కారులో AC ఆన్ చేస్తే.. మైలేజ్ తగ్గుతుందా? అసలు విషయం తెలిస్తే షాక్.. ఎఫెక్ట్ ఇలా ఉంటుంది!

ఇంధన ధరలు చుక్కలు తాకుతున్న ఈ కాలంలో, ప్రతి లీటర్‌కి విలువ పెరిగిపోయింది. ఒకటిగా పెరిగిన ఖర్చులు, మైలేజ్ తగ్గితే వాహన యజమానులకు అర్థికంగా కొంత భారంగా మారుతుంది. ఇక ఇప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కారులో ప్రయాణించేటప్పుడు లోపల చల్లగా ఉండటానికి AC ఆన్ చేయడం తప్పనిసరి అయింది. అయితే, అదే సమయంలో కారులో ఏసీ ఆన్ చేస్తే, మైలేజ్‌ తగ్గుతుందా? అనే ప్రశ్న చాలా మందిలో సందేహంగా ఉంటుంది. కాఫీషాప్‌కు వెళ్తూ, లేదా ఆఫీస్ ట్రాఫిక్‌లో కూరుకుపోయి ఉన్నా... మన మదిలో ఈ ప్రశ్న తేలికగా మర్చిపోలేం. అసలు విషయం ఏంటంటే, కారు ఏసీ పని చేయాలంటే, ఇంజిన్ శక్తిని వినియోగించే కంప్రెసర్ పని చేయాలి.

ఈ కంప్రెసర్ మరింత శక్తిని తీసుకుంటే, కారులో ఇంధన వినియోగం కూడా తగినంతగా పెరుగుతుంది. ఇది నేరుగా మైలేజ్‌పై ప్రభావం చూపుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఏసీ ఆన్ చేసినపుడు మైలేజ్ సుమారు 5 నుండి 10 శాతం వరకు తగ్గవచ్చని తెలుస్తోంది. ఉదాహరణకి, మీరు ఏసీ ఆఫ్ చేసి ఒక లీటర్ పెట్రోల్‌తో 20 కిలోమీటర్లు ప్రయాణించగలిగితే, అదే ఏసీ ఆన్ చేసినపుడు 18 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించవచ్చు.

Impact Of Car Ac Fuel Consumption

ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో, స్టార్ట్-స్టాప్ పరిస్థితుల్లో, కారులో ఏసీ మరింత శక్తిని తీసుకుంటుంది. అంతేకాకుండా, మీరు కారును ఎండలో పార్క్ చేసి ఉంటే, లోపల వేడి బాగా పెరిగిపోయి ఉంటుంది. అప్పుడు ఏసీ ఆన్ చేసిన తర్వాత కారులో చల్లదనం వచ్చే వరకు, కంప్రెసర్ చాలా ఎక్కువ పనిచేస్తుంది. దాని వల్ల మొదటి కొన్ని నిమిషాల్లో పెట్రోల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది.

కారులో ఏసీ వాడుతున్నప్పుడు మైలేజ్‌పై ప్రభావం అనేది కారును బట్టి మారుతుంది. ఒక్కో కారుకి, ఒక్కో పరిస్థుతికి వేరు వేరుగా ఉంటుంది. సాఫీగా ఉన్న రోడ్లపై ఇంజిన్‌పై ఎక్కువ ప్రభావం ఉండదు కాబట్టి మైలేజ్ నార్మల్‌గా కొంచెం తక్కువగా ఉంటుంది. అదే ఎత్తుగా ఉన్న రోడ్లపై వెళ్తున్నప్పుడు ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇదే సమయంలో ఏసీ ఆన్‌చేసి ఉంటే కంప్రెసర్‌పై కూడా ఒత్తిడి పడి ఎక్కువ ఫ్యూయల్ తీసుకుంటుంది.

Impact Of Car Ac On Mileage And Fuel Consumption

కారు ఆగి ఉంది కాబట్టి పెట్రోల్‌తో ఏం కాదు, ఏసీ మాత్రమే నడుస్తోంది కదా? అని తప్పుగా భావించవచ్చు. ఎందుకంటే, ఏసీ మోటార్ నడవాలంటే కారు ఇంజిన్ స్టార్ట్ అయి ఉండాలి. అంటే కారు నడుస్తున్నట్లే, ఇంజిన్ లోపల నిరంతరం ఇంధనం కాలుతూనే ఉంటుంది. ఒక గంట పాటు కారు నిలిపి పెట్టి ఏసీ ఆన్ చేస్తే, చిన్న హ్యాచ్‌బ్యాక్‌లో కనీసం అర్ధ లీటర్ పెట్రోల్ ఖర్చయ్యే అవకాశం ఉంది.

మైలేజ్ తగ్గకుండా చేయాలంటే, ఏసీని అవసరమైతే మాత్రమే వాడడం, డైరెక్ట్ సూర్యరశ్మిలో వాహనాన్ని పార్క్ చేయకుండా జాగ్రత్తపడటం వంటివి మైలేజీని కాపాడటానికి సహాయపడతాయి. కొత్తగా వచ్చిన కార్లు, ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ కలిగినవైతే ఇలాంటి సమర్థంగా హ్యాండిల్ చేయగలవు. కారు ఇంటీరియర్‌ను మొదట విండోలు ఓపెన్ చేసి కొంతకాలం గాలి జారేలా చేసి తర్వాతే ఏసీ ఆన్ చేస్తే, వేడి తగ్గిన తర్వాత కంప్రెసర్ తక్కువ శక్తితో పని చేస్తుంది.

Impact Of Car Ac On Mileage

అలాగే ఏసీను ఎప్పుడూ ఫుల్ బ్లోపై పెట్టకుండా మిడియం సెట్టింగ్‌లో వాడితే కూడా ఇంధన వినియోగం కొంత తగ్గుతుంది. చివరగా, కారు ఏసీ వాడితే మైలేజ్ తక్కువ అవుతుంది. కానీ అది ఎంత శాతం తగ్గుతుంది అనేది కారు మోడల్‌, డ్రైవింగ్ పరిస్థితులు, వాతావరణం, వాడకం తీరు.. వీటన్నింటిపైన ఆధారపడి ఉంటుంది. కనుక స్మార్ట్‌గా, అవగాహనతో ఏసీ వాడితే, కంఫర్ట్‌ని కూడా పొందవచ్చు, మైలేజ్‌ను కూడా కాపాడుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, August 4, 2025, 16:50 [IST]
English summary
Impact of car ac on mileage and fuel consumption know the facts details
Read more on: #auto tips #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+