రూ.6.25 లక్షలు.. 33 కి.మీ మైలేజ్, 5-స్టార్ సేఫ్టీ.. ఈ ధరలో ఇంతకంటే బెస్ట్ కారు దొరకదు

రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, చిన్న వ్యాపార అవసరాలు లేదా కుటుంబంతో చేసే డైలీ జర్నీలు ఇలా అన్ని అవసరాల కోసం భారతీయ వినియోగదారులు కార్ ఎంపికలో కొన్ని విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా తక్కువ ధరలో లభించాలి, నమ్మకంగా ఉండాలి, అలాగే ఇంధన సామర్థ్యం మంచి స్థాయిలో ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఒకే కారులో కలిసివస్తే, అది భారత మార్కెట్‌లో విజయం సాధించడం ఖాయమే. అందుకే ఇలాంటి కార్లకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. ఈ కోవలోనే 2025 మోడల్ మారుతి సుజుకి డిజైర్‌ (Maruti Suzuki Dzire)ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సాధారణ వినియోగదారుల అవసరాలను లోతుగా అర్థం చేసుకుని రూపొందించిన ఒక గొప్ప కమ్యూటర్ కారు ఇది.

మొదటి నుంచి కూడా డిజైర్ పేరు వినగానే మైలేజ్, మెయింటెనెన్స్ తక్కువ ఖర్చు, నమ్మకమైన పనితనం అనే మాటలు గుర్తుకొస్తాయి. కాలం మారుతున్న కొద్దీ, కస్టమర్ల అభిరుచులు కూడా మారుతున్నాయి. అదే విషయాన్ని గ్రహించిన మారుతి సుజుకి, డిజైర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఆధునిక ఫీచర్లు, మెరుగైన డిజైన్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది. కొత్త డిజైర్ కూడా ఈ మార్పులకు తగ్గట్టుగానే రూపొందించబడింది.

India Best Sedan Maruti Suzuki Dzire price Engine And Mileage Details

మారుతి సుజుకి డిజైర్ ఇంజిన్, మైలేజ్ విషయంలో తన సెగ్మెంట్‌లో ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంది. ఈ కాంపాక్ట్ సెడాన్‌లో 1.2-లీటర్, 3-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ను అందిస్తున్నారు. ఈ ఇంజిన్ 88.5 bhp పవర్తో పాటు 112 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ డ్రైవ్ అయినా, హైవే ప్రయాణమైనా స్మూత్ డ్రైవింగ్ అనుభవం అందించేలా ఇది ట్యూన్ చేయబడింది.

కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఆప్షన్‌లతో అందిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో డ్రైవ్ చేసే వారికి AMT వేరియంట్ పెద్ద సౌలభ్యాన్ని కల్పిస్తుంది. మైలేజ్ విషయంలో పెట్రోల్ ఆటోమేటిక్ (AMT) వేరియంట్ 25.71 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.

India Best Sedan Maruti Suzuki Dzire price Engine And Mileage Details

అదే సమయంలో, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్తో వచ్చే వేరియంట్ కొద్దిగా తక్కువగా అయినప్పటికీ మంచి ఇంధన సామర్థ్యాన్ని చూపిస్తుంది. డిజైర్ మాన్యువల్ వేరియంట్ మైలేజ్ 24.79 కి.మీ/లీటర్గా ARAI ధృవీకరించింది. ఇక తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి మారుతి సుజుకి డిజైర్ CNG వేరియంట్ మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ CNG వేరియంట్ కిలోగ్రామ్‌కు 33.73 కి.మీ వరకు మైలేజీ అందిస్తుంది.

ఫీచర్లు, భద్రత విషయంలో మారుతి సుజుకి డిజైర్ తన సెగ్మెంట్‌లో మరో మెట్టు ముందుకెళ్లింది. రోజువారీ, దూర ప్రయాణాల్లో కూడా డ్రైవర్‌కు సౌకర్యం కల్పించేలా ఈ కారును రూపొందించారు. ఇందులో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉంది. అలాగే ఆధునిక కనెక్టివిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ను అందించారు.

India Best Sedan Maruti Suzuki Dzire price Engine And Mileage Details

దీని ద్వారా నావిగేషన్, మ్యూజిక్, కాల్స్ అన్నీ డ్రైవ్ చేస్తూనే సులభంగా నిర్వహించవచ్చు. భద్రత విషయానికి వస్తే, డిజైర్ ఇకపై బడ్జెట్ సెడాన్ అనే ట్యాగ్‌ను దాటేసిందనే చెప్పాలి. గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మొదటి మారుతి కారుగా డిజైర్ చరిత్ర సృష్టించింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.6.25 లక్షల నుంచి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 27, 2025, 10:47 [IST]
English summary
India best sedan maruti suzuki dzire price engine and mileage details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+