దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు.. రూ.5 లక్షల లోపే.. 50 లక్షల మంది ఎగబడి కొన్నారు

భారతదేశంలో సాధారణంగా మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. వీరంతా కోట్లు కోట్లు పెట్టి ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం కష్టం. కాబట్టి వారికి అందుబాటు ధరలో లభించే కార్లంటేనే చాలా ఇష్టం. మంచి మైలేజ్, తక్కువ ధర, మెరుగైన పెర్ఫామెన్స్ అందించేవి వారికి ఫేవరెట్ కార్లు. వాటిలో మారుతి కంపెనీకి చెందినవి ఎక్కువగా ఉంటాయి. స్విఫ్ట్, వ్యాగన్ఆర్, డిజైర్ వంటివి ఉంటయి. దేశంలో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో కూడా ఇవి ఉన్నాయి. ఇవన్నీ భారత్ మార్కెట్‌లో గణనీయమైన విజయాన్ని సాధించిన మోడల్స్ అన్నది నిజమే. కానీ దేశంలోని అగ్రగామి, అత్యధికంగా అమ్ముడైన కారు మాత్రం వీటిలో ఏదీ కాదు! ఈ ఘనత సాధించింది ఒక లెజెండరీ మోడల్ మారుతి సుజుకి ఆల్టో (maruti suzuki Alto).

పేద, మధ్యతరగతి వారికి కారు కలిగిన ఉండాలనే కోరికను తీర్చడంలో ఆల్టో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఈ చిన్న కారు 5 లక్షల రూపాయల పరిధిలో లభ్యమవుతూ, భారత వినియోగదారుడి మన్ననలు పొందింది. మారుతి ఆల్టో 2000వ సంవత్సరం నుంచే మార్కెట్‌లో ఉంది. అప్పటినుంచి ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా యూనిట్లు విక్రయమయ్యాయి. ఇవే దేశంలో ఏ కారుకు సాధ్యపడని అత్యధిక అమ్మకాలు.

India All Time Best Selling Car

చిన్నగా ఉండి, ఫ్యామిలీకి సరిగ్గా సరిపోయే కాంపాక్ట్ డిజైన్, టఫ్ మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, దేశవ్యాప్తంగా సర్వీస్ నెట్‌వర్క్.. ఇవన్నీ ఆల్టో విజయానికి మూల కారకాలు. మొదట్లో ప్రజలకు ఓ మంచి ఎంట్రీ లెవల్ ఫ్యామిలీ కార్ కావాలన్న డిమాండ్‌కు సమాధానంగా ఇది నిలిచింది. కాలక్రమేణా మారుతూ, కొత్త ఫీచర్లతో వచ్చినా, ధర మాత్రం సాధారణ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉంచారు.

ఆల్టో కేవలం ఓ కారే కాదు. కోట్లాదిమందికి అది మొదటి నాలుగు చక్రాల కల. కొన్ని కుటుంబాల్లో మూడు తరాలపాటు అదే మోడల్ కంటిన్యూ అవుతుంటే ఆశ్చర్యం కాదు. ఇంత బలమైన భావోద్వేగం ఆల్టోకు వుంది. ఇలా చూస్తే, ఇది కేవలం ఓ గణాంకం కాదు. ఇది ఒక మైలు రాయి. ఒక సాధారణ కార్ ఎలా అసాధారణమైన విజయాన్ని సాధించొచ్చో ఆల్టో నిరూపించింది.

All Time Best Selling

ప్రతి ఇండియన్ రోడ్డులో కనీసం ఒక ఆల్టో కనిపించడమూ, అది సాధించిన నమ్మకానికి నిదర్శనం. ఆల్టో 2004లో 1 లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. ఇది చిన్న కార్ల విభాగంలో బెస్ట్ సేల్స్. తర్వాత ఆల్టో తన విజయాన్ని నిలబెట్టుకుంటూ 2008లోనే 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. అంతేకాకుండా, 2012 నాటికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకోగా, 2016లో 30 లక్షల యూనిట్ల అమ్మకాలు పూర్తయ్యాయి.

ఒక్కో దశలో ఒక్కో రికార్డును సాధిస్తూ భారతీయ రహదారులపై తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2020లో ఆల్టో 40 లక్షల యూనిట్ల అమ్మకాలను అధిగమించి మైలురాయి లాంటి విజయాన్ని నమోదు చేసింది. ఇక 2024 నాటికి ఇది 50 లక్షల మార్కును తాకింది. దేశంలో ఏ ఇతర కారు సాధించలేని రికార్డు ఇది. ఈ స్థాయిలో నిలబడిన ఆల్టో రికార్డును త్వరలో ఎవరైనా బద్దలు కొడతారా అన్నది పెద్ద సందేహమే.

India All Time Best Selling

2000లో అడుగుపెట్టిన ఆల్టో, 2022 మధ్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2010లో మారుతి సుజుకి, ఆల్టో బ్రాండ్‌ను మరింత శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో, ఆల్టో K10 మోడల్‌ను విడుదల చేసింది. ఇది ఆల్టో 800 కంటే కొంచెం పవర్‌ఫుల్, స్టైలిష్, ఇంకా మెరుగైన ఫీచర్లతో వచ్చింది. 2023లో ప్రభుత్వం BS6 Stage II ఉద్గార ప్రమాణాలను అమల్లోకి తీసుకురాగా ఆల్టో K10ను అప్‌డేట్ చేసి తీసుకొచ్చారు.

దీంతో పాటు, ఆల్టో 800 మోడల్‌ను కంపెనీ అధికారికంగా నిలిపివేసింది. ఒక దశలో లక్షలాది మందికి మొదటి కారుగా నిలిచిన ఆల్టో 800 మౌనంగా విడిపోయినా, అది భారత ఆటోమొబైల్ చరిత్రలో వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. మారుతి సుజుకి ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్ రూ.4.23 లక్షల నుండి రూ.6.21 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వరకు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 31, 2025, 13:15 [IST]
English summary
India all time best selling maruti suzuki alto over 50 lakh units details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+