పేద-మిడిల్‌ క్లాస్‌కు సరైన కారు.. రూ.5.70 లక్షల ధర, 27 కి.మీ మైలేజ్, 6 సీట్లు.. బంపర్ సేల్స్!

మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) భారతీయ MPV మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నమ్మకమైన కారు. సింపుల్ కానీ ఉపయోగకరమైన డిజైన్, విశాలమైన ఇంటీరియర్ స్థలం, అనేక ఆకర్షణీయమైన అంశాలు దీనిని కుటుంబాల నుండి చిన్న వ్యాపారాల వరకు అన్ని వర్గాల వినియోగదారుల అవసరాలను తీర్చగల మోడల్‌గా నిలబెట్టాయి. ఫ్యూయల్, పనితీరులోనూ ఈకో తన క్లాస్‌లో మంచి పనితనాన్ని చూపిస్తుంది, అందుకే ఇది చాలామంది ఈ మల్టిపర్పస్ కారును కొనుగోలు చేయడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా విడుదలైన సేల్స్ నివేదిక ప్రకారం, మారుతి ఈకో 2025 జూలైలో 12,341 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది మార్కెట్లో ఈ మోడల్‌కు ఉన్న స్థిరమైన డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తుంది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2024 ఇదే కాలంలో అమ్ముడైన యూనిట్ల సంఖ్య 11,916, ఈ సంవత్సరం 4 శాతం వృద్ధి నమోదైంది. కొత్త మోడళ్ల ప్రవేశం, పెరుగుతున్న పోటీ, వినియోగదారుల అభిరుచుల మార్పులు ఉన్నప్పటికీ, ఈకో తన స్థానాన్ని కాపాడుకోవడమే కాకుండా, కొద్దికొద్దిగా పెరుగుతున్న అమ్మకాలతో మరింత బలపడుతోంది.ఇది కేవలం ఒక MPV మాత్రమే కాదు, విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చు, చిన్న వ్యాపారాలకు ఇది ఒక ప్రధానంగా ఉపయోగపడుతుంది.

India Best Family Car Maruti Suzuki Eeco July 2025 Sales Report

జూన్ నెలలో మారుతి సుజుకి ఈకో MPV అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయి. ఆ నెలలో మొత్తం 9,340 యూనిట్లు అమ్ముడుపోగా, ఇది మునుపటి నెలతో పోలిస్తే 24 శాతం వృద్ధి. ఈ పెరుగుదల, మార్కెట్లో ఈ మోడల్‌కు ఉన్న నిరంతర డిమాండ్‌ను మరొకసారి రుజువు చేస్తోంది. కేవలం ఒక నెలలోనే కాకుండా, 2025 మొదటి ఆరు నెలల గణాంకాలను పరిశీలించినా ఈకో తన పోటీ డిమాండ్‌ను కొనసాగించినట్టు స్పష్టమవుతుంది.

జనవరి నుండి జూన్ వరకు మొత్తం 66,257 యూనిట్లు అమ్ముడవ్వగా, సగటున ప్రతి నెలా 11,042 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది ఈకోకు ఉన్న మార్కెట్ బేస్, నమ్మకం, వినియోగ అవకాశాలను సూచిస్తోంది. MPV విభాగంలో వేరే కార్లు వచ్చినప్పటికీ, ఈకో తక్కువ నిర్వహణ ఖర్చు, బ్రాండ్ నమ్మకంతో వినియోగదారులను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. గణాంకాలు చూస్తే, ఈకో ఇంకా కొన్నేళ్లపాటు భారతీయ రోడ్లపై తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశముందని చెప్పవచ్చు.

India Best Family Car Maruti Suzuki Eeco July 2025 Sales Report

మారుతి సుజుకి ఈకో మధ్యతరగతి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. తక్కువ ధరలో లభించడం దీని ప్రధాన బలంగా నిలుస్తుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.70 లక్షల నుండి రూ. 6.96 లక్షల మధ్య ఉండటం వలన, ఇది కుటుంబాలకూ, చిన్న వ్యాపారాలకూ అందుబాటులో ఉంటుంది. సింపుల్‌గా కనిపించే ఈ మోడల్‌కి కొత్త డిజైన్ టచ్‌లు జోడించడంతో, ఇది ఆధునికత, వినియోగదారుల ప్రాక్టికల్ అవసరాలను కలిపిన మోడల్‌గా నిలిచింది.

కొత్త ఈకోలో 5 లేదా 6 సీట్ల ఎంపిక ఉంద. ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 81 bhp శక్తిని, 104.4 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి, నగర డ్రైవింగ్ నుండి హైవే క్రూయిజింగ్ వరకు సాఫీ పనితీరును అందిస్తుంది. అలాగే, 1.2-లీటర్ CNG ఇంజిన్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

India Best Family Car Maruti Suzuki Eeco July 2025 Sales Report

ఈకో 19 kmpl నుండి గరిష్టంగా 26.78 km/kg (CNG) వరకు మైలేజ్‌ను అందించగలదు. ది 40 లీటర్ల సామర్థ్యం కలిగిన పెట్రోల్ ట్యాంక్‌తో పాటు, 65 కిలోల సామర్థ్యం గల CNG ట్యాంక్‌ను కలిగి ఉంది. ఈకో తన ప్రయాణీకుల కోసం 6 ఎయిర్‌బ్యాగులు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 14, 2025, 16:20 [IST]
English summary
India best family car maruti suzuki eeco july 2025 sales report details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+