుకు 20కిమీ వరకు మైలేజీని అందించి, ఇంధన సామర్థ్యాన్ని కూడా నిలబెట్టుకుంటుంది.


Click it and Unblock the Notifications








