దేశం మొత్తం ఎదురు చూస్తున్న క్షణం రేపు రాబోతుంది..500 కి.మీ రేంజ్‎తో తుఫాన్ సృష్టించబోతున్న మహీంద్రా

భారతదేశంలో భారీ మైలేజ్ ఇచ్చే 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను శాసించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తమ కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVని సిద్ధం చేసింది. రేపు (నవంబర్ 27, 2025) విడుదల కానున్న ఈ కారు పేరు మహీంద్రా XEV 9S. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ కారు మార్కెట్‌లో పెద్ద సంచలనం సృష్టించబోతోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు మహీంద్రా సంస్థ, తన కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV అయిన XEV 9Sను రేపు (నవంబర్ 27, 2025) లాంచ్ చేయబోతోంది. బెంగళూరులో ఉదయం 8 గంటలకు ఈ కారు ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఇది మహీంద్రా ప్రత్యేకమైన INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్ మీద తయారైన మూడవ మోడల్. గత కొన్ని రోజులుగా టీజర్లతో ఈ కారుపై మహీంద్రా తెగ హైప్ పెంచేసింది.

India Awaits Mahindras 500 KM Range 7-Seater Electric SUV Launching Tomorrow

ఈ XEV 9S మహీంద్రా నుంచి వస్తున్న మొట్టమొదటి 7-సీటర్ ఫుల్-ఎలక్ట్రిక్ SUV. దీని ముందు భాగం మూసివేసినట్లు ఉండి, LED లైటింగ్ లేఅవుట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా కనెక్టెడ్ లైట్ బార్ (ఒక లైట్ బార్ ముందు భాగమంతా విస్తరించి ఉంటుంది), ప్రత్యేకమైన C-ఆకారపు సిగ్నేచర్ లైట్లు దీన్ని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి.

ఈ కారు డిజైన్ మొత్తం, గతంలో చూపించిన XUV.e8 కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొందింది. సైజ్, సైడ్ లుక్, వెనుక భాగం కొంతవరకు XUV700 SUVని పోలి ఉంటుంది. కారు లోపలి భాగంలోకి వెళ్తే, మహీంద్రా ఒక అద్భుతమైన లగ్జరీ అనుభూతిని అందించేందుకు ప్రయత్నించింది. డాష్‌బోర్డ్ అంతటా విస్తరించి ఉండే ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్ ఈ కారుకు హైలైట్. ఈ మూడు స్క్రీన్‌లలో ఒకటి డ్రైవర్ కోసం ఇన్స్ట్రుమెంట్ డిస్‌ప్లే, మధ్యలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్, మూడోది ముందు కూర్చున్న ప్రయాణీకుడి కోసం ఉంటుంది.

India Awaits Mahindras 500 KM Range 7-Seater Electric SUV Launching Tomorrow

లోపల చాలా శుభ్రంగా, సింపుల్‌గా ఉండే సెంటర్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటాయి. వెనుక వరుసలో కూర్చునే వారికి రిక్లైన్ చేసుకునే సీట్లు (పొడుగ్గా పడుకోవడానికి వీలుండే సీట్లు), ఎక్కువ లెగ్‌రూమ్ కోసం బాస్ మోడ్ సౌకర్యం ఉన్నట్లు మహీంద్రా కన్ఫాం చేసింది.

పెద్ద పనోరమిక్ గ్లాస్ రూఫ్ ఈ SUVకి మరింత ఆకర్షణ తీసుకొస్తుంది. వెనుక సీట్లలో కూర్చున్న వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సాధారణ స్క్రీన్‌లకు బదులుగా, మహీంద్రా BYOD(Bring Your Own Device) సిస్టమ్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రయాణీకులు తమ సొంత టాబ్లెట్‌లను ప్రత్యేక హోల్డర్లలో పెట్టుకోవచ్చు. అలాగే వెనుక వైపున రెగ్యులర్ బూట్ స్పేస్‌తో పాటు, ఫ్రంట్ అదనంగా స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌ కూడా ఉంటుంది.

India Awaits Mahindras 500 KM Range 7-Seater Electric SUV Launching Tomorrow

మహీంద్రా సంస్థ అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా చెప్పకపోయినా, ఈ కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV, సింగిల్ ఛార్జింగ్‌తో సుమారు 500 కిలోమీటర్ల రియల్ డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారులో కూడా XEV 9e, BE 6లో వాడుతున్న 59kWh లేదా 79kWh LFP బ్యాటరీ ప్యాక్‌లు ఉండే అవకాశం ఉంది. ఈ కారుకు అల్ట్రా-ఫాస్ట్ DC ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది.

టెక్నాలజీ, సేఫ్టీ విషయంలో XEV 9S చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోంది. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. అలాగే లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), పవర్డ్ టెయిల్‌గేట్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన వెంటిలేటెడ్, పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది.

ప్రీమియం హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇది మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV కాబట్టి, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.22 లక్షల నుంచి రూ.35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, November 26, 2025, 16:30 [IST]
English summary
India awaits mahindras 500 km range 7 seater electric suv launching tomorrow
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+