కొత్త టయోటా కారు గురించి ఎవరూ చెప్పని ముఖ్య విషయాలు ఇవే.. తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయండి

టయోటా కిర్లోస్కర్ ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయ ఆటోమొబైల్ తయారీదారు. జనవరిలో అట్టహాసంగా ముగిసినటు వంటి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కంపెనీ హిలక్స్ పికప్ ట్రక్ బ్లాక్ ఎడిషన్ మోడల్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే పికప్ ట్రక్ ను ఘనంగా విడుదల చేశారు. దీని డిజైన్ చాలా ఎట్రాక్టివ్ గా ఉండడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

కొత్త టయోటా హిలక్స్ బ్లాక్ ఎడిషన్ పికప్ ట్రక్ రెగ్యులర్ హిలక్స్‌తో పోలిస్తే.. ఇది బ్లాక్ కలర్ థీమ్ కలిగి ఉంటుంది. దీని గ్రిల్, అల్లాయ్ వీల్స్, రియర్ వ్యూ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్ కూడా కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంటాయి. దీనితో పాటు ప్రొజెక్టర్ ఎల్ ఈడీ హెడ్ లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, టెయిల్ గేట్ పై పెద్ద అక్షరాలతో టయోటా అని రాసి ఉంటుంది.

Toyota Hilux Black Edition

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియాలో కూడా పాపులర్ కార్ల తయారీదారు. ఇటీవల దేశీయ మార్కెట్లో సరికొత్త మోడల్స్ విడుదల చేసి తన ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీని ఇస్తుంది. 'హిలక్స్ బ్లాక్ ఎడిషన్' పికప్ ట్రక్కును విడుదల చేసి మార్కెట్లో మరో సెన్సేషన్ సృష్టించింది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్స్ కలిగి ఉంది. ఇన్ని ఫీచర్స్ అందించడంతో దాని ధర కాస్త ఎక్కువే ఉందని చెప్పొచ్చు.

హిలక్స్ బ్లాక్ ఎడిషన్ ధర: కొత్త టయోటా హిలక్స్ బ్లాక్ ఎడిషన్ పికప్ ట్రక్ దాని ప్రీమియం లుక్ కారణంగా కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 37.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Toyota Hilux Black Edition

డిజైన్: కొత్త పికప్ ట్రక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ఎక్సటర్నల్ బాడీ మొత్తం కూడా బ్లాక్ కలర్ థీమ్ ఉంది. దీని గ్రిల్, అల్లాయ్ వీల్స్, రియర్ వ్యూ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇది కాకుండా.. ఇది స్టాండర్డ్ హిలక్స్ మోడల్ లాగానే ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్ కలిగి ఉంది.

పర్ఫామెన్స్ : కొత్త టయోటా హిలక్స్ బ్లాక్ ఎడిషన్ మోడల్ పవర్ ఫుల్ 2.8-లీటర్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 204 PS హార్స్‌పవర్, 500 Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేసే డీజిల్ ఇంజిన్ ఆఫ్షన్ తో పనిచేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్ ఉంటుంది. ఇది లీటరుకు 12కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది.

Hilux Black Edition Pickup Truck

సీట్ కెపాసిటీ, బూట్ స్పేస్: ఈ పికప్ ట్రక్కులో మొత్తం 5 సీట్లు ఉంటాయి. ప్రయాణీకులు హాయిగా ఇందులో ప్రయాణించవచ్చు. వీకెండ్స్ లో, సెలవు దినాల్లో ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి ఇది 435 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది.

Take a Poll

ఫీచర్స్ : ఈ టయోటా హిలక్స్ బ్లాక్ ఎడిషన్ పికప్ ట్రక్ అనేక ఫీచర్స్ లో వస్తుంది. ముఖ్యంగా దీని క్యాబిన్లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, డ్యూయల్-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్-జోన్ AC, 6-స్పీకర్ సౌండ్ సిస్టం వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది.

Toyota Hilux Black Edition Pickup

సేఫ్టీ ఫీచర్స్ : కొత్త పికప్ ట్రక్ ప్రయాణీకులకు మంచి భద్రతను అందిస్తుంది. సేఫ్టీ పరంగా ఇందులో 7 ఎయిర్ బ్యాగులు, HAC (హిల్ అసిస్ట్ కంట్రోల్), బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు , రియర్ పార్కింగ్ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, March 17, 2025, 10:23 [IST]
English summary
Important features of the new toyota hilux black edition pickup truck you must know before buying
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+