దేశంలో బడ్జెట్ కార్లలో రారాజు.. 30.61 కి.మీల మైలేజ్.. ధర రూ.5.99 లక్షలు.. గత నెలలో సేల్స్ ఎన్నంటే

దేశీయ ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మారుతి సుజుకి (maruti Suzuki) సంస్థకు చెందిన బాలెనో (Baleno) కారు భారతీయ మార్కెట్లో ఎంతో ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. పరిచయం అవసరం లేని ఈ హ్యాచ్‌బ్యాక్ కారు, తన శైలి, పనితీరు, మైలేజ్‌, విశ్వసనీయతతో కోట్లాది మంది వినియోగదారుల మనసులను గెలుచుకుంది. సరసమైన ధరలో లభించడమే కాకుండా, దీనిలో లభించే ఫీచర్లు ప్రీమియం సెగ్మెంట్ కార్లకు ఏమాత్రం తీసిపోనివి. అంతేకాక, బాలెనో రీసేల్ విలువ కూడా మంచి స్థాయిలో ఉండటంతో చాలా మంది వినియోగదారులు దీన్ని మొదటి ఎంపికగా ఎంచుకుంటుంటారు. మైలేజ్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, అందమైన డిజైన్, ఇవన్నీ కలగలసి బాలెనోను మధ్యతరగతి కుటుంబాలకు ఒక కలల కారులా నిలబెట్టాయి.

అయితే, ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ కారు విక్రయాలు కాస్త మందగించాయని స్పష్టమవుతోంది. సెప్టెంబర్ 2025 నెలలో మారుతి సుజుకి బాలెనో మొత్తం 13,173 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 14,292 యూనిట్లతో పోలిస్తే దాదాపు 8 శాతం తగ్గుదల అని చెప్పాలి. ఈ తగ్గుదల వెనుక కొన్ని కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

India Best Budget Car Maruti Suzuki Baleno September 2025 Sales Report

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVలు, కాంపాక్ట్ క్రాస్ఓవర్‌లు వరుసగా లాంచ్ అవుతుండటంతో, కస్టమర్ల దృష్టి కొంతమేరకు ఆ మోడళ్లపై మళ్లింది. ఫలితంగా, బాలెనో వంటి హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలు తాత్కాలికంగా మందగించాయి. అలాగే, పండుగ సీజన్ ప్రారంభానికి ముందు చాలామంది తమ కొత్త కారు కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసి ఉండవచ్చు. అయితే, ఇప్పుడు పండుగ సీజన్ ఊపులో సాగుతుండటం బెస్ట్ అనచ్చు.

మారుతి సుజుకి రాబోయే నెలల్లో ఈ తగ్గుదల నుంచి తిరిగి కోలుకునే అవకాశం బలంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పన్ను సడలింపులు (GST మినహాయింపులు) కూడా అమలులోకి రావడం వల్ల విక్రయాలు మరింత వేగం అందుకునే అవకాశం ఉందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి బాలెనో తొమ్మిది వేరియంట్లలో అందుబాటులో ఉంది.

India Best Budget Car Maruti Suzuki Baleno September 2025 Sales Report

దీని ధర రూ. 5.99 లక్షల నుండి రూ. 9.10 లక్షల మధ్య(ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీని ప్రధాన ఆకర్షణ ఇంజిన్, 1.2 లీటర్, 4 సిలిండర్, డ్యూయల్‌జెట్ K12N పెట్రోల్ ఇంజిన్, ఇది మైలేజ్, పనితీరును అందిస్తుంది. బాలెనోలో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు లభిస్తాయి. ఈ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 90 bhp పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇది నగర డ్రైవింగ్‌కి, అలాగే హైవే లాంగ్ డ్రైవ్స్‌కి కూడా సరైన సమతౌల్యం కలిగిన ఇంజిన్‌గా పేరుగాంచింది. మైలేజ్ విషయానికొస్తే, మారుతి సుజుకి ఎప్పటిలాగే ఇంధన సామర్థ్యంలో రాజీ పడలేదు. కంపెనీ ప్రకారం, బాలెనో మాన్యువల్ వెర్షన్‌కు 22.35 kmpl, AMT వేరియంట్లకు 22.94 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది. ఇంధన ధరలు పెరుగుతున్న ఈ కాలంలో ఇది వినియోగదారులకు పెద్ద ప్రయోజనం.

India Best Budget Car Maruti Suzuki Baleno September 2025 Sales Report

కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మోడ్‌లో నడుస్తున్నప్పుడు బాలెనో పనితీరు గణాంకాలు పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, ఇంధన సామర్థ్యం మాత్రం ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉంది. మారుతి సుజుకి ప్రకారం, బాలెనో CNG వెర్షన్ 30.61 కి.మీ/కి.జీ మైలేజీని అందిస్తుంది. ఇది ఎక్కువ మైలేజ్ కోరుకునే కస్టమర్లకు సరైన ఆప్షన్‌గా మారింది. ఈ కారు 5 సీటర్ ఆప్షన్‌లో ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, October 13, 2025, 9:44 [IST]
English summary
India best budget car maruti suzuki baleno september 2025 sales report
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+