ఫిబ్రవరిలో ఇండియా మొత్తం వీటినే కొన్నది! పబ్లిక్ ఫేవరేట్ కార్లు ఇవే! వీటిలో మీరు ఏదైనా కొన్నారా?

ప్రపంచంలోనే భారతదేశం వాహన పరిశ్రమ అభివృద్దిలో వేగంగా దూసుకుపోతుంది. అందుకే అంతర్జాతీయ తయారీదారులు కూడా ఇక్కడి వచ్చి ప్లాంట్‌లను ఏర్పాటు చేసి తమ వాహనాలను లోకల్‌గా విక్రయిస్తునే ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు. దేశంలో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి మొదలుకుని SUVలు, సెడాన్‌లు ఇతర మోడళ్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. ప్రతి ఏడాది కూడా ఇండియాలో కార్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా వాహన తయారీదారులు కూడా వారిని ఆకట్టుకునే డిజైన్లతో కార్లను విడుదల చేస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి నెల ముగియగానే కంపెనీలు తమ మోడళ్ల వారిగా సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. అయితే ఈ నెలలో దేశంలో అత్యధికంగా విక్రయాలను సాధించిన టాప్ 5 కార్లు ఏవో కింది కథనంలో తెలుసుకోండి.

Maruti Suzuki Fronx: దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఫిబ్రవరి 2025లో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మొదటి స్థానాన్ని పొందింది. ఈ నెలలో ప్రసిద్ధ మోడల్ మొత్తం 21,461 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.51 లక్షల నుండి రూ.13.04 లక్షల(ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది. ఇది బాలెనో ప్లాట్‌ఫామ్‌పై తయారైనప్పటికీ అదిరిపోయే ఎస్‌యూవీ లుక్‌ను కలిగి ఉంటుంది.

India Best Selling Top Car Maruti Fronx

ఈ కారు 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది. క్యాబిన్‌లో డజన్ల కొద్ది ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ప్రయాణికుల సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), 360-డిగ్రీ కెమెరా మొదలైనవి ఉన్నాయి. ఇది 5 మంది ప్రయాణికులకు అనువుగా ఉంటుంది.

Maruti Suzuki Wagon R: మారుతీ సుజుకీకే చెందిన వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ వరుస అమ్మకాలతో దూసుకుపోతుంది. ఫిబ్రవరి 2025లో ఇది 19,879 యూనిట్ల అమ్మకాలను సాధించింది. గత ఏడాది (2024) ఇదే నెలలో 19,412 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేయగా, ఏడాది ప్రాతిపదికన ఇది రెండు శాతం వృద్దిని సాధించడం విశేషం. వ్యాగన్ ఆర్ భారతదేశంలో పేద, మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ మోడల్.

India Best Selling Top Cars Maruti Wagon R

వ్యాగన్ ఆర్ ప్రారంభ ధర రూ.5.64 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.7.47 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 1-లీటర్, పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 23.56 నుంచి 25.19 కి.మీలు, CNG కిలోకు 34.05 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది. ఈ కారు చిన్న కుటుంబం గల వారికి అనువుగా ఉంటుంది.

Hyundai Creta: దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్‌కు చెందిన క్రెటా మోడల్ ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న మోడల్. ఫిబ్రవరి 2025లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో క్రెటా మూడవ స్థానంలో నిలిచింది. ఈ నెలలో క్రెటాను 16,317 మంది కొనుగోలు చేశారు. అదే 2024 ఏడాది ఇదే నెలలో 15,276 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 7 శాతం వృద్ధి.

India Best Selling Top Cars Hyundai Creta

Maruti Swift:స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ చాలా కాలంగా దేశంలో సక్సెస్‌ఫుల్‌గా అమ్ముడవుతున్న మోడల్. గత ఏడాది ఫిబ్రవరిలో 13,165 యూనిట్లు సేల్స్‌ను సాధించిన మోడల్ 2025లో 16,269 యూనిట్లను నమోదు చేయడం విశేషం. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఏకంగా 24 శాతం బలమైన వృద్ధిని సాధించింది. దీని మైలేజ్ విషయానికి వస్తే, CNGలో 30.90 కి.మీ/లీ, లీటర్ పెట్రోల్‌కు 22.38 కి.మీలు ఇస్తుంది.

Maruti Baleno: మారుతీ సుజుకీ బాలెనో కారు డిజైన్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇది ఫిబ్రవరి 2025లో 15,480 యూనిట్ల అమ్మకాలను సాధించింది. దేశీయ కస్టమర్లకు ఇది బాగా ఇష్టమైన హ్యాచ్‌బ్యాక్. దీని ప్రారంభ ధర రూ.6.70 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 15, 2025, 11:00 [IST]
English summary
India best selling top cars maruti fronx wagonr hyundai creta swift baleno in february 2025
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+