రోడ్ల మీద కింగ్‌లాంటి కార్లలో తిరగాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ తోపు కార్లలో ఒకటి ఇప్పుడే బుక్ చేసుకోండి!

భారతదేశంలోని ఆటోమోటివ్ రంగం వేగంగా మారుతున్నప్పటికీ, డీజిల్ SUVల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అధిక మైలేజ్, శక్తివంతమైన, మెరుగైన పెర్ఫార్మెన్స్ కారణంగా, ఇవి ఇంకా వినియోగదారులకు బాగా ఇష్టమైన మోడళ్లుగా అత్యంత ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే, మార్కెట్‌లో డీజిల్ వేరియంట్లను మెల్లగా తగ్గించే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రత్యేకంగా ఆటోమేటిక్ గేరింగ్ కలిగిన డీజిల్ SUVల ఎంపికలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అయినప్పటికీ మార్కెట్లో కొన్ని రూ. 25 లక్షల ధరలో వినియోగదారులకు అనుకూలమైన కార్లు అందుబాటులో ఉన్నాయి.

అందుబాటులో ఉన్న ఈ SUVలు కేవలం నగర రోడ్లకే కాకుండా హైవే డ్రైవింగ్, లాంగ్ జర్నీలు, ఆఫ్-రోడింగ్ అవసరాలకు కూడా సరిపోతాయి. డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే అధునాతన ఫీచర్లు, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, ఫ్యూయల్ ఎఫిషియెన్సీతో ఈ కార్లు భారతీయ వినియోగదారులకు బలమైన ఎంపికలను ఉన్నాయి. ఇక వాటి గురించి కింది కథనంలో తెలుసుకుందాం.

India Best Diesel Cars Under Rs 25 Lakh

డీజిల్ SUVల విభాగంలో మరింత ప్రీమియం అనుభూతిని కోరుకునే వినియోగదారులకు మహీంద్రా XUV3XO ఒక ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. శక్తివంతమైన ఇంజిన్, అధునాతన ఫీచర్స్, సరికొత్తగా ఆకట్టుకునే డిజైన్‌తో వినియోగదారలను ఆకర్షిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 11.79 లక్షలు, టాప్-ఎండ్ మోడల్ రూ. 14.49 లక్షలు వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ మరింత దేశంలోని వివిధ నగరాలను బట్టి మరుతూ ఉంటుంది.

XUV3XO లో 117hp పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ వినియోగదారులకు బలమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ AMT(ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌‌ను జోడించారు. ఈ ఆప్షన్ మిడ్-స్పెక్ MX3 వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కావడంతో, ట్రాఫిక్ పరిస్థితుల్లోనూ, హైవే డ్రైవింగ్‌లోనూ సులభమైన హ్యాండ్లింగ్ అందిస్తుంది.

Diesel Automatic Transmission Suvs

XUV3XO డీజిల్-AMT కాన్ఫిగరేషన్‌లో టాప్-స్పెక్ AX7L వేరియంట్ అందుబాటులో లేకపోయినప్పటికీ, దీని మిడ్-స్పెక్ మోడల్స్ కూడా లగ్జరీ SUV అనుభూతిని అందిస్తాయి. ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే సన్‌రూఫ్, లోపల నుంచే బయటి ప్రాంతాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తుంది. ప్రయాణికుల కంఫర్ట్‌కు ప్రాధాన్యత ఇస్తూ డ్యూయల్-జోన్ AC వంటి వాటిని కలిగి ఉంది. ఇది 21.2 kmpl మైలేజ్ వస్తుంది. శక్తివంతమైన ఇంజిన్,ప్రీమియం ఫీచర్లతో ఫుల్ SUV అనుభూతిని అందిస్తుంది.

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ SUV నెక్సాన్ డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్‌ను ఆకర్షణీయమైన ధరలలో అందుబాటులో అందిస్తుంది. దీని ప్రారంభ ధర వచ్చేసి రూ. 11.70 లక్షల నుంచి రూ. 15.60 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. నెక్సాన్ డీజిల్-ఆటోమేటిక్ SUV సెగ్మెంట్‌లో అత్యంత పోటీదారుగా నిలుస్తోంది. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లో రన్ అవుతుంది.

