7 మంది కలిసి వెళ్లొచ్చు.. రూ.5.76 లక్షల నుంచే స్టార్ట్.. మధ