భారత్‌లో అత్యంత సురక్షితమైన కార్లు! ప్రాణాలకు పూర్తి భరోసా.. 5 స్టార్ రేటింగ్‌తో దుమ్ము లేపుతున్నాయ్

పాత రోజుల్లో కారు కొంటే మొదటగా అడిగే ప్రశ్న, ఎంత మైలేజ్ ఇస్తుంది?, దాని ధర ఎంత?. ఆ కాలంలో వాహనం అంటే ఇంధనం తక్కువ తాగితే చాలు, అది మంచిదని భావించేవారు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కారు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ, మొదటగా సేఫ్టీ రేటింగ్ గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పటి మార్కెట్లో కేవలం మైలేజ్, డిజైన్, లేదా టెక్నాలజీ ఫీచర్లు మాత్రమే కాకుండా, భద్రత (Safety) ఇప్పుడు ప్రధాన ప్రమాణంగా మారింది. భారతీయ రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల సంఖ్య, అవగాహన పెరగడం వలన సేఫ్టీపై దృష్టి మరింత పెరిగింది. అందుకే ఈ కథణంలో ఇండియా బెస్ట్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లు టాటా నెక్సాన్, పంచ్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, టాటా పంచ్ కార్ల గురించి ఇస్తున్నాము.

Tata Nexon: ఇది భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో భద్రతకి కొత్త ప్రమాణాలను నెలకొల్పిన SUV అని చెప్పాలి. దేశంలోనే మొదటిసారిగా Global NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన కాంపాక్ట్ SUVగా నెక్సాన్ పేరు నిలిచిపోయింది. ఇండియాలో అత్యంత సేఫ్టీ అందించే కార్లలో టాటా నెక్సాన్ ఒకటి. ఇది ప్రమాదాల సమయంలో కారు లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.

India Best 5 Star Safety Cars Tata Nexon punch maruti Dzire Mahindra Xuv 3xo Details

ఇది వినియోగదారుల కోసం పెట్రోల్, డీజిల్, CNG, ఈవీ వంటి నాలుగు ఆప్షన్లను అందిస్తుంది. ప్రస్తుతం రూ.7.32 లక్షల నుండి రూ.14.05 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ధరను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, నెక్సాన్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ABS with EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు , ISOFIX మౌంట్స్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

Tata punch: టాటా పంచ్ చిన్నదైనా దమ్మున్న SUV. టాటా మోటార్స్ రూపొందించిన ఈ మైక్రో SUV భారతీయ మార్కెట్‌లో భద్రతలో బెస్ట్‌గా ఉంది. దీని ప్రధాన బలం సేఫ్టీ. క్రాష్ టెస్ట్‌లో పంచ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దేశంలో అత్యంత సురక్షితమైన చిన్న SUVలలో ఒకటిగా నిలిచింది. దీని ధరలు వేరియంట్ల(మాన్యువల్)ను బట్టి రూ.5.50 లక్షల నుంచి రూ.9.30 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది.

India Best 5 Star Safety Cars Tata Nexon punch maruti Dzire Mahindra Xuv 3xo Details

టాటా పంచ్ పెట్రోల్, సీఎన్జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో పాటు ఈవీలో కూడా కొనుగోలు చేయడానికి లభిస్తుంది. 2024 సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. ఇది పెట్రోల్ మాన్యువల్‌లో లీటరుకు 18.82 కి.మీ, AMT లో లీటరుకు 18.97 కి.మీ మైలేజ్, సీఎన్జీలో 26.99 కి.మీ వరకు అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. ఈవీలో అయితే బ్యాటరీని బట్టి 250 కి.మీల పైనే రేంజ్ ఇస్తుంది.

Maruti Dzire: మారుతి సుజుకి కంపెనికి చెందిన కార్లు సాధారణంగా సేఫ్టీ ప్రమాణాలను కలిగ ఉండవని మార్కెట్లో ఒక పేరుంది. అయితే ఆ నిందను తొలగించడానికే డిజైర్ కారు వచ్చింది. ఇప్పటి తరం డిజైర్ భద్రత విషయంలో కూడా దృఢంగా మారింది. మారుతి డిజైర్ భారత్ NCAP ప్రోగ్రామ్ కింద 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. దీని ధర రూ.6.26 లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి మొదలవుతుంది.

India Best 5 Star Safety Cars Tata Nexon punch maruti Dzire Mahindra Xuv 3xo Details

Mahindra XUV 3XO: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ 2025లో SUV మార్కెట్‌ను కుదిపేసిన మరో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇదే. ఈ కారు BNCAP క్రాష్-టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ని పొందింది. ఈ కారులో ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్, లోడ్ లిమిటర్‌తో ప్రీ-టెన్షనర్ ఉన్నాయి. దీని ధర రూ.7.28 లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి మొదలవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 25, 2025, 13:13 [IST]
English summary
India best 5 star safety cars tata nexon punch maruti dzire mahindra xuv 3xo details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+