ఫుల్ ఫ్యామిలీ ట్రిప్‌కు టాప్ బెస్ట్ కార్లు.. బిజీ లైఫ్‌కు బ్రేక్ ఇచ్చి అంతా కలిసి ట్రిప్‌కు వెళ్లండి
కరోనా తర్వాత కాలంలో ఫ్యామిలీ టూర్లకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. కుటుంబం లేదా ఫ్రెండ్స్‌తో కలిసి అందరూ తమ బిజీ లైఫ్‌కు కాస్త విరామం ఇచ్చి దూర ప్రాంతాలకు వెళ్లి తమ బాధలను, ఒత్తిడిని తగ్గించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా టెక్ ఉద్యోగుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో వీకెండ్స్ సమయాల్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కడికైన లాంగ్ జర్నీలు లాంటివి ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటివి ప్రస్తుతం బాగా ఎక్కువ అయ్యాయి. అయితే ఎక్కువ మంది కలిసి ఒకేసారి ప్రయాణించడానికి సాధారణంగా 5 మంది కూర్చునే కార్లు సరిపోవు అలాంటి వారికి సీటింగ్ కెపాసిటీ కలిగినటువంటి కార్లు బాగా ఉపయోగపడుతాయి. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సీటింగ్ కలిగిన కార్లు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. వాహన తయారీ కంపెనీలు వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా పెద్ద కార్లను లాంచ్ చేస్తున్నాయి.
ఫ్యామిలీ కార్లు కావాలనుకునే వారు తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవడంలో ప్రస్తుతం చాలా సతమతం అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం దేశీయంగా చాలా కార్ల కంపెనీల నుంచి అదిరిపోయే మోడళ్లు అందుబాటులో ఉండటం. ఉన్న వాటిలో ఏది తీసుకోవాలో తెలియక కొంత మంది కస్టమర్లు ఇతరుల సలహాలు తీసుకుంటారు. అందుకే అలాంటి వారి కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లలో రెండు మోడళ్ల గురించి పూర్తిగా ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం ఫ్యామిలీ కార్లలో టాటా సఫారీ (Tata Safari), మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV700) బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. వీటి ఆకర్షణీయమైన డిజైన్స్ చాలా మంది వినియోగదారులను కట్టి పడిసేలా ఉంటాయి. వీటి లోపల ఫీచర్లు కూడా చాలా అధునాతనమైనవి. ఇవి ఎక్కువ సీటింగ్ కెపాసిటీతో ఉంటాయి. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఇవి సరిగ్గా సరిపోతాయి. వీటి ధర, ఫీచర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Mahindra XUV700: మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కుటుంబ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్. ఇది MX, AX, AX3,AX5తో పాటు ఇతర వేరియంట్లలో లభిస్తుంది. దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.99 లక్షల నుంచి ఉంటుంది. అదే టాప్ వేరియంట్ ధర రూ. 25.49 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఈ ఎస్‌యూవీ 2-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

దీని గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభిస్తుంది. దీని మైలేజ్ చూసినట్లయితే 17 కి.మీల వరకు వస్తుంది. కారు లోపల అధునాతన ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి. 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), చుట్టు చూడటానికి 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.
Tata Safari: టాటా సఫారీ ఒక ప్రముఖ SUVగా ఉంది. ఇది 6 లేదా 7 సీట్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.15.49 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.26.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు స్మార్ట్, ప్యూర్ అండ్ అడ్వెంచర్ వంటి వేరియంట్లలో లభిస్తుంది. ఈ SUV 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో రన్ అవుతుంది.

ఈ ఇంజిన్ 170 PS హార్స్ పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ విషయానికి వస్తే 16.3 కి.మీల వరకు వస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లన కలిగి ఉంది. కారు లోపల అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. 10-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS వంటివి దీనిలో ఉంటాయి.


Click it and Unblock the Notifications








