మంచి మైలేజ్ ఇచ్చే ఎవ్వరికీ తెలియని డీజిల్ కార్స్.. మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తాయి!
ఇండియాలో గతంలో పెట్రోల్ వాహనాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ వాహనాలు ఎక్కువగా నడిచేవి. అయితే రాను రాను క్రమంగా వాయు కాలుష్యం ఎక్కువగా అవుతుందన్న కారణంతో వీటి వాడకం తక్కువ అయింది. దేశంలోని చాలా వాహనాల కంపెనీలు ప్రస్తుతం డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేశాయి. అయినప్పటికీ కొన్ని దిగ్గజ కార్ల తయారీ దారులు మాత్రం ఇప్పటికి కూడా డీజిల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ విక్రయిస్తున్నాయి. చాలా మంది కొత్త వినియోగదారులు ఈ ఇంజిన్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ వంటి పలు కంపెనీలు డీజిల్ ఇంజన్‌లతో కూడిన బెస్ట్ కంపాక్ట్ suvలను విక్రయిస్తున్నాయి. తక్కువ ధరలో లభించడంతో పాటు, మంచి మైలేజ్‌ను ఇస్తున్నాయి. కొత్త వినియోగదారులు డీజిల్ కార్ల కోసం చూసినట్లయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని మోడళ్ల గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.
Tata nexon: టాటా నెక్సాన్ కారు ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న మోడల్. దీని ధర రూ.11.30 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్‌ను బట్టి రూ.15.60 లక్షల మధ్య ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. నెక్సాన్‌లో 1.5-లీటర్ ఇంజిన్ ఆప్షన్ ఉంది. ఇది మాన్యువల్, ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది మాన్యువల్‌లో లీటర్‌కు 23.23 కిమీల వరకు మైలేజ్ అందిస్తుంది.

Kia sonet: కియా సోనెట్ డీజిల్ ఇంజిన్ ప్రారంభ ధర రూ.రూ.10 లక్షల నుంచి మొదలై వేరియంట్‌ను బట్టి దాదాపు రూ.13.34 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్ రోడ్ అయితే టాక్స్‌లను బట్టి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. మన్యువల్ అయితే 22.3 కి.మీల వరకు, ఆటోమెటిక్ అయితే 18.6 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది.
Kia syros: కియా కార్లలో సైరోస్ మోడల్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దీని ధరలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ కారు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌లో ఇది లీటర్‌కు 20.75 కి.మీల వరకు మైలేజ్ అందిస్తుంది. అదే ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లీటరుకు 17.65 కి.మీల వరకు ప్రయాణిస్తుందని కియా కంపెనీ పేర్కొంది. దీని ధరలను ఫిబ్రవరి 1న ప్రకటిస్తారు.

Mahindra xuv 3XO:మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ డీజిల్ ఇంజిన్ ప్రారంభ ధర రూ.10 లక్షల నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ రూ.14.49 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. మహీంద్రా xuv 3XO మైలేజ్ విషయానికి వస్తే ఇది 20.6 కిమీ నుంచి 21.2 కిమీల వరకు ఇస్తుంది.
Mahindra bolero neo: మహీంద్రా బొలెరో నియో కాంపాక్ట్ SUV చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.9.95 లక్షలు, అదే టాప్ వేరియంట్ ధర రూ.12.15 లక్షలు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








