ఏమైంది బ్రో.. ఈ జనాలకు ఆ కారును పిచ్చిపట్టినట్లు కొంటున్నారు.. ఫిబ్రవరిలో ఎన్ని అమ్ముడు పోయాయంటే ?

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. మన దేశంలో మారుతి సుజుకి తర్వాత హ్యుందాయ్ కంపెనీ కార్లు అత్యధికంగా అమ్ముడవుతాయి. సాధారణంగా ప్రతి నెలా సుమారు 50,000 కార్లను అమ్ముతున్న హ్యుందాయ్, ఫిబ్రవరిలో అమ్ముడైన కార్ల వివరాలను విడుదల చేసింది. ఈ గణాంకాల్లో అత్యధికంగా అమ్ముడైన హ్యుందాయ్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.

ఫిబ్రవరి 2025 నెలలో హ్యుందాయ్ మొత్తం 47,727 కార్లను విక్రయించింది. అయితే గతేడాది ఫిబ్రవరిలో 50వేల కంటే ఎక్కువ హ్యుందాయ్ మోడల్ కార్లు అమ్ముడయ్యాయి. ఆ నెలలో దాదాపు 50,201 హ్యుందాయ్ కార్లు అమ్ముడయ్యాయి. దాంతో పోల్చుకుంటే హ్యుందాయ్ కార్ల అమ్మకాలు ప్రస్తుతం 2,474యూనిట్లు తగ్గాయి. ఎప్పటిలాగే క్రెటా గత నెలలో అత్యధికంగా అమ్ముడైన హ్యుందాయ్ కారుగా నిలిచింది.

Hyundai Creta Review

గత నెలలో 16,317యూనిట్ల క్రెటా యూనిట్లను హ్యుందాయ్ విక్రయించింది. అయితే, హ్యుందాయ్ ఫిబ్రవరి 2024లో 15,276 క్రెటా కార్లను మాత్రమే విక్రయించింది. గతేడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో వెయ్యికి పైగా ఎక్కువ క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. 10,125 యూనిట్ల అమ్మకాలతో క్రెటా తర్వాత ఈ లిస్టులో హ్యుందాయ్ వెన్యూ రెండో స్థానంలో ఉంది. గతేడాది ఫిబ్రవరిలో 8,933 వెన్యూ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

దీని ప్రకారం ఈ ఫిబ్రవరిలో 1,192 వెన్యూ కార్లు ఎక్కువ అమ్ముడయ్యాయి. ఈ లిస్టులో మొదటి రెండు హ్యుందాయ్ కార్లు మాత్రమే గతేడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్కువ యూనిట్లను విక్రయించాయి. మిగతా అన్ని హ్యుందాయ్ మోడల్స్ అమ్మకాలు కూడా తగ్గాయి. ఫలితంగా హ్యుందాయ్ కార్ల మొత్తం విక్రయాలు తగ్గాయి.

Hyundai Venue

ఈ జాబితాలో మరో మోడల్ ఎక్సెటర్ మూడో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2024లో 7,582 ఎక్స్‌టర్ కార్లు అమ్ముడైతే, గత ఫిబ్రవరిలో 5,361 ఎక్స్‌టర్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ విషయంలో దాదాపు 2,221 ఎక్సెటర్ కార్లు తక్కువగా అమ్ముడుపోయాయి. దీని తర్వాత i10 Nios 4వ స్థానంలో ఉంది. ఈ తక్కువ ధర హ్యుందాయ్ కారు అమ్మకాల్లో పెద్దగా మార్పు లేదు.

గత నెలలో 4,940 i10 నియోస్ కార్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2024లో దాదాపు అంతే సంఖ్యలో i10 నియోస్ కార్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ సెడాన్ అవ్రా 4,797 యూనిట్ల అమ్మకాలతో 5వ స్థానంలో ఉంది. ఫిబ్రవరి 2024లో 5,053 అవ్రా కార్లు అమ్ముడయ్యాయి. ఇదే విధంగా ఫిబ్రవరి 2024లో 5వేల యూనిట్లకు పైగా అమ్ముడైన i20, గత నెలలో మాత్రం కేవలం 3,627 యూనిట్లు మాత్రమే అమ్ముడై ఆరో స్థానంలో ఉంది.

Hyundai Exter

7వ, 8వ స్థానాల్లో అల్కాజార్, వెర్నా కార్స్ ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో వాటి అమ్మకాల గణాంకాలు వరుసగా 1,264, 1,207నమోదయ్యాయి. ఇవి కాకుండా, హ్యుందాయ్ గత నెలలో 73 టక్సన్ కార్లు, 16 అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఎలక్ట్రిక్ కారు విక్రయాల్లో హ్యుందాయ్ దూసుకుపోతుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 12, 2025, 15:00 [IST]
English summary
Hyundais february 2025 sales analysis creta tops the list electric car sales rise
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+