పేద-మిడిల్‌క్లాస్ వారు అతి తక్కువ ధరలో కొనగలిగే కార్లు.. పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తాయి!

రోజు వారీ ప్రయాణాలకు, పట్టణాల్లో సులభ డ్రైవింగ్‌కి, ఇంధన పొదుపు కోసం, అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండే వాహనాలను కోరుకునే కస్టమర్లు ఎక్కువగా ఉంటారు. అలాంటి వారికి హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు బాగా సెట్ అవుతాయి. మీరు కొత్త కారు కొనాలని భావిస్తుంటే, మార్కెట్‌లో ప్రస్తుతం బెస్ట్ ఆకర్షణీయమైన హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మారుతి సుజుకి ఇగ్నిస్, మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ i20 వంటి కార్లు బెస్ట్. ఈ కార్లు రోజు వారీ ప్రయాణాలకు, పట్టణాల్లో సులభ డ్రైవింగ్‌కి, ఇంధన పొదుపు కోసం, అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండే వాహనాలను కోరుకునే కస్టమర్లకు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఈ కింది కథనంలో చూద్దాం.

Maruti Suzuki Ignis: ఇగ్నిస్ చిన్న సైజ్‌లో ప్రీమియం ఫీల్ ఇచ్చే ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ అని చెప్పాలి. సిటీ రోడ్డులకైనా, చిన్న ట్రిప్‌లకైనా కంపాక్ట్‌గా, స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా కనిపించే ఈ కారు, తన క్లాస్‌లో మంచి ప్రెజెన్స్‌ను తీసుకువచ్చింది. ధర విషయానికి వస్తే, ఇగ్నిస్‌ను సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ. 5.35 లక్షల నుండి రూ. 7.55 లక్షల వరకు ఉంటుంది.

India Best Hatchback Cars Maruti Suzuki Ignis Baleno Hyundai i20 Details Inside

ఈ రేంజ్‌లో, ఇంత ఫీచర్లు, ఇంత బ్రాండ్ నమ్మకం కలిగిన కారు దొరకటం చాలా మందికి అట్రాక్షన్‌గా మారింది. రోజువారీ ఫ్యామిలీ యూజ్‌కి సరిపోయే 5-సీటర్ లేఅవుట్‌తో, చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఇగ్నిస్‌లో 1.2-లీటర్, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటర్‌కు సుమారుగా 21 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఇంత మైలేజ్ పెద్ద ప్లస్ పాయింట్.

Maruti Suzuki Baleno: మారుతి సుజుకి బాలెనో గురించి మాట్లాడితే, ఇది నిజంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఒక బెస్ట్-సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. సొగసైన ఎక్స్‌టీరియర్, విస్తారమైన కేబిన్, ఆధునిక ఫీచర్లు.. ఈ మూడింటి కలయిక వల్ల భారతీయ కుటుంబాల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బాలెనో ధరలు రూ. 5.99 లక్షల నుండి రూ. 9.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటాయి.

India Best Hatchback Cars Maruti Suzuki Ignis Baleno Hyundai i20 Details Inside

ఇంజిన్ విషయానికి వస్తే, బాలెనో రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్ + CNG వేరియంట్‌లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ రిఫైండ్ డ్రైవింగ్ ఫీల్‌తో ఆకట్టుకుంటే, CNG ఆప్షన్ మైలేజ్ అందిస్తుంది. ఈ కారు 22 నుండి 30 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఈ మైలేజ్ బాలెనోను మరింత అట్రాక్టివ్ ఆప్షన్‌గా మారుస్తుంది.

Hyundai i20: హ్యుందాయ్ ఐ20 ధర రూ. 6.87 లక్షల నుంచి రూ. 10.43 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండటం వల్ల, బడ్జెట్‌కు అనుగుణంగా అనేక వేరియంట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. యంగ్ లుక్‌తో ఆకట్టుకునే ఈ కారు, స్మార్ట్ షార్ప్ లైన్స్, సిగ్నేచర్ హ్యుందాయ్ గ్రిల్, స్టైలిష్ అలాయ్ వీల్స్‌తో రోడ్డుపై ప్రత్యేక అటెన్షన్‌ను పొందుతుంది. ఇంజిన్‌లో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్‌ను ఉపయోగిస్తుంది.

India Best Hatchback Cars Maruti Suzuki Ignis Baleno Hyundai i20 Details Inside

నగరాల్లో స్మూత్ డ్రైవింగ్, హైవేల్లో కంఫర్టబుల్ క్రూజింగ్.. రెండింటినీ సమతుల్యం చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది లీటరుకు 16 నుంచి 20 కి.మీ వరకూ ఇస్తుంది, ఇది ఈ సైజ్, పనితీరు ఉన్న మోడల్‌కి మంచి ఫిగర్. ఇంటీరియర్ స్పేస్ గురించి మాట్లాడితే, ఐ20లో 5 మంది సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ఇది పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్స్ కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, November 17, 2025, 17:11 [IST]
English summary
India best hatchback cars maruti suzuki ignis baleno hyundai i20 details inside
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+