అదరగొట్టేస్తున్న హ్యుందాయ్.. కార్లతోనే కాదు యాప్‎తో కూడా రికార్డులు.. అన్ని సర్వీసులు ఒకే చోట

ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే హ్యుందాయ్ కంపెనీ తన కస్టమర్ల కోసం తీసుకొచ్చిన 'మైహ్యుందాయ్' (myHyundai) అప్లికేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ యాప్ ఇప్పుడు ఏకంగా 2.6 మిలియన్ల మంది రిజిస్టర్డ్ యూజర్లను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. హ్యుందాయ్ వినియోగదారులకు ఇది ఒక డిజిటల్ ఫ్రెండ్‌లా పనిచేస్తుంది.

హ్యుందాయ్‎కి సంబంధించిన అన్ని ప్రొడక్టులు, సర్వీసులు, బెనిఫిట్స్ ఒకే చోట తెలుసుకోవడానికి ఇది ఒక సూపర్ ప్లాట్‌ఫామ్. నెలసరి సగటున 3,39,000 మంది యూజర్లు యాక్టివ్‌గా ఉండటం, నెలకి 23 మిలియన్ల ఇంటరాక్షన్స్‌తో కస్టమర్లు ఈ యాప్‌లోని ఫీచర్లను తెగ వాడేస్తున్నారు. తమకు కావాల్సిన సౌకర్యాలు, డబ్బు ఆదా చేసుకోవడానికి ఈ యాప్‌ను డైలీ పార్ట్‌నర్‌లా మార్చుకున్నారని హ్యుండై చెబుతోంది.

Hyundai myHyundai App

యాప్‌లో ఫీచర్లు
ఈ యాప్‌లో కార్ కొనడం(Buy a Car), టెస్ట్ డ్రైవ్‌లు షెడ్యూల్ చేసుకోవడం (Schedule Test Drives), సర్వీస్ రిక్వెస్ట్ బుక్ చేసుకోవడం (Book Service Request), ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్లు తెలుసుకోవడం (EV Charge), కార్ డాక్యుమెంట్లు మేనేజ్ చేసుకోవడం (Manage Car Documentation) ఇంకా స్పెషల్ మెంబర్ ఆఫర్లు పొందడం (Access Exclusive Member Offers) వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్ల కోసం స్పెషల్ ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్లు వాడేవాళ్ల కోసం ఈ యాప్‌లో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇండియా అంతటా ఉన్న 10,000 కంటే ఎక్కువ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల నెట్‌వర్క్ ద్వారా దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్లను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈవీ సేవింగ్స్ కాలిక్యులేటర్ ద్వారా వెహికల్ మెయింటెనెన్స్, రన్నింగ్ కాస్ట్, ఎమిషన్ వల్ల ఎంత డబ్బు ఆదా అవుతుందో కూడా లెక్కేసుకోవచ్చు.

Hyundai i10

టెస్ట్ డ్రైవ్‌లోనూ కొత్త ఫీచర్
2025లో రిలీజ్ చేసిన కొన్ని మోడల్స్‌లో 'టెస్ట్ డ్రైవ్ ఎంగేజ్‌మెంట్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీని ద్వారా టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వెహికల్ రియల్ టైమ్ స్టేటస్‌ను ట్రాక్ చేయొచ్చు. కస్టమర్లను బాగా హ్యాపీగా ఉంచడానికి, ఈ యాప్ ద్వారా టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేసిన ప్రతి యూజర్‌కు స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తారట!

2024లో రికార్డులు
2024లో ఈ యాప్ ద్వారా 9,43,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. 6,62,000 కంటే ఎక్కువ మంది యూజర్లు సర్వీస్ కాస్ట్ కాలిక్యులేటర్‌ను వాడారు. 15,000 కంటే ఎక్కువ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ రిక్వెస్ట్‌లను హ్యాండిల్ చేశారు. నెలసరి సగటున 8,000 కంటే ఎక్కువ సర్వీస్ బుకింగ్‌లు జరిగాయని కంపెనీ తెలిపింది.

Hyundai Venue

హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గర్గ్ మాట్లాడుతూ.. "హ్యుందాయ్ మోటార్ ఇండియాలో మా కస్టమర్లే మాకు ముఖ్యం. మైహ్యుందాయ్ యాప్‌లో 2.6 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లను దాటడం మాకు చాలా సంతోషంగా ఉంది. కస్టమర్ హ్యుందాయ్ కార్ కొన్నప్పటి నుండి ప్రతి మైలులో వారి అనుభవం బాగుండాలని, వారి ప్రయాణంలో ప్రతి అడుగులో మేము వారితోనే ఉంటామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.

ఎన్విరాన్‌మెంట్‌ను పట్టించుకునే కస్టమర్ల కోసం ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ అందించడం నుంచి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ ట్రాకింగ్ ఇవ్వడం వరకు, ప్రతి ఫీచర్‌ను వారి అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేశాం" అని అన్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, May 15, 2025, 14:14 [IST]
English summary
Hyundais myhyundai app hits record millions of users loving it
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+