అయ్యయ్యో.. హ్యుందాయ్ ఎంత పని చేసిందో! ఈ సెడాన్ కారు ధరను కూడా పెంచేసింది కదా!
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హ్యుందాయ్ మోటార్ పేరు సుపరిచితమే! అనేక సంవత్సరాలుగా ఈ బ్రాండ్ నుంచి వస్తున్న కార్లు వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. దేశీయ కారు అమ్మకాల్లో హ్యుందాయ్ సంస్థ రెండో స్థానంలో కొనసాగుతోంది. అట్రాక్టివ్ డిజైన్స్, ఫీచర్ల కలబోతతో ఈ సంస్థ నుంచి వస్తున్న కార్లు భారత కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఇటీవల ఈ సంస్థ తమ క్రెటా, అల్కాజర్ టుక్సాన్ ఆరా మోడళ్ల ధరలను పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో పాపులర్ సెడాన్ కారు మోడల్ 'వెర్నా' ధరను కూడా పెంచి మరోసారి ఝలక్ ఇచ్చింది.
హ్యుందాయ్ వెర్నా సెడాన్ కార్ ధర రూ.7,000 మేర పెరిగింది. దీంతో ఈ కారు ధర ప్రస్తుతం రూ.11.07 లక్షల నుంచి రూ. 17.55 లక్షలకు (ఎక్స్-షోరూం) చేరింది. ఈ కారు EX, S, X (O), SX (O) అని వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఈ వెర్నా కారు బయటి వైపు అట్రాక్టివ్ డిజైన్‌తో ఉంటుంది. ఇది Amazon grey, Titan grey, Typhoon silver Fiery red, Atlas white, Abyss black, Starry night అనే వివిధ కలర్ ఆప్షన్లతో ఉంటుంది. ఈ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇది 528 లీటర్ల బూట్ స్పేస్ అందిస్తుంది.
ఈ హ్యుందాయ్ కారు 2 పవర్‌ట్రైన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో చార్జ్‌డ్ ఇంజిన్.. 160 PS పవర్, 253 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT(డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్) గేర్‌బాక్స్‌తో అనుసంధానించి ఉంటుంది.

మరో 1.5-లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 115 PS పవర్, 144 Nm గరిష్ట టర్కు ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్, CVT గేర్ బాక్స్‌తో వస్తుంది. ఇది 18.6 నుంచి 20.6 kmpl మైలేజ్ అందించగలదు.
ఈ వెర్నా కారులో డజన్ల కొద్దీ అట్రాక్టివ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, సెమి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టం, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వెంటిలేటెడ్ & హీటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉంటాయి.

ఇక ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో 6- ఎయిర్ బ్యాగ్‌లు ఉంటాయి. ESB(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, TPMS(టైర్ ట్రెజర్ మానిటరింగ్ సిస్టం) ADAS(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్) వంటి ఫీచర్లు ఉంటాయి.
ఇన్ని అట్రాక్టివ్ ఫీచర్లతో ఉన్న ఈ వెర్నా సెడాన్ కార్ ధర పెరగడం.. వినియోగదారులకు కొంతమేర నిరాశకు గురి చేసే అంశమే! అయితే ఇది దీని సేల్స్‌పై అంతగా ప్రభావం చూపుతుందని చెప్పలేం. ఈ కారు అమ్మకాల గురించి తెలియాలంటే మరికొంత కాలం వరకు ఆగాల్సిందే.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదా


Click it and Unblock the Notifications








