మీకు రూ.10 లక్షల్లోనే ఒక మంచి కారు కావాలా? అందుబాటులో ఉన్న బెస్ట్ సెడాన్‌లు ఇవే!

ప్రస్తుత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVల క్రేజ్ అమాంతం పెరిగిపోయినా, సెడాన్ కార్లకు ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం ఎవరూ కాదనలేరు. స్లీక్ డిజైన్, సౌకర్యవంతమైన రైడ్, హైవేల్లో అందించే స్మూత్ డ్రైవింగ్ అనుభవం, ఇవన్నీ సెడాన్‌లను ఇంకా అనేకమందికి ఇష్టంగా ఉంచుతున్నాయి. తాజాగా కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు కూడా SUVలతో పాటు సెడాన్‌ల వైపు చూపు మళ్లించడం గమనించదగ్గ విషయం. దానికి నిదర్శనంగా, మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు స్థానాన్ని దక్కించుకుంది. ఇది ప్రస్తుత SUV ఆధిపత్యం మధ్యలో కూడా సెడాన్‌లు ఎంతటి స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయో స్పష్టంగా చూపిస్తుంది.

ఒకప్పుడు భారతీయ మార్కెట్లో చిన్న నుంచి పెద్ద వరకు, వివిధ ఉపవిభాగాలలో అనేక సెడాన్ మోడళ్లను చూసే అవకాశం ఉండేది. అయితే, కాలక్రమేణా మారిన వినియోగదారుల అభిరుచులు, పెరిగిన SUV డిమాండ్ కారణంగా, ఆ మోడళ్లలో చాలా మెల్లగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే, రూ. 10 లక్షల లోపు ధరలో లభించే సెడాన్ మోడళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

India Best Sedan Cars Rs 10 Lakh Budget Aura

అయినప్పటికీ, మిగిలిన కొద్ది మోడళ్లు మాత్రం తమ ప్రత్యేకమైన విలువ, విశ్వసనీయత, ఇంధన సామర్థ్యం వల్ల ఇంకా బలమైన కస్టమర్ బేస్‌ను కొనసాగిస్తున్నాయి. SUVల ట్రెండ్ ఎంతటి బలమైనదైనా, సెడాన్‌ల ఆకర్షణకు ఎప్పటికీ ముగింపు ఉండదని ఇవి నిరూపిస్తున్నాయి . ప్రస్తుతం రూ. 10 లక్షల లోపు ధరలో లభించే కొన్ని సెడాన్లను చూద్దాం.

Hyundai Aura: హ్యుందాయ్ ఆరా స్టైలిష్ డిజైన్, ప్రాక్టికల్ ఫీచర్లు, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లతో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇది పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లలో లభిస్తుంది, అందువల్ల వేరు వేరు అవసరాలు ఉన్న కస్టమర్లకు ఇది మంచి ఎంపిక అవుతోంది. పెట్రోల్ వెర్షన్ 17 kmpl వరకు మైలేజీని అందించగలదు, ఇక తక్కువ రన్నింగ్ ఖర్చు కోరుకునే వారికి CNG వెర్షన్ 22 kmpl వరకు ఇంధన సామర్థ్యం ఇస్తుంది.

ధర పరంగా కూడా హ్యుందాయ్ ఆరా పోటీకి తగ్గట్టుగానే ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.6.54 లక్షల నుండి రూ.9.11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది, దీంతో రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో కాంపాక్ట్ సెడాన్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది. స్టైల్, పనితీరు, ఆర్థికత ఈ మూడింటినీ సమన్వయం చేసిన మోడల్‌గా ఆరా తన స్థానాన్ని బలంగా నిలుపుకుంటోంది.

India Best Sedan Cars Rs 10 Lakh Budget dzire

Maruti Suzuki Dzire: మారుతి సుజుకి డిజైర్, భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ సెడాన్‌గా తన స్థానాన్ని బలంగా కొనసాగిస్తోంది. అమ్మకాలతో ఈ మోడల్, మారుతి బ్రాండ్‌కే కాకుండా మొత్తం సెడాన్ విభాగానికే ప్రధాన బలంగా నిలుస్తోంది. ధర పరంగా కూడా డిజైర్ పోటీకి తగ్గట్టుగానే ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.6.84 లక్షల నుండి రూ.10.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

ఫ్యూయల్ సామర్థ్యం విషయంలో డిజైర్ తన క్లాస్‌లో మొదటి స్థానంలో ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 25.71 కిమీ వరకు మైలేజీని అందించగలదని కంపెనీ పేర్కొంటోంది. ఇక మరింత తక్కువ ఖర్చులో ప్రయాణించాలనుకునే వారికి డిజైర్ CNG వేరియంట్ లీటరుకు 33.73 కిమీ వరకు మైలేజీని అందిస్తుంది, ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఫిగర్స్‌లో ఒకటి.

India Best Sedan Cars Rs 10 Lakh Budget tigor

Tata Tigor: టాటా టిగోర్, టాటా మోటార్స్‌ నుండి వచ్చిన బడ్జెట్-ఫ్రెండ్లీ సెడాన్‌గా గుర్తింపు పొందింది. ఇది పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లలో లభించడం వల్ల కస్టమర్లకు అనుకూలంగా ఉంటుంది. ICE టిగోర్ ధర రూ.6 లక్షల నుండి రూ.9.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంంది. టిగోర్ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 19.28 kmpl వరకు, CNG వెర్షన్ లీటరుకు 26.49 kmpl వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 9, 2025, 12:26 [IST]
English summary
India best sedan cars rs 10 lakh budget aura dzire tigor details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+