రూ.8 లక్షల లోపే 6 ఎయిర్‌బ్యాగ్‌లు.. టాప్ సేఫ్టీ ఫీచర్స్‌తో లభించే ఇండియా బెస్ట్ కార్లు ఇవే!

ఇటీవలి కాలంలో భారతీయ కారు మార్కెట్‌లో ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంటోంది. ముందు రోజుల్లో, కొత్త కారు కొనుగోలు చేసే వారు మైలేజీ, లుక్, ధరలపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. రోడ్లపై ప్రమాదాలు పెరగడం, అవగాహన పెరగడం వల్ల, సేఫ్టీ ముఖ్య అంశంగా మారింది. ముఖ్యంగా, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన మోడల్స్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా పేద-మధ్యతరగతి వినియోగదారులు 8 లక్షల లోపు ధరలో ఎక్కువ ప్రయోజనాలను కలిగించే మోడళ్లను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఆల్టో K10, టాటా ఆల్ట్రోజ్ గురించి కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

Tata Altroz: ప్రమాద సమయంలో కారులో కూర్చున్న ప్రయాణికులను రక్షించడంలో టాటా బ్రాండ్‌కు ఉన్న పేరును మరింత బలపరిచిన మోడల్ ఆల్ట్రోజ్. 5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌తో పాటు, బలమైన బాడీ షెల్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ టెక్నాలజీలతో ఇది సేఫ్టీ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో నిలుస్తోంది. రూ.6.89 లక్షల నుండి రూ.11.49 లక్షల(ఎక్స్-షోరూమ్) ధర శ్రేణిలో లభించే ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, రూపంలోనే కాదు, భద్రతలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

India Best Safety 6 Airbags Cars Under Rs 8 Lakhs Altroz Alto K10 Triber

డ్రైవర్, ప్రయాణికుల రక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ఈ మోడల్, ఆధునిక సేఫ్టీ ఫీచర్లతో పటిష్టంగా సన్నద్ధమై ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం వల్ల, ప్రమాద సమయంలో అన్ని వైపుల నుండి రక్షణ లభిస్తుంది. ABS(యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD(ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) సమన్వయంతో, కఠిన బ్రేకింగ్ సమయంలో కారు స్థిరంగా ఉండేలా చేస్తాయి. అలాగే, ESP(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) కారు నియంత్రణ కోల్పోయే పరిస్థితుల్లో స్థిరత్వాన్ని కాపాడుతుంది.

Maruti Suzuki Alto K10: చిన్న కార్లలో సేఫ్టీ ఫీచర్లను అందించడంలో ఆల్టో K10 మంచి ముందడుగు వేసింది. తక్కువ బడ్జెట్‌లో లభించే ఈ హ్యాచ్‌బ్యాక్‌లో మెరుగైన సేప్టీ ఫీచర్స్‌ను ఇచ్చారు. కొత్త ఆల్టో K10 రూ. 4.23 లక్షల నుండి రూ. 6.21 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తూ, తక్కువ బడ్జెట్‌లోనూ భద్రతను అత్యంత ప్రాధాన్యంగా చూసే వారికి సరైన ఎంపికగా నిలుస్తోంది.

India Best Safety 6 Airbags Cars Under Rs 8 Lakhs Altroz Alto K10 Triber

ప్రయాణికుల భద్రత కోసం, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం వల్ల ప్రమాద సమయంలో అన్ని వైపులా రక్షణ లభిస్తుంది. అదనంగా ABS(యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) కలయికతో, అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో కూడా కారు స్థిరంగా ఉండేలా చేస్తాయి. ESP(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) కారు నియంత్రణ కోల్పోకుండా, కఠినమైన మలుపుల్లోనూ సురక్షిత డ్రైవింగ్‌ను సాధ్యమవుతుంది.

వెనుక తలుపులలో చైల్డ్ లాక్ ఉండటం వల్ల చిన్నారులు ప్రయాణించే సమయంలో అదనపు రక్షణ లభిస్తుంది. అలాగే, ప్రతి సీటులో 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు అమర్చడం ద్వారా ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. మొత్తం మీద, ఆల్టో K10 కేవలం ఒక చిన్న, ఆర్థికంగా అందుబాటులో ఉండే కారు మాత్రమే కాదు, అది మీ కుటుంబానికి ఒక భద్రతా కవచం.

India Best Safety 6 Airbags Cars Under Rs 8 Lakhs Altroz Alto K10 Triber

Renault Triber: రెనాల్ట్ ట్రైబర్ 7 సీట్ల కాంపాక్ట్ MPVగా, భారతీయ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. రూ.6.29 లక్షల నుండి రూ. 9.16 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర శ్రేణిలో లభించే ఈ కారు, మంచి సీటింగ్‌, స్మార్ట్ స్పేస్ మేనేజ్‌మెంట్‌తో పాటు, భద్రతలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ప్రయాణికుల రక్షణ కోసం, ట్రైబర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చబడి ఉంటాయి, ఇవి ప్రమాద సమయంలో అన్ని వైపులా రక్షణ కల్పిస్తాయి.

అదనంగా ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) కలయిక వాహనాన్ని కఠినమైన బ్రేకింగ్ సందర్భాల్లో స్థిరంగా ఉంచుతుంది. TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా టైర్లలో గాలి ఒత్తడిని రియల్ టైమ్‌లో పర్యవేక్షించి, డ్రైవింగ్ భద్రతను పెంచుతుంది. ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలసి కారు నియంత్రణ కోల్పోకుండా కఠిన పరిస్థితుల్లోనూ సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారిస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 11, 2025, 18:30 [IST]
English summary
India best safety 6 airbags cars under rs 8 lakhs altroz alto k10 triber
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+