ఇకపై మీరు జాగ్వార్, ల్యాండ్ రోవర్ లగ్జరీ కార్లు కొని ఇంట్లో పెట్టుకోండి! బడ్జెట్ ధరకే బ్రిటన్ లగ్జరీ కార్లు!

భారతదేశం, బ్రిటన్ మధ్య (India-UK FTA) తాజాగా సంతకమైన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయబోతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ ఈ ఒప్పందం మరింత లాభపడనుంది. ఎంతో కాలంగా జరుగుతున్న చర్చలకు ముగింపు పలుకుతూ,తాజగా లండన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని వాణిజ్య మంత్రుల చేతుల మీదుగా పూర్తయ్యింది. దీన్ని అమలు చేయడానికి భారత మంత్రివర్గం, బ్రిటన్ పార్లమెంట్ నుండి తుది ఆమోదం రావాల్సి ఉంది. అయితే ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ఇప్పటివరకు బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై భారత్ భారీ దిగుమతి సుంకాలు విధిస్తూ వస్తోంది.

కానీ ఈ ఒప్పందం అమలయ్యే కాలానికి, ఆ సుంకాలు కాస్త తగ్గనున్నాయి. ఫలితంగా, భారతీయ వినియోగదారులకు బ్రిటన్ కార్లు మరింత అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రత్యక్షంగా చెప్పాలంటే, ఇప్పటివరకు బ్రిటన్‌లో తయారైన ప్రీమియం కార్లు భారత మార్కెట్‌లోకి దిగుమతి చేసుకోవడం వలన వాటికి ఇక్కడ ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దిగుమతి సుంకాల్లో తగ్గుదల వలన వాటి ధరలు కొంతవరకైనా తగ్గే అవకాశం ఉంది.

India And Uk FTA Auto

దీని వలన విదేశీ కార్ల కొనుగోలు అనేది ఇక కొంతమంది మిడ్-హై సెగ్మెంట్ వినియోగదారులకు కూడా సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్య పరిమితులకు మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య కొత్త ఆర్థిక అవకాశాలకు, పారిశ్రామిక సహకారానికి కూడా దారితీసే అవకాశం ఉంది. ఆటోమొబైల్ రంగం మాత్రం ఈ ఒప్పందంతో తక్షణ లాభాలను చవిచూసే మొదటి రంగంగా మారనుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బ్రిటన్ ఎప్పటినుంచో లగ్జరీ కార్లకు నిలయంగా నిలుస్తూ వస్తోంది. ల్యాండ్ రోవర్, జాగ్వార్, రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్, లోటస్, మెక్‌లారెన్ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌లు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేకమైన స్థానం సంపాదించాయి. వీటిలో చాలా కంపెనీలు భారత మార్కెట్‌లో కూడా ప్రీమియం కారు ప్రియుల మనసు దోచుకుంటున్నాయి. అయితే బ్రిటిష్ కార్ల ధరలు ఎక్కువగా ఉండటం వలన భారతదేశంలో అంతగా డిమాండ్ లేదు.

Car Price Down

ధనవంతులు, పెద్ద సెలబ్రిటీలు మాత్రమే ఈ కార్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి నిదర్శనమే, 2025 ఆర్థిక సంవత్సరంలో బ్రిటన్‌కు చెందిన కార్ల కంపెనీలు భారతదేశంలో 6,500 కంటే తక్కువ యూనిట్లను మాత్రమే విక్రయించగలిగాయి. ఈ పరిమిత అమ్మకాలకి ప్రధాన కారణం, అధిక దిగుమతి సుంకాలు. కానీ తాజా CETA ఒప్పందంతో ఇది పూర్తిగా మారనుంది.

ఈ ఒప్పందం ప్రకారం, బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే కార్లపై సుంకం ఇప్పటి వరకు 110 శాతం ఉండగా, ఇప్పుడు అది 50 శాతానికి తగ్గనుంది. రెండవ ఏడాది 25 శాతానికి, ఐదవ సంవత్సరం చివరికి ఇది కేవలం 10 శాతానికి పరిమితమవుతుంది. ఈ మార్పుతో బ్రిటన్ లగ్జరీ కార్లు భారత మార్కెట్‌లో మరింత పోటీదారులుగా మారే అవకాశముంది. ధరలు తగ్గడం వల్ల మరింత మందికి ఇవి అందుబాటులోకి రానున్నాయి.

India And Uk Free Trade Agreement Imapct

ముఖ్యంగా లగ్జరీ కార్లను తక్కువ ధరలో సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికి ఇది శుభవార్త. ప్రస్తుతం భారతీయ ప్రజల ఆర్థిక పరిస్థితి కొంత మార్పు వచ్చింది. ఇటీవల కాలంలో యువత, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు ల్యాండ్ రోవర్, జాగ్వార్ వంటి కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒప్పందం కారణంగా వీటి ధరలు తగ్గే అవకాశం ఉండటంతో వీరంతా లగ్జరీ కార్లను తక్కువకే కొనచ్చు.

భారతదేశంలో బ్రిటిష్ కంపెనీలకు చెందిన రోల్స్ రాయిస్ కార్లు, ల్యాండ్ రోవర్ డిఫెండర్, మొదలగునవి ప్రస్తుతం కోట్ల రూపాయాల్లో కొనుగోలుకు లభిస్తున్నాయి. అయితే,భారతదేశం, బ్రిటన్ మధ్య తాజాగా సంతకమైన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ద్వారా మీ బడ్జెట్ ధరలో సొంతం చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 25, 2025, 17:03 [IST]
English summary
India and uk free trade agreement will effect to cut british car prices in india
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+