డాక్టర్లు, ఇంజనీర్లకు ఈ కారంటే చాలా ఇష్టం.. రూ.4.99 లక్షలు.. 34 కి.మీల మైలేజ్
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (maruti suzuki wagonr) గురించి చెప్తే, భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే హ్యాచ్‌బ్యాక్ అని చెప్పే స్థాయిలో ఈ కారుకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. వైద్యులు, ఇంజనీర్లు వంటి ప్రొఫెషనల్స్ నుంచి సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, గృహిణులు... ఇలా వివిధ వర్గాల వినియోగదారుల దృష్టిని ఒకే రకంగా ఆకర్షించగలిగిన అరుదైన మోడల్ ఇది. తక్కువ బడ్జెట్‌లో మంచి స్పేస్‌తో కూడిన, నమ్మదగిన కారును కోరుకునే వారి కోసం వ్యాగన్ఆర్ ఎప్పటి నుంచో సేఫ్ & సెన్సిబుల్ ఛాయిస్‌గా నిలుస్తోంది. చిన్న కుటుంబాల రోజువారీ అవసరాలకు, నగర డ్రైవింగ్‌కు, అలాగే కాస్తదూర ప్రయాణాలకు కూడా ఈ కారు సరిగ్గా సరిపోయేలా రూపొందించబడింది.
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ మోడల్ మరింత ఆధునిక రూపంలో మారుతూ కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరు, ఆర్థికంగా ప్రయోజనకరమైన మైలేజ్‌తో వినియోగదారుల నమ్మకాన్ని మరింత బలపరచుకుంది. పాత జనరేషన్‌తో పోలిస్తే తాజా వ్యాగన్ఆర్‌లో మోడర్న్ డిజైన్, విస్తారమైన కేబిన్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లు, డ్రైవర్‌కు మరింత సౌకర్యం కలిగించే అప్‌డేట్‌లు జోడించబడటం వల్ల కస్టమర్ల ఆకర్షణ మరింత పెరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను అప్‌డేట్ చేసుకుంటుంది.

కొత్త కుటుంబాలను తనవైపు తిప్పుకునే గుణం ఈ కారును ఇతర హ్యాచ్‌బ్యాక్‌లలో ప్రత్యేకస్థానంలో నిలబెట్టింది. అమ్మకాల విషయానికి వస్తే, వ్యాగన్ఆర్ ఎప్పుడూ టాప్ సెల్లింగ్ కార్స్ జాబితాలో ఉండటం ఆశ్చర్యమే కాదు. గత నెలలోనే ఈ కారుకు వచ్చిన స్పందన దీనికి అద్దం పడుతుంది. మొత్తం 18,970 యూనిట్లు డెలివరీ కావడం వ్యాగన్ఆర్ ప్రజాదరణ ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతోందనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.
ధరలు కూడా ఈ కారును మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. బడ్జెట్-ఫ్రెండ్లీ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉండే ఈ మోడల్ రూ. 4.99 లక్షల నుండి రూ. 6.95 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య లభించడం వల్ల మొదటి కారు కొనాలనుకునే వారికి ఇదొక బలమైన ఆప్షన్. ఇది LXI, VXI, ZXI, ZXI+ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉండటం వల్ల కస్టమర్ల అవసరాలకు తగిన మోడల్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఇస్తుంది.

వ్యాగన్ఆర్ అందించే మూడు పవర్‌ట్రెయిన్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. మొదటగా, 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ స్మూత్ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా రూపొంది ఉంటుంది. 67 bhp పవర్, 89 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఈ ఇంజన్ చిన్న కుటుంబాలకు, రోజువారీ నగర ప్రయాణాలకు బాగా సరిపోతుంది. 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది.
దీని వల్ల ట్రాఫిక్‌లో తరచూ డ్రైవ్ చేసే వారికి ఇది మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. తరువాతి పవర్‌ట్రెయిన్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. 90 bhp పవర్, 113 Nm టార్క్‌ను అందించగలిగే ఈ ఇంజన్, మరింత శక్తివంతమైన, స్పందనశీలమైన పనితీరు కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా, రెండింట్లోనూ ఇది సమతూకమైన పవర్ డెలివరీ, మెరుగైన రైడింగ్ కంఫర్ట్‌ను ఇస్తుంది.

పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, మైలేజ్ కూడా వ్యాగన్ఆర్‌ను ప్రజాదరణ పొందేలా చేశాయి. డ్రైవింగ్, ఇంజన్ వేరియంట్ ఆధారంగా ఈ కారు 23 kmpl నుండి 34 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంత మంచి మైలేజ్ ఇవ్వడం ఈ మోడల్‌కు అదనపు బలం. అందమైన డిజైన్, విశాలమైన కేబిన్‌తో పాటు క్లాస్-లీడింగ్ మైలేజ్ ఈ కారును మధ్య తరగతి కుటుంబాలకు బెస్ట్‌గా నిలబెట్టాయి.


Click it and Unblock the Notifications








