ఇవి ఉంటే రైళ్లు, బస్సులు, ఆటోల్లో ప్రయాణించే అవసరం లేదు.. కుటుంబానికి సరిపడే 7 సీటర్ కార్లు
ప్రస్తుత కుటుంబ ప్రయాణాలకు ప్రాముఖ్యత పెరిగింది. దీంతో 7 సీటర్ కలిగిన కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. . ప్రత్యేకించి పెద్ద కుటుంబాలకు మూడు వరుసల్లో కూర్చోనే వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఇవి కేవలం ప్రయాణానికి ఉపయోగపడే వాహనాలు కాదు. ఇవి కుటుంబ బంధాలను దగ్గర చేయే వేదికలు కూడా. అందరు కలిసి హాయిగా ఒకే కారులో ఆడుతూ, పాడుతూ సంతోషంగా ప్రయాణిస్తుంటే ఆ ఎంజాయ్‌మెంట్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. మార్కెట్లో ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ అధునాతన ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. మారుతీ సుజుకీ ఎర్టిగా, టయోటా రూమియన్, కియా కారెన్స్ క్లావిస్ వంటి పెద్ద కార్లు కుటుంబాలకు బాగ అనుకూలంగా ఉంటాయి. వీటి గురించి ఒకసారి కింది కథణంలో తెలుసుకుందాం.
Maruti Suzuki Ertiga: భారతీయ కుటుంబాలకు బాగా నచ్చిన ఎంపీవీ కార్లలో ఎర్టిగా ఒకటి. దేశవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోతున్న మోడళ్లలో ఇది ప్రధానమైనది. ఇది పెద్ద కుటుంబం గల వారికి బాగా సెట్ అవుతుంది. ఈ కారు 7 సీటర్ ఆప్షన్‌లో లభిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబ సభ్యుడికి అనువుగా ఉంటుంది. కారులో క్యాబిన్ విశాలంగా ఉండటంతో ప్రయాణ సమయంలో సౌకర్యంగా ఉంటుంది.

రెండు వరుసల మధ్య నిలబడినంత స్పేస్ ఉండటం వల్ల ప్రయాణం కుదుపుల్లేకుండా సాగుతుంది. ఇక మూడవ వరుసలో సీట్లు ఎత్తైన పిల్లలకు బాగా సరిపోతాయి. ఫ్లెక్సిబుల్ ఫోల్డింగ్ ఆప్షన్లతో స్టోరేజ్ అవసరాలకూ బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక ముఖ్యమైన అంశం, మైలేజ్. ట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో లభించే ఎర్టిగా పెట్టిన ఖర్చుకు తగినంత మైలేజ్ ఇస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలనుండి పెద్ద విహారయాత్రల వరకు ఇది బెస్ట్ ఎంపీవీ.
Toyota Rumion: టయోటా రూమియన్ కుటుంబ ప్రయాణాల కోసం పుట్టినదే. ఈ 7-సీట్ల MPV డిజైన్, ఫినిషింగ్, మరికొంత ప్రీమియం అనిపించేలా ఉంటుంది. పెద్ద గ్రీల్, సాఫ్ట్ ఎడ్జ్‌లతో కూడిన స్టైలింగ్, టయోటాకు మేటి బ్రాండ్ వ్యాల్యూ దీనికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, కలర్స్ కలయికతో కూడిన డాష్‌బోర్డ్, సౌకర్యవంతమైన సీట్లు, వినియోగానికి సరిపడినంత స్థలం ఈ కారులో ఉన్నాయి.

7 సీట్ల సెటప్‌లో ప్రతి వరుసలోనూ ప్రయాణికులకు తగినంత విశాలమైన స్థలం ఉంది. కాళ్లకు ముందు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్‌తో పాటు ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి CNG వేరియంట్ కూడా కొనుగోలు చేయడానికి లభిస్తుంది. దీంతో ప్రయాణ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే ఇది మంచి మైలేజ్ అందించడంలో ఎప్పుడు ముందు ఉంటుంది.
Kia Carens Clavis: కియా కారెన్స్ క్లావిస్ ఇటీవల మార్కెట్లోకి విడుదల అయింది. ఇది కుటుంబానికి అవసరమైన స్థలం అందించడంతో పాటు, లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరిచేలా రూపొందించబడ్డ 7-సీటర్ కారు. వాహనం లోపల అడుగుపెడితే, ఇది సాధారణంగా భావించే "ఫ్యామిలీ కారు"గా కాకుండా, ఒక క్లాసీ క్యాబిన్ లాగా అనిపిస్తుంది. మూడువరుసల సెటప్‌లో రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. మూడవ వరుసలో కూడా, ప్రత్యేకించి పిల్లలకు సరిపోయే స్థలం ఉంటుంది.

ఈ ఎంపీవీలో అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్స్‌తో ఇది మిడ్-సెగ్మెంట్ MPV అయినా కూడా లగ్జరీ కార్ల స్థాయిలో అనిపించేలా చేస్తాయి. ఇది పెట్రోల్, డీజిల్, టర్బో వేరియంట్లు, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు ఉన్నాయి. ఇది ప్రతి డ్రైవర్‌కు, వారి అవసరాలకి అనుగుణంగా సరిపోయే విధంగా ఉంటూ, ప్రతి ప్రయాణాన్ని ఆనందంగా మార్చగలదు.


Click it and Unblock the Notifications








