బైకుతో పాటు సమానంగా మైలేజ్ ఇచ్చే కారు.. 5 స్టార్ సేఫ్టీ.. దీనికోసం షోరూమ్‌లకు ఎగబడ్డ జనం

మారుతి సుజుకి డిజైర్‌ (Maruti Suzuki Dzire) ఎప్పటినుంచో భారతీయ కుటుంబాల నమ్మకాన్ని సంపాదించిన సెడాన్‌. ఆకర్షణీయమైన డిజైన్‌, సరళమైన డ్రైవింగ్ అనుభవం, డజన్ల కొద్దీ ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరతో ఈ కారుకు ప్రత్యేకమైన మార్కెట్‌ ఉంది. అందుకే, గతంలోనూ వరుసగా ప్రజలు ఈ కారును పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తూ వచ్చారు. ఇక తాజాగా, 2025 ఆగస్టు నెలలో కూడా డిజైర్‌ తన అమ్మకాలలో మరోసారి రికార్డు నెలకొల్పింది. ఈ ఒక్క నెలలోనే మొత్తం 16,509 యూనిట్లు కొనుగోలుదారుల చేతికి చేరాయి. ఈ సంఖ్య గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే విపరీతమైన వృద్ధిని సూచిస్తోంది.

ఎందుకంటే, 2024 ఆగస్టులో డిజైర్‌ అమ్మకాలు 10,627 యూనిట్ల వద్ద ఆగిపోయాయి. అంటే, ఒక్క సంవత్సరం వ్యవధిలోనే డిజైర్‌ అమ్మకాల పరిమాణం 55.35 శాతం పెరిగింది. ఈ వృద్ధి డిజైర్‌ మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. పెట్రోల్‌, సిఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉండడం, మైలేజ్‌ విషయంలో అందించే విశ్వసనీయత, అలాగే సుజుకి సర్వీస్‌ నెట్‌వర్క్‌ విస్తృతం కావడం వంటివి డిజైర్‌ విజయానికి ప్రధాన కారణాలు.

India Best Family Budget Car Maruti Suzuki Dzire August 2025 Sales Report

ఒకవైపు కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చినా, డిజైర్‌ ఎప్పటికీ ఫేవరెట్‌గా నిలిచిన కారు. ఈ డిమాండ్ ఇలాగే కొనసాగినట్లయితే డిజైర్‌ భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరచుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. కొత్త మారుతి సుజుకి డిజైర్ సెడాన్‌ అమ్మకాలు ఈ మధ్య మరింత ఊపందుకున్నాయి. దీనికి ప్రధాన కారణం పండుగ సీజన్‌తో కలిసిన డిమాండ్ మాత్రమే కాదు, కారు అందుకున్న భద్రతా గుర్తింపు కూడా.

గ్లోబల్ NCAP, భారత్ NCAP సేఫ్టీ టెస్టుల్లో డిజైర్‌కు 5-స్టార్ రేటింగ్ రావడం, కొనుగోలుదారుల విశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. ఫ్యామిలీ కారుగా నమ్మకంగా వాడుకునే మోడల్ కావడంతో, ఎక్కువ మంది ఈ సెడాన్ వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం డిజైర్‌ ధరలు కూడా పోటీదారులతో పోలిస్తే ఆకర్షణీయంగానే ఉన్నాయి. కనీస ధర రూ.6.84 లక్షలు, గరిష్టంగా రూ. 10.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తోంది.

India Best Family Budget Car Maruti Suzuki Dzire August 2025 Sales Report

అంతేకాకుండా, పెట్రోల్, సిఎన్‌జి, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉండటం వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లను ఇస్తోంది. మరికొన్ని వారాల్లో డిజైర్ ధరలు మరింతగా తగ్గే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జిఎస్‌టి స్లాబుల్లో మార్పులు చేసింది. 1200 సిసి వరకు, 1500 సిసి వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్లపై జిఎస్‌టి రేటును 28% నుండి 18%కి తగ్గించింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి.

అంటే, ఈ మార్పు అమల్లోకి వచ్చిన తరువాత డిజైర్ ధరలో గణనీయమైన తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. దీని వలన ఇప్పటికే పాపులర్‌గా ఉన్న డిజైర్‌ మరింత మంది కస్టమర్లను ఆకర్షించనుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగ సీజన్ ఉత్సాహం, భద్రతా రేటింగ్‌లో విజయాలు, రాబోయే ధరల తగ్గింపు కలిసొచ్చి డిజైర్‌ను మరోసారి మాస్ ఫేవరెట్ సెడాన్‌గా నిలబెడతాయని చెప్పవచ్చు.

India Best Family Budget Car Maruti Suzuki Dzire August 2025 Sales Report

మారుతి సుజుకి డిజైర్‌ తన శక్తివంతమైన డ్యూయల్ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో మరింత ప్రత్యేకతను సాధించింది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 1.2-లీటర్ CNG ఇంజిన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టు ఈ రెండు ఆప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో వస్తుంది. డిజైర్‌ 24 kmpl నుండి 33 kmpl వరకు మైలేజీ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 11, 2025, 9:32 [IST]
English summary
India best family budget car maruti suzuki dzire august 2025 sales report
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+