ఇండియాలో లగ్జరీ కార్లన్నీ ఇక షెడ్డుకెళ్లాల్సిన టైం వచ్చిందా..తక్కువ ధరలో హ్యుందాయ్ అదిరిపోయే కారు
లగ్జరీ కార్లంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ లాంటి బ్రాండ్స్. ఇప్పుడు ఆ జాబితాలోకి హ్యుందాయ్ మోటార్స్ నుండి ఒక కొత్త పేరు చేరబోతోంది. అదే జెనసిస్ బ్రాండ్. హ్యుందాయ్ లగ్జరీ డివిజన్ అయిన జెనసిస్ త్వరలోనే భారత మార్కెట్లోకి రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా వంటి కార్లతో మార్కెట్‌లో దూసుకుపోతున్న ఈ సంస్థ, జెనసిస్‌తో లగ్జరీ కార్ల మార్కెట్‌లో కూడా అడుగు పెట్టనుంది. మరి జెనసిస్ ఎప్పుడు వస్తుంది, దాని ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హ్యుందాయ్ ఒక సంచలనం సృష్టించబోతుంది. హ్యుందాయ్ యొక్క లగ్జరీ బ్రాండ్ అయిన జెనసిస్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

జెనసిస్ కార్లను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ రూట్ ద్వారా భారతదేశంలోకి తీసుకురావాలని హ్యుందాయ్ ప్లాన్ చేస్తోంది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం 26 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కూడా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మోడల్స్‌లో పెట్రోల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడల్స్ కూడా ఉంటాయి. ఇది లగ్జరీ కార్ల మార్కెట్‌లో జెనసిస్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
హ్యుందాయ్ 2015లో అంతర్జాతీయ మార్కెట్‌లో జెనసిస్‌ను తమ లగ్జరీ డివిజన్‌గా ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా జెనసిస్ బ్రాండ్ G70, G80, G90, GV80, GV70 వంటి మోడళ్లను విడుదల చేసింది. ఈ మోడల్స్ అన్నీ తమ స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ ఇంజిన్లు, అడ్వాన్సుడ్ ఫీచర్లతో లగ్జరీ కార్ల మార్కెట్‌లో మంచి పేరు సంపాదించాయి.

ఒకవైపు జెనసిస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నప్పటికీ, హ్యుందాయ్ ప్రస్తుత కార్లు కూడా అద్భుతమైన అమ్మకాలను సాధిస్తున్నాయి. 2025 జనవరి నుంచి జూలై మధ్య కాలంలో హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ ఎస్‌యూవీగా రికార్డు సృష్టించింది. ఈ ఏడు నెలల్లో ఏకంగా 1,17,458 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 8% పెరుగుదల.
హ్యుందాయ్ క్రెటా సక్సెస్‌కు ప్రధాన కారణం దాని వివిధ ఇంజిన్ ఆప్షన్లు. పెట్రోల్, డీజిల్, టర్బో-పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లతో పాటు మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్పోర్టీ లుక్ కావాలనుకునే వారికి క్రెటా ఎన్ లైన్ వేరియంట్ కూడా ఉంది. ప్రస్తుతం క్రెటా ధర రూ.11.11 లక్షల నుంచి రూ.20.50 లక్షల వరకు ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications