ఒకప్పుడు క్యూలో నిలబడి కొనేవారు.. ఇప్పుడు కనీసం 1000 మంది కూడా కొనలేదు.. ఆ కారు ఎదో తెలుసా?

హ్యుందాయ్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి నెల సేల్స్‌ను వెల్లడించే సందర్భంలో ఈ కంపెనీ మోడల్స్‌లో ఎక్కువ భాగం మంచి సేల్స్‌ను కనబరుస్తుంటాయి. అయితే, అన్ని మోడల్స్ ఒక్కసారిగా స్థిరమైన సేల్స్‌ను ఇవ్వలేవు. తాజాగా విడుదలైన జూలై 2025 సేల్స్ నివేదికలో ఈ విషయం మరొక్కసారి రుజువైంది. ముఖ్యంగా కంపెనీకి ప్రాధాన్యత కలిగిన మిడ్-సైజ్ సెడాన్ అయిన హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) గురించి చెప్పుకోవాలి. గత కొన్ని నెలలుగా ఈ కారు సేల్స్‌లో క్రమంగా తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ, జూలైలో ఆ స్థాయిని మించి గణనీయంగా వెనుకబడింది. నివేదికల ప్రకారం, ఈ కారు జూలై నెలలో కేవలం 826 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. ఇది ఒకప్పుడు మార్కెట్‌లో హాట్-సెల్లింగ్ కార్లలో ఒకటిగా నిలిచిన వెర్నాకు పెద్ద లోటు అని చెప్పుకోవాలి.

గతేడాది ఇదే నెలలో, అంటే జూలై 2024లో వెర్నా సేల్స్ 1,420 యూనిట్లు నమోదైంది. ఈ సారి దానితో పోలిస్తే గణనీయమైన తేడా కనిపిస్తోంది. సుమారు 42 శాతం వరకు తగ్గుదల అనేది వెర్నా కోసం ఆందోళన కలిగించే అంశమే. మిగతా మోడల్స్ ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో ఉన్న క్రెటా, ఎక్స‌టర్, వెన్యూ లాంటి వాహనాలు మాత్రం హ్యుందాయ్‌కు బలమైన అమ్మకాలను అందించాయి. కానీ వెర్నా మాత్రం ఉత్సాహాన్ని కొనసాగించలేకపోయింది.

Hyundai Verna Sedan July 2025 Sales Drop To 826 Units

హ్యుందాయ్ వెర్నా గతంలో మిడ్-సైజ్ సెడాన్ కేటగిరీలో మంచి ఆదరణ పొందిన మోడల్. అయితే, ఇటీవల నెలల సేల్స్ గణాంకాలను గమనిస్తే ఈ కారు క్రమంగా తన జోరు కోల్పోతూ వస్తోందని స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 2025లో 1,207 యూనిట్లు అమ్ముడవగా, మార్చిలో అది 1,364 యూనిట్లకు పెరిగింది. ఆ తర్వాత మళ్లీ పడిపోయే ధోరణి మొదలైంది. ఏప్రిల్‌లో 1,005 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

మే నెలలో 930 యూనిట్లు, జూన్‌లో 813 యూనిట్లు వరకు పడిపోయింది. తాజాగా జూలైలో 826 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, వరుసగా మూడునెలలుగా వెర్నా అమ్మకాలు 1,000 మార్క్‌ను దాటలేకపోయాయి. ఇది ఈ కారు మార్కెట్ స్థితి ఏ స్థాయిలో ఉందో సూచించే ముఖ్యమైన సంకేతం. మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నట్టు, SUVల పట్ల పెరుగుతున్న డిమాండ్ వెర్నా వంటి సెడాన్ కార్లను వెనక్కి నెట్టేస్తోంది.

Hyundai Verna Sedan July 2025 Sales Drop To 826 Units

ముఖ్యంగా హ్యుందాయ్ సొంత SUV మోడల్స్ క్రెటా, ఎక్స్‌టర్ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కార్లలో లభించే రోడ్ ప్రెజెన్స్, గ్రౌండ్ క్లియరెన్స్, ఫీచర్లు కస్టమర్లను SUVల వైపు మరింత ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా, వెర్నా వంటి మోడల్స్‌ను పరిశీలించే కస్టమర్లు చివరికి SUV వేరియంట్స్‌ను ఎంచుకుంటున్నారు. మారుతున్న కస్టమర్ ప్రాధాన్యతల కారణంగా దీనికి వచ్చే డిమాండ్ తగ్గిపోతోంది. కొత్త అప్‌డేట్స్‌తో తిరిగి వచ్చినట్లయితే దీనికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

హ్యూందాయ్ బేస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్‌ షోరూమ్ ధర రూ.11.07 లక్షల నుంచి ఉంటుంది. దీని ఆన్‌రోడ్ వచ్చేసరికి దాదాపుగా రూ.13.67 లక్షల వరకు ఉండవచ్చు. ఈ మోడల్ రెండు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులోకి వస్తుంది. వీటిలో ఒకటి 1.5 లీటర్ పెట్రోల్, మరొకటి టర్బో పెట్రోల్ ఇంజిన్. రెండు వేరియంట్లూ శక్తివంతమైన పనితీరుతో పాటు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి.

Hyundai Verna Sedan July 2025 Sales Drop To 826 Units

ఇంటీరియర్ విషయానికి వస్తే, వెర్నా ఎప్పటిలాగే తన ప్రీమియం ఫినిషింగ్, ఆధునిక లుక్, అధునాతన ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ నుంచి సేఫ్టీ ఫీచర్ల వరకు ప్రతిదీ కస్టమర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ప్రస్తుతం సేల్స్ తగ్గినప్పటికి వినాయక చవితి, నవరాత్రి, దీపావళి వంటి పండుగలు దగ్గరపడుతున్న సమయంలో సేల్స్ పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 20, 2025, 15:19 [IST]
English summary
Hyundai verna sedan july 2025 sales drop to 826 units amid suv demand
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+