30 కి.మీల పైనే మైలేజ్.. రూ.3.76 లక్షల స్టార్టింగ్! రూ.30 వేల జీతం ఉన్నా కొనచ్చు

కారు కొనగలరా అని నిర్ణయించే ముందు అందరి ప్రాధాన్యతలో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, అదే మైలేజ్. అది ఖర్చు తగ్గించడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. రోజువారీ ప్రయాణంలో ఇంధన వినియోగం తగ్గితే మీ పెట్రోల్/డీజిల్ ఖర్చు కూడా తగ్గిపోతుంది. అందుకే చాలా మంది కొత్త కార్లను ఎన్నుకునేటప్పుడు గరిష్ట మైలేజ్ ఇచ్చే కార్లపై ఎక్కువగా దృష్టి పెడతారు. మీరు మైలేజ్‌-ఫ్రెండ్లీ కార్లు గురించి ఆలోచిస్తున్నట్లయితే, ప్రస్తుతం భారత మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు ఉన్నాయి. మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లు మంచి మైలేజ్ ఇవ్వడంతో పాటు అవి అతి తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి లభిస్తాయి. ఈ కథణంలో మారుతి సుజుకి ఆల్‌టో K10, సెలెరియో, స్విఫ్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.

Maruti Suzuki Alto K10: మారుతి సుజుకి ఆల్టో K10 భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. ముఖ్యంగా సరసమైన ధరలో లభించడం వల్ల అన్ని వర్గాల వినియోగదారులకు ఇది సులభంగా చేరువవుతోంది. ప్రస్తుతం ఈ కారు కనిష్టంగా రూ. 3.70 లక్షల నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ. 5.45 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తుంది. పేద, మధ్యతరగతి ఇది బెస్ట్ కారు.

India Best Mileage Maruti Cars Alto K10 Celerio Swift Price And Engine Details

ఈ కారు 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1-లీటర్ CNG ఆప్షన్‌లో ఉంది. దీంతో పెట్రోల్ ఖర్చు ఎక్కువగా అనిపించే వారికి CNG ప్రత్యామ్నాయంగా మారుతోంది. మైలేజ్ విషయంలో కూడా ఆల్టో K10 చాలా ముందుంది. పెట్రోల్, CNG వేరియంట్లను బట్టి ఇది సుమారు 24 నుంచి 34 కిలోమీటర్లు వరకు మైలేజ్ ఇవ్వగలదు. అందుకే రోజూ ఎక్కువగా ప్రయాణించే వారికి ఇది డబ్బు ఆదా చేసే కారుగా నిలుస్తోంది.

Maruti Suzuki Celerio: మారుతి సుజుకి సెలెరియో మధ్యతరగతి కుటుంబాలే కాదు ఉన్నత తరగతి వినియోగదారుల దృష్టిని కూడా ఈ కారు ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ కారు ధరలు రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.73 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఈ ధర పరిధిలో మంచి మైలేజ్ ఇచ్చే కారుగా ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది. బడ్జెట్‌కు తగ్గ ధరల్లో లభిస్తూనే, అవసరమైన ఫీచర్లు అందిస్తుంది.

India Best Mileage Maruti Cars Alto K10 Celerio Swift Price And Engine Details

ఈ కారులో 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1-లీటర్ CNG వేరియంట్ అందుబాటులో ఉంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, CNG ఆప్షన్ ఖర్చు తగ్గించే పరిష్కారంగా మారుతోంది. మైలేజ్ పరంగా చూస్తే, సెలెరియో పెట్రోల్, CNG వేరియంట్లలో సుమారు 24 నుంచి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలదని కంపెనీ చెబుతోంది. అందుకే రోజూ ఎక్కువగా డ్రైవ్ చేసే వారికి ఇది ఒక ఆర్థికంగా లాభదాయకమైన కారు.

Maruti Suzuki Swift: సరసమైన ధరల్లో లభించడం స్విఫ్ట్‌కు పెద్ద ప్లస్ పాయింట్. ప్రస్తుతం రూ. 5.79 లక్షల నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ. 8.80 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. ఈ ధర పరిధిలో స్టైల్‌తో పాటు పనితీరును అందించే కారుగా స్విఫ్ట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. మంచి మైలేజ్ కారణంగా యూత్ నుంచి కుటుంబ వినియోగదారుల వరకు విస్తృత వర్గాలు ఈ కారును ఇష్టపడుతున్నారు.

India Best Mileage Maruti Cars Alto K10 Celerio Swift Price And Engine Details

స్విఫ్ట్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.2-లీటర్ CNG వేరియంట్ కూడా అందిస్తున్నారు. పెట్రోల్ మోడల్ మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తే, CNG వేరియంట్ తక్కువ ఇంధన ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి మంచి ఎంపికగా మారుతోంది. మైలేజ్ పరంగా చూస్తే, ఈ కారు వేరియంట్‌ను బట్టి సుమారు 24 నుంచి 33 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంటోంది.

More from DriveSpark

Article Published On: Monday, December 29, 2025, 12:40 [IST]
English summary
India best mileage maruti cars alto k10 celerio swift price and engine details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+