బైక్ లాంటి మైలేజ్.. కేవలం రూ.3.50 లక్షల నుండి! దేశంలో ప్రతి సామాన్యుడు కొనగలిగే కార్లు!
కొత్త కారు కొనడం అనేది చాలా మందికి జీవితంలో ఒక పెద్ద మైలురాయి. ఒకప్పుడు కలగా మాత్రమే అనిపించిన ఈ ప్రయాణం, ఇప్పుడు కుటుంబ అవసరాలు, బడ్జెట్, సౌకర్యం, సేఫ్టీ అన్ని కలిపి సరైన ఎంపికను తీసుకోవాల్సిన సమయంగా మారుతుంది. ముఖ్యంగా చిన్న కుటుంబాలు, ఉద్యోగస్తులు, మొదటిసారి కారు కొనబోయే వారు తమ బడ్జెట్‌ను దాటకుండా మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, విశాలమైన సీటింగ్ స్పేస్ ఒకే ప్యాక్‌లో దొరకే కార్లను వెతుకుతుంటారు. మీరు కూడా చౌక ధరలోనే మంచి ఫీచర్లతో ఉన్న కొత్త కారు కోసం చూస్తున్నట్లయితే, మారుతి సుజుకి అందించే హ్యాచ్‌బ్యాక్‌లు మీకు బెస్ట్ ఆప్షన్. అందులో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఆల్టో K10, వ్యాగన్‌ఆర్, సెలెరియో కొత్తగా కారు కొనాలనుకునే వారి లిస్ట్‌లో టాప్‌లో నిలుస్తుంది. వీటి గురించిన వివరాలు ఈ కథనంలో.
Maruti Suzuki S-Presso: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో భారత మార్కెట్లో అత్యంత అందుబాటు ధరలో లభించే చిన్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. మొదటిసారి కారు కొనబోయే వారికి, తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఇది నిజమైన వాల్యూ ఫర్ మనీ ఎంపికగా మారింది. దీని ధరలు కూడా చాలా ఆకర్షణీయమైనవి. ఎస్-ప్రెస్సో ఎక్స్-షోరూమ్ ధర రూ.3.50 లక్షల నుంచి రూ.5.25 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో లభిస్తుంది.

ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, ఈ కారు 1-లీటర్ పెట్రోల్, 1-లీటర్ పెట్రోల్+CNG వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ సిటీ రైడింగ్‌కు సరిపోయే స్మూత్ పనితీరును ఇస్తే, CNG వేరియంట్ మరింత ఎకానమీలో ప్రయాణాలు చేయాలనుకునే వారి కోసం బెస్ట్ ఆప్షన్. మైలేజ్ పరంగా చూస్తే, ఎస్-ప్రెస్సో 24 నుండి 32 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందించడం దీని ప్రధాన హైలైట్.
Maruti Suzuki Alto K10: మారుతి సుజుకి ఆల్టో కె10 భారత కుటుంబాల్లో దశాబ్దాలుగా నిలిచిపోయిన ఒక విశ్వసనీయ హ్యాచ్‌బ్యాక్. దీని ధరలు కూడా చాలా అందుబాటులో ఉంటాయి. ఆల్టో కె10 రూ. 3.70 లక్షల నుండి రూ. 5.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో లభించడం వలన, అది తక్కువ ఖర్చుతో మంచి ఫీచర్లు కోరుకునే కుటుంబాలకు అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.

ఇంజిన్ పరంగా చూస్తే, ఇందులో 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, రోజువారీ ప్రయాణాల్లో ఖర్చును తగ్గించాలని భావించే డ్రైవర్ల కోసం 1-లీటర్ CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. మైలేజ్ విషయంలో తన సెగ్మెంట్‌లో అగ్రగామిగా నిలుస్తూ 24 నుండి 34 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. స్పేస్ విషయానికి వస్తే, ఆల్టో కె10 5 మంది కూర్చునేలా రూపొందించబడింది, చిన్న కుటుంబాలకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
Maruti Suzuki Celerio: మారుతి సుజుకి సెలెరియో భారత మార్కెట్లో మైలేజ్ కింగ్‌గా పేరుగాంచిన హ్యాచ్‌బ్యాక్. ధరల విషయానికి వస్తే, సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.73 లక్షల వరకు ఉండటం, చిన్న కుటుంబాలు, మొదటి సారి కారు కొనేవారు, రోజూ ఎక్కువ ప్రయాణించే వారికి బెస్ట్ ఆప్షన్‌గా మారుస్తోంది. ఇది 25 నుండి 34 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

Maruti Suzuki WagonR: మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికీ సింపుల్‌గా బెస్ట్ అనే ట్యాగ్‌ను నిలబెట్టుకుంటోంది. దీని ధర కూడా చాలా అందుబాటులోనే రూ.4.99 లక్షల నుండి రూ.6.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో లభిస్తుంది. మైలేజీ విషయానికి వస్తే, ఈ కారు 23 నుండి 34 kmpl వరకు ఇస్తుంది. ఇది నిజంగా బైక్‌లను గుర్తు చేసేంత మైలేజీ.


Click it and Unblock the Notifications








