35 కి.మీ మైలేజ్ కారు రూ. 5 లక్షలకే! GST తగ్గింపుతో ఇంత తక్కువకేనా.. అందరు ఎగబడి కొంటారు!

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఒకప్పుడు చిన్న కార్ల విభాగంలో మంచి డిమాండ్‌ను సంపాదించిన మోడల్‌గా నిలిచింది. కానీ తాజాగా మార్కెట్ పరిస్థితులు మారడంతో, ఈ కారుకు అంతగా డిమాండ్ రాలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్ నుండి జూలై వరకు) సెలెరియో అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం నాలుగు నెలల్లో కేవలం 6,765 యూనిట్లే అమ్ముడవ్వడం వల్ల, నెలకు సగటున 1,691 కార్లు మాత్రమే రోడ్ల మీదకు వచ్చాయి. ఈ సంఖ్య మారుతి సుజుకి లైనప్‌లో చాలా తక్కువ. బలమైన పోటీదారుల మధ్యలో నిలబడే ఇతర మోడళ్లతో పోలిస్తే, సెలెరియో అమ్మకాల పరంగా వెనుకబడిపోయినట్టే అనిపిస్తుంది. ఇకపోతే, ఇది మారుతి సుజుకి అత్యల్పంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా కూడా గుర్తించబడుతోంది.

చిన్న కారు కావడంతో, ధర పరంగా అందుబాటులో ఉన్నా, వినియోగదారుల అభిరుచులు SUVలు, కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ మోడళ్ల వైపు ఎక్కువగా చూడటంతో సెలెరియో వెనుకబడిపోయింది. అలాగే, గత కొన్నేళ్లలో మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైన్‌లు, అప్‌డేట్ ఫీచర్లు కలిగిన మోడళ్లతో పోలిస్తే, సెలెరియోలో పెద్దగా మార్పులు కనిపించకపోవడం కూడా అమ్మకాల తగ్గడానికి కారణమని చెప్పాలి. అయితే, ఈ పరిస్థితి రాబోయే నెలల్లో కొంతవరకు మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

India Best Budget Car Maruti Suzuki Celerio Gst Cut Expected New Price

ఎందుకంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం GST రేట్లను తగ్గించింది. దీని ప్రభావం చిన్న కార్ల ధరలపై పడనుంది. ధర తగ్గడం అనేది ఎప్పుడూ వినియోగదారుల నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంట్రీ లెవల్ కారు కొనుగోలు చేసేందుకు చూస్తున్న మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ధరలకు లభించే మోడళ్లవైపు దృష్టి మళ్లించే అవకాశాలు ఎక్కువ. ఆ కోణంలో చూస్తే, సెలెరియో అమ్మకాలు మళ్లీ గాడిలో పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.

మారుతి సుజుకి సెలెరియో ధరల విషయానికి వస్తే ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ.5.64 లక్షల నుంచి ప్రారంభమై, ప్రస్తుతం ఇది భారత మార్కెట్లో అత్యంత సరసమైన కార్లలో ఒకటిగా నిలుస్తోంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.7.37 లక్షల వరకు ఉంది. ఈ రేంజ్‌లో లభించే కారు కావడంతో, చిన్న కుటుంబాల కోసం లేదా మొదటి కారుగా కొనుగోలు చేసే వారికి ఇది ఒక మంచి ఆప్షన్‌గా పరిగణించబడుతోంది.

India Best Budget Car Maruti Suzuki Celerio Gst Cut Expected New Price Details

ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన GST పన్ను తగ్గింపు నిర్ణయం కార్ల ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ఈ తగ్గింపు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్ల ధరలు ఎంత వరకు తగ్గుతాయో ప్రకటించాయి. అయితే, మారుతి సుజుకి మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

అయినా, ఆటోమొబైల్ రంగ నిపుణుల అంచనాల ప్రకారం, సెలెరియో ధరలు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధరను సుమారు రూ.50,000 తగ్గించి రూ.5.14 లక్షల వరకు పరిమితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతే కాకుండా, టాప్ వేరియంట్ ధరను దాదాపు రూ.70,000 తగ్గించి రూ.6.40 లక్షల వరకు తగ్గించవచ్చని అంచనా. ఇవి అన్ని ఇప్పటివరకు లభించిన అంచనాలు మాత్రమే.

India Best Budget Car Maruti Suzuki Celerio Gst Cut Expected New Price Details

మారుతి సుజుకి అధికారిక ప్రకటన చేసే వరకు ఈ సంఖ్యలు ఖచ్చితమని చెప్పలేము. అయినప్పటికీ, GST తగ్గింపు అమల్లోకి వచ్చిన తర్వాత సెలెరియో మరింత సరసమైన ధరలో లభించే అవకాశం ఉండటంతో, రాబోయే నెలల్లో ఈ కారు అమ్మకాలపై పాజిటివ్ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారులో ప్రధాన ఆకర్ణణ దీని మైలేజ్ దీని CNG వేరియంట్లు గరిష్టంగా 34.43 కి.మీ/కి.గ్రా మైలేజీని అందిస్తాయి.

మొత్తానికి, ఇప్పటివరకు సెలెరియో మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, GST తగ్గింపు వల్ల వచ్చే ధరల తగ్గింపుతో ఈ కారు మళ్లీ వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో అమ్మకాల గణాంకాలు ఈ అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది స్పష్టమవుతుంది. చిన్న కార్ల విభాగంలో ఇంకా పోటీ కొనసాగుతూనే ఉంటుంది, అందులో సెలెరియో తన స్థానం నిలబెట్టుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, September 8, 2025, 9:14 [IST]
English summary
India best budget car maruti suzuki celerio gst cut expected new price details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+