యాక్సిడెంట్ సమయంలో ప్రాణం కాపాడే కార్లు! 7 ఎయిర్‌బ్యాగ్‌లతో ఫుల్ సేఫ్టీ! మీ కుటుంబానికి బెస్ట్ మోడళ్లు ఇవే
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రధానంగా కార్ల యాక్సిడెంట్లు బాగా పెరిగిపోయాయి. అందుకే కొత్తగా కారును కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారు ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు రక్షణ అందించే మోడళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ ఎయిర్ బ్యాగులతో లభించే వాటిని ఎంచుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు 2 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా లగ్జరీ ఫీచర్‌గా భావించబడేవి, కానీ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు నార్మల్ అయిపోయాయి. ఇంకా అధిక భద్రత కోరుకునే వినియోగదారుల కోసం, 7 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం క్రాష్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు, డ్రైవర్ మోకాళ్లను రక్షించేందుకు అదనపు ఫీచర్లతో వస్తున్నాయి. వాటిలో కొన్నింటిని కస్టమర్ల కోసం కింది కథనంలో అందించడం జరిగింది.
Tata Harrier:దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్‌కు చెందిన హారియర్ ఇండియాలో అత్యంత సురక్షితమైన SUVలలో ఒకటిగా బాగా ప్రసిద్ధి చెందింది. ఇది 5 మంది ప్రయాణికులు కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఈ కారు టాప్ ఎండ్ వేరియంట్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చారు. అదే దీని బేస్ వేరియంట్‌లో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ప్రమాద సమయంలో ప్రయాణికుల రక్షణ కోసం అధునాతన సేఫ్టీ ప్రమాణాలు కలిగి ఉంది.

ముఖ్యంగా టాటా హారియర్ గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ పరీక్షలలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా సాధించడం విశేషం. ఎయిర్ బ్యాగులతో పాటు అదనపు రక్షణ కోసం లెవెల్-2 ADAS(ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్), చూట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా సరౌండ్ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి. ప్రధానంగా ఈ కారు పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.
కారు ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపల వెంటిలేటెడ్ సీట్లు ప్రయాణికులకు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. లాంగ్ జర్నీ చేసిన సమయంలో సీటింగ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే క్యాబిన్ డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ వంటివి ఉన్నాయి. ఇది 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

7 ఎయిర్‌బ్యాగ్‌ల హారియర్ ధర రూ.24.35 లక్షల నుండి 26.5 లక్షల వరకు ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చే సరికి స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. దీని ఇంజిన్‌కు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇది 170 PS పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 ఎయిర్‌బ్యాగులతో బేస్ వేరియంట్ కావాలనుకుంటే దాన్ని కూడా ఎంచుకోవచ్చు.
Tata Safari: టాటా మోటార్స్ ప్రముఖ మోడల్ అయిన సఫారీ ప్రమాదాల సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను అధిక భద్రత అందించడంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఇది 7 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ కారు గ్లోబల్ NCAP, భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించడం విశేషం. లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా వంటి అంశాలు కూడా ఈ కారులో ఉన్నాయి.

టాటా సఫారీ క్యాబిన్‌లో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. లోపల 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, ఎంత దూరం ప్రయాణించిన కూడా ఇబ్బంది లేకుండా చూడటానికి పవర్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్స్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 10-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ వంటి పలు ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 170 PS పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 23.85 లక్షల నుంచి రూ. 26.5 లక్షల వరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. దీని ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్/ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జోడించారు.

Toyota Innova Crysta: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో టయోటా ఇన్నోవా క్రిస్టా కూడా ఒకటి. ఇది ప్రతి కుటుంబానికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించడంలో ముందు స్థానంలో ఉంటుంది. దీని టాప్ ఎండ్ వేరియంట్లు ZX, VX ట్రిమ్‌లో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అదనంగా ప్రయాణికులకు మరింత రక్షణ అందించడానికి హిల్-స్టార్ట్ అసిస్ట్, స్థిర కంట్రోలింగ్ వంటి అంశాలు ఉన్నాయి. దీని ఎక్స్‌టీరియర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇంటీరియర్ థీమ్ ప్రయాణికులను కట్టిపడేసేలా ఉంది. ప్రతి ప్రయాణాన్ని విలాసవంతంగా మార్చడానికి లెదర్ అప్హోల్స్టరీ ఉంది. రెండవ వరుసలో ఉన్న కెప్టెన్ సీట్లు ప్రయాణ సౌకర్యాన్ని మరింత పెంచుతాయి. అలాగే క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మరిన్ని ప్రీమియం సౌకర్యాలు ఈ కారులో ఉన్నాయి. అందుకే టయోటా ఇన్నోవా క్రిస్టా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం MPVగా స్థానం సంపాదించింది.
విశాలమైన ఇంటీరియర్, అనువైన సీటింగ్‌తో లభిస్తున్న ఈ ఇన్నోవా క్రిస్టా 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 150 PS పవర్, 343 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌ను దీని ఇంజిన్‌కు జోడించారు. . 7 ఎయిర్‌బ్యాగ్‌లతో లభిస్తున్న ఇన్నోవా క్రిస్టా ధర రూ.25.14 లక్షల నుంచి టాప్ ఎండ్ రూ. 26.82 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.
Mahindra XUV700: మహీంద్రా ఎక్స్‌యూవీ700 అత్యాధునిక భద్రతా సాంకేతికత, ప్రీమియం లగ్జరీ ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను సాధించడం విశేషం. ఈ మహీంద్రా XUV700 SUV టాప్ వేరియంట్ AX7L కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందించారు. అదనంగా ప్రయాణికుల రక్షణ కోసం లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా వంటి పలు అత్యాధునిక సేఫ్టీ ప్రామాణాలను కలిగి ఉంది.
ఈ SUV ధర రూ.22.24 లక్షల నుండి రూ.24.99 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కారును పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి 200 PS పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్, 185 PS పవర్, 450 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








