35 కి.మీల వరకు మైలేజ్.. భారతదేశంలో తక్కువ ధరలో పేద-మిడిల్ క్లాస్ వారికి టాప్ బెస్ట్ కార్లు ఇవే!
ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉండటంతో ప్రజలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వినియోగదారులు కొత్త కారు కొనుగోలు చేసే ముందు మైలేజ్‌ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే అధిక మైలేజ్ ఇచ్చేవి, నిర్వహణ ఖర్చులను కూడా తక్కువగా అవుతాయి. దీంతో చాలా వరకు డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే అత్యుత్తమ మైలేజ్ కార్ల జాబితాలో టాప్ కంపెనీలకు చెందిన పలు మోడళ్లు ఉన్నాయి. మైలేజ్ ఎక్కువ కావాలని కోరుకునే వారి కోసం ఈ కథనంలో భారత మార్కెట్లో మంచి మైలేజ్ అందించే 5 కార్ల గురించి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ కార్లు ఎంటో ఒకసారి చూడండి.
ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే అత్యుత్తమ మైలేజ్ కార్ల జాబితాలో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ ముందంజలో ఉన్నాయి. ఈ రెండు SUVలు లీటర్ పెట్రోల్‌కు 27.97 కిలోమీటర్ల అత్యద్భుతమైన మైలేజ్‌ను అందిస్తాయి. ఈ రెండు కూడా డిజైన్ల పరంగా ఆకట్టుకునే మోడళ్లు. వీటిని ఒకే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. ముఖ్యంగా బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉన్నాయి. పెరిగిన ఇంధన ధరలతో బాధపడుతున్న వారికి ఇవి బెస్ట్ ఆప్షన్.

ఇందులో 1.5-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను 177.6 వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అందించారు. దీంతో ఈ టెక్నాలజీ ద్వారానే వీటి మైలేజ్ గణనీయంగా పెరిగింది. SUVలు ఇంధన సామర్థ్యానికి తోడు, మెరుగైన పనితీరు, టెక్నాలజీ, ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉండడం వల్ల, ఇవి సామర్థ్యం, పనితీరు కలయికతో ఖచ్చితంగా వినియోగదారులకు తగిన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ధరల పరంగా ఇవి మధ్య తరగతి కస్టమర్ కొనగలిగే విధంగా అందుబాటులో ఉంటాయి.
టయోటా హైరైడర్ హైబ్రిడ్ వెర్షన్ ధర రూ.16.81 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా హైబ్రిడ్ రూ.16.99 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. వీటి తరువాత హై మైలేజ్, హైటెక్ హైబ్రిడ్ వాహనాల మధ్య హోండా సిటీ e:HEV ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఇది ఆకట్టుకునే డిజైన్, అత్యాధునిక హైబ్రిడ్ టెక్నాలజీతో ఇండియా కార్ మార్కెట్లో మెరుగైన స్థానాన్ని కలిగి ఉంది.

రూ. 20.75 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద లభించే ఈ మోడల్, ఇతర సెడాన్లతో పోలిస్తే మైలేజ్ పరంగా ముందుంది. ఇది లీటర్‌కు 27.26 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ, ఎక్కువ మైలేజ్ కావాలనుకునే నుగోలుదారులకు బలమైన ఎంపికగా మారుతోంది. ఈ హైబ్రిడ్ సెటప్ ప్రధానంగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేస్తుంది. దీంతో ఇది 126 bhp పవర్, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
దీనికి eCVT గేర్‌బాక్స్ స్మూత్ గేర్ ట్రాన్సిషన్‌ను అందించడంతో డ్రైవింగ్‌ను మరింత తేలిక చేశారు. హోండా సిటీ e:HEV, డైలీ యూజ్‌లో మంచి మైలేజ్ కోరుకునే వారికి గానీ, అలాగే శక్తి, పనితీరు, హైబ్రిడ్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇచ్చే వారికి గానీ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది. ఇది ప్రీమియం సివిల్ సెడాన్ సెగ్మెంట్లో, ప్రత్యేకతను కోరుకునే వినియోగదారులకు హోండా అందిస్తున్న సమర్థవంతమైన మోడల్ అని చెప్పవచ్చు.

తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మదగిన పనితీరు కోరుకునే వినియోగదారుల కోసం మారుతీ సుజుకీ సెలెరియో ఒక బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఒక స్టడీ ప్లేయర్‌గా ఉన్న ఈ మోడల్, ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అనువైనదిగా మారింది. సెలెరియో కారు చూడటానికి చిన్నగా ఉన్నప్పటికి కూడా కస్టమర్లు సంతృప్తి చెందేలా మంచి పనితీరును కనబరుస్తుంది. సెలెరియో ప్రధాన ఆకర్షణే దాని మైలేజ్.
ARAI ప్రకారం, ఈ కారు లీటర్ పెట్రోల్‌కు గరిష్టంగా 26 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. మాన్యువల్, AMT వెర్షన్ల విషయంలో, ఈ రెండు సుమారు 25.24 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలవు, ఇది రోజువారీ వినియోగానికి చాలా అనువైన మోడల్ అవుతుంది. ధర పరంగా చూసినప్పుడు, సెలెరియో బేస్ వేరియంట్ రూ. 5.64 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ. 7.37 లక్షల వరకు చేరుతుంది.

ఈ ధరలో తక్కువ నిర్వహణ వ్యయం, మంచి మైలేజ్ వినియోగదారులకు బాగా సెట్ అవుతుంది. సెలెరియో రీసెంట్‌గా పలు అప్‌డేట్‌లను కూడా పొందింది. గత ఫిబ్రవరిలో ధరలు స్వల్పంగా పెరిగినా, సేఫ్టీ ఫీచర్లలో మెరుగుదల కనిపించింది. ప్రస్తుతం ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తోంది, ఇది ఈ సెగ్మెంట్లో చాలా అరుదైన విషయం. అంతేకాక, గత సంవత్సరం డ్రీమ్ సిరీస్ పేరుతో ఒక ప్రత్యేక ఎడిషన్ కూడా విడుదల చేయడం జరిగింది.
చాలా సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్న ఈ హ్యాచ్‌బ్యాక్, చాలా మందికి తొలి కారుగా నిలిచింది. చిన్న కుటుంబాలు, కొత్త డ్రైవర్లు, రోజూ ఆఫీసు రాకపోకలకు తక్కువ ఖర్చుతో స్మూత్ డ్రైవింగ్ కోరుకునే వారందరికీ సెలెరియో ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ, ఫ్యూయల్ ఎఫిషియంట్ ఎంపికగా కొనసాగుతోంది. దీని తరువాత హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది.
స్విఫ్ట్ AMT మోడల్ లీటర్‌కు 25.75 కి.మీలు, మాన్యువల్ వేరియంట్ సైతం 24.80 కి.మీ. మైలేజ్‌ను సాధిస్తోంది, ఇది డైలీ యూజ్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ధరల పరంగా చూస్తే, స్విఫ్ట్ బేస్ మోడల్ రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర సుమారు రూ. 9.64 లక్షల వరకు ఉంది. ఇది ఒక మధ్య తరగతి వినియోగదారుని బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు.
దీని హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా మారుతీ సుజుకీ పరీక్షిస్తోంది. ప్రస్తుత మోడల్ 24.5 kmpl మైలేజీని అందిస్తుండగా, దాని హైబ్రిడ్ వేరియంట్ మార్కెట్లోకి వచ్చాక 30-35 kmpl మైలేజీని అందించే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఈ కారు అమ్మకానికి వస్తే, దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు ఇదే అవుతుంది. చివరగా, మారుతీ సుజుకీ డిజైర్ కూడా మార్కెట్లో మంచి మైలేజ్ ఇచ్చే మోడల్‌గా ఉంది.
AMT మోడల్ 25.71 kmpl అందిస్తుంది. అదే మాన్యువల్ ఎడిషన్‌కు 24.79 kmpl వరకు ఇస్తుంది. దీని ధర రూ. 6.84 లక్షల నుండి రూ. దీని ధర రూ. 10.19 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. ఇది మార్కెట్లో దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కంపెనీ ఇటీవల ఈ కారు ధరను స్వల్పంగా పెంచింది. ఈ కారు ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి.


Click it and Unblock the Notifications








