ఇండియాలో బెస్ట్ డీజిల్ కార్లు.. గ్రామాల్లో, నగరాల్లో పర్ఫెక్ట్‌! పైగా ధర చాలా తక్కువే

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో డీజిల్ కార్లకు ఇప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ, డీజిల్ కార్ల మైలేజ్, పవర్, మన్నిక ఇప్పటికీ చాలా మంది వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వీటి డిమాండ్ ఎక్కువగా ఉండటం సహజమే, కానీ నగరాల్లో కూడా ఎక్కువకాల వినియోగం, మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కారణంగా ఇవి చాలా మందికి ప్రిఫర్డ్ ఆప్షన్‌గానే ఉన్నాయి. ముఖ్యంగా, రూ.10 లక్షల లోపు డీజిల్ కార్లకు మార్కెట్లో డిమాండ్ కొనసాగుతోంది. వాటిలో టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్, మహీంద్రా బొలెరో నియో, బొలెరో, టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్లు ప్రస్తుతం మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.

Tata Altroz: ఈ జాబితాలో ఉన్న వాహనాల్లో మొదటగా టాటా ఆల్ట్రోజ్ డీజిల్‌ను తీసుకుంటే, ఇది ప్రస్తుతం మార్కెట్లో లభించే అత్యంత సరసమైన డీజిల్ హ్యాచ్‌బ్యాక్. దీని ధర రూ.8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. బలమైన నిర్మాం, ప్రీమియం ఫీచర్లు, సురక్షితమైన డిజైన్ కారణంగా మధ్యతరగతి కుటుంబాలకు ఆల్ట్రోజ్ మంచి ఆప్షన్. ఇందులో ఉన్న 1.5-లీటర్ టర్బోడీజిల్ ఇంజిన్ 90 bhp పవర్, 200 Nm టార్క్ ఇస్తుంది.

India Best Diesel Cars In India Altroz Bolero Nexon

Mahindra Bolero: మహీంద్రా బొలెరో గురించి చెప్పాలంటే, ఇది నిజంగా భారతీయ రోడ్లకోసం పుట్టిన SUV అని చెప్పాలి. ముఖ్యంగా కఠినమైన రోడ్లు, ఎత్తైన గుట్టలు, గ్రామీణ మార్గాలు.. ఎలాంటి పరిస్థితులైనా ఈ కారు సులభంగా ఎదుర్కోగలదు. అదే కారణంగా, బొలెరో ఎన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, రోజూ ఎక్కువ ప్రయాణించే డ్రైవర్ల మధ్య అత్యంత విశ్వసనీయ వాహనంగా నిలిచింది.

దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవడం వల్ల, రఫ్ యూజ్ కోసం మంచి SUV కావాలనుకునే వారికి ఇది బడ్జెట్‌లోనే లభించే ఆప్షన్‌గా ఉంటుంది. బొలెరోలో ఉన్న 1.5-లీటర్ mHawk 75 డీజిల్ ఇంజిన్ 75 bhp పవర్, 210 Nm టార్క్‌ను అందించడం దీని ప్రాక్టికల్ పనితీరుకు బేస్. పేపర్‌పై ఈ సంఖ్యలు పెద్దగా కనిపించకపోయినా, రియల్-వర్డ్ డ్రైవింగ్‌లో ఈ ఇంజిన్ సూపర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది.

India Best Diesel Cars In India Altroz Bolero Nexon

Mahindra Bolero Neo: బొలెరో నియో బడ్జెట్ డీజిల్ కార్ల జాబితాలో కీలక స్థానం దక్కించుకుంది. ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు ఉండటం వల్ల, తక్కువ ఖర్చుతో శక్తివంతమైన SUV కోరుకునేవారికి చాలా మంచి ఎంపికగా మారింది. బొలెరో నియోలో ఉన్న 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ దాని ప్రధాన బలం. ఈ ఇంజిన్ 98.6 bhp పవర్ మరియు 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇది నగర రోడ్లలోనూ, గ్రామీణ కఠినమైన మార్గాల్లోనూ సులభంగా పరుగులు తీసే సామర్థ్యం కలిగి ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే, బొలెరో నియో పూర్తిగా ఆధునిక ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఇందులో లెదర్ సీట్లు, రియర్ వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, అలాగే 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. ఇవన్నీ ఈ ధరలో లభించడం వినియోగదారుల కోసం పెద్ద ప్రయోజనం.

India Best Diesel Cars In India Altroz Bolero Nexon

Tata Nexon: టాటా నెక్సాన్ డీజిల్ భారతీయ మార్కెట్‌లో ఎప్పటి నుంచో నమ్మకమైన కాంపాక్ట్ SUV గా పేరుపొందింది. బలమైన బాడీ స్ట్రక్చర్, మన్నికైన నిర్మాణం, అలాగే 5-స్టార్ గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్‌తో ఈ కారు దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ధర రూ.9.01 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 24, 2025, 16:50 [IST]
English summary
India best diesel cars in india altroz bolero nexon more details inside
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+