Diesel Cars Under Rs 25 Lakh

ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ AMT (ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) జతచేశారు. అధిక పనితీరు, తక్కువ ఖర్చుతో ఇది భారతీయ వినియోగదారులకు బెస్ట్ కారుగా ఉంది. నెక్సాన్ డీజిల్ వేరియంట్ టాప్ వేరియంట్లలో వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇది లీటరుకు 24.08 కి.మీల వరకు మైలేజ్‌ను ఇస్తుంది. డీజిల్-AMT డార్క్ ఎడిషన్‌ అందరిని ఆకట్టుకుంటుంది.

దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్‌కు చెందిన కియా సోనెట్ తన శక్తివంతమైన 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అలాగే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో భారతీయ మార్కెట్‌లో హాట్ ఫేవరెట్‌గా ఉంది. అధిక మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ అనుభవం, స్టైలిష్ లుక్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. టాప్-ఎండ్ HTX, GTX+ వేరియంట్లలో లభించే ఫీచర్ల పరంగా కూడా ముందంజలో ఉంది.

Suvs Under Rs 25 Lakh

దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్‌కు చెందిన కియా సోనెట్ శక్తివంతమైన 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో భారతీయ మార్కెట్‌లో హాట్ ఫేవరెట్‌గా ఉంది. ఇది టాప్-ఎండ్ HTX, GTX+ వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోడల్ హైవే ట్రిప్స్‌లో మైలేజ్ పరంగా, నగర ప్రయాణాలకు తగినట్లుగా సాఫ్ట్, రెస్పాన్సివ్ గేర్ షిఫ్టింగ్‌ను కలిగి ఉంది. అందమైన డిజైన్, అధునాతన టెక్నాలజీ సోనెట్ సిద్ధంగా ఉంది.

ఈ డీజిల్-ఆటోమేటిక్ మోడల్ అత్యుత్తమ లగ్జరీ ఫీచర్లను అందించడంతో పాటు, 18.6 kmpl మైలేజ్ ను కూడా అందిస్తూ ప్రీమియం సేల్స్ సెగ్మెంట్‌లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఇది కేవలం అధునాతన డ్రైవింగ్ అనుభూతిని మాత్రమే కాకుండా, వేగం, పనితీరు పరంగా కూడా మెరుగైన స్థాయిని అందిస్తుంది. సోనెట్ తన స్టైలిష్ డిజైన్, లగ్జరీ ఇంటీరియర్, హై-టెక్ ఫీచర్లతో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని పొందుతోంది.

డీజిల్ SUVలలో మహీంద్రా XUV700 సత్తా చాటుతోంది. ఇది రూ.25 లక్షల (ఎక్స్ షోరూమ్) లోపు ధరలో అత్యంత శక్తివంతమైన SUVగా నిలుస్తోంది. ఈ కారు బలమైన 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 185hp పవర్, 420Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ AX3 వేరియంట్ పైన ఎబోనీ ఎడిషన్ అనే ప్రత్యేకమైన వేరియంట్‌ను అందిస్తోంది. బ్లాక్ కలర్ థీమ్ డిజైన్‌తో స్టైలిష్ లుక్‌ను కలిగి ఉంది.

ఇది లీటర్‌కు దాదాపు 16.57 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. ముఖ్యంగా XUV700 టాప్-స్పెక్ AX7L వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఎంపిక కూడా ఉంది. ఇది అధిక రోడ్ గ్రిప్, మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఫీచర్ల పరంగా మెరుగైన ఇంటీరియర్, స్మార్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ సేఫ్టీ ప్రమాణాలతో మహీంద్రా XUV700 కారు SUV ప్రేమికులకు బెస్ట్ ఎంపిగా మారుతుంది.

టాటా మోటార్స్‌కు చెందినటువంటి టాటా హారియర్, టాటా సఫారీ రెండు శక్తివంతమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ఫియట్-సోర్స్డ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్స్, 170hp పవర్, 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను వీటి ఇంజిన్లకు జోడించారు. ఇవి ప్రీమియం స్టైల్, అధునాతన టెక్నాలజీ, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ కలిగి ఉండటంతో మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాయి.

టాటా హారియర్ ప్రారంభ ధర రూ. 19.35 లక్షలు. టాటా సఫారీ ధర రూ. 19.85 లక్షలు. ఈ SUVలు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS సేఫ్టీ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో భద్రత, వినోదాన్ని కలిపి ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. హారియర్ కారు లీటర్‌కు 16.8 కిమీలు, సఫారీ లీటర్‌కు 14.1 కి.మీల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 27, 2025, 12:52 [IST]
English summary
India best diesel automatic transmission suvs under rs 25 lakh tata harrier safari kia sonet etc
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+