2024లో ఎక్కువ మంది కొన్న టాప్ బెస్ట్ కార్లు.. లిస్ట్‌లో మీ కారు కూడా ఉండవచ్చు.. ఇవన్నీ తోపు మోడళ్లే..
భారత వాహన పరిశ్రమకు 2024 ఏడాది బాగా కలిసి వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఆటోమొబైల్ వృద్ధికి అంతగా సానుకూల అంశాలు లేనప్పటికీ కూడా ఇండియాలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అన్ని కంపెనీల చూపు ఇప్పుడు భారత్ వైపే ఉంది. అందుకే గత ఏడాది దేశంలో అదిరిపోయే కొత్త కార్లు మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. మారుతీ సుజుకీ (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors), హ్యుందాయ్ (Hyundai) వంటి పలు కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతూ మరి కొత్త మోడళ్లను విడుదల చేశాయి. దేశీయంగా ఇక్కడే తయారు చేస్తుండటంతో పాటు ఇతర దేశాలకు భారత్ నుంచే ఎగుమతి కూడా చేస్తున్నారు. 2024 ఏడాదిలో కార్ల తయారీ కంపెనీలు అమ్మకాల పరంగా మెరుగైన గణంకాలను సాధించాయి.
ముఖ్యంగా చాలా ఏళ్లుగా సేల్స్‌లో అగ్రస్థానంలో ఉన్నటువంటి మారుతీ సుజుకీ ఈ సారి కూడా ఇతర కంపెనీల కంటే అత్యధిక కార్లను విక్రయించింది. ఇతర కంపెనీల కార్లు కూడా గత ఏడాది సేల్స్‌లో దూసుకుపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా కంపెనీలు తమ సేల్స్ వివరాలను వరుసగా ప్రకటిస్తున్నాయి. 2024 ఏడాదిలో సేల్స్ పరంగా దూసుకుపోయిన మోడళ్లను క్రింది కథనంలో చూద్దాం.

2024 ఏడాదిలో దేశీయ ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్‌కు చెందిన పంచ్ (punch) కారు అత్యధికంగా సేల్స్‌ను సాధించిన మోడల్‌గా నిలిచింది. డేటా ప్రకారం, ఈ మోడల్ 2,02,031 యూనిట్ల సేల్స్‌ను సాధించి గత ఏడాదిలో బెస్ట్ సెల్లర్ కారుగా నిలిచింది. చాలా ఏళ్లుగా అమ్మకాల విషయంలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన కార్లు మొదటి స్థానంలో ఉండగా,ఇప్పుడు ఆ స్థానంలోకి టాటా మోటార్స్‌కు చెందిన పంచ్ కారు వచ్చింది.
మొత్తం కార్ల విక్రయాలను చూసినట్లయితే 2024 ఏడాదిలో మారుతీ కంపెనీ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే విడిగా చూసినట్లయితే పంచ్ తర్వాత మారుతీ ప్రసిద్ధ మోడల్ వ్యాగన్ఆర్ (wagonR) ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ 1,90,855 అమ్మకాలతో రెండో స్థానంలో ఉంది. దీని తర్వాత కూడా మూడో స్థానంలో ఇదే కంపెనీకి చెందిన ఎర్టిగా (Ertiga) 1,90,091 యూనిట్ల సేల్స్‌ను సాధించింది. ఈ కారు పెద్ద కుటుంబానికి అనువుగా ఉంటుంది.

దీని తరువాత 2024 ఏడాది సేల్స్ పరంగా మారుతీ సుజుకీ బ్రెజ్జా(Brezza) 1,88,160 యూనిట్లను నమోదు చేసింది. చిన్న కుటుంబానికి అనువుగా ఉంటుంది. మారుతీ కార్లకు గట్టి పోటీ ఇస్తూ, మరో దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన అదిరిపోయే మోడల్ క్రెటా (Creta)ను గత ఏడాది 1,86,919 మంది కొనుగోలు చేశారు. పండుగ సమయంలో అమ్మకాలు ఎక్కువ నమోదు కావడం వలన క్రెటా మంచి సేల్స్‌ను నమోదు చేసింది.
హ్యుందాయ్ క్రెటా తరువాత అమ్మకాలు ఎక్కువగా సాధించిన మోడల్‌గా మారుతీకి చెందిన స్విఫ్ట్ (Swift) కారు నిలిచింది. ఇది ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. గతంలో చాలా సార్లు ఈ కారు సేల్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీన్ని గత ఏడాది 1,72,808 మంది కొనుగోలు చేశారు. ఇదే కంపెనీకి చెందిన బాలెనో (baleno) కూడా 2024లో మెరుగైన సేల్స్‌ను నమోదు చేసింది.

డేటా ప్రకారం, ఇది 1,72,094 సేల్స్‌ను సాధించింది. మరో కారు మారుతీ డిజైర్ (Dzire) కారు కూడా దేశంలో చాలా డిమాండ్ ఉన్న మోడల్. ఇది అమ్మకాల పరంగా 1,67,988 యూనిట్లును నమోదు చేసింది. 9వ స్థానంలో ప్రసిద్ధ కంపెనీ మహీంద్రాకు చెందిన స్కార్పియో (Scorpio)ను 1,66,364 మంది కొనుగోలు చేశారు. చివరగా, టాటా నెక్సాన్ 1,61,611 యూనిట్లు అమ్మకాలను సాధించింది.


Click it and Unblock the Notifications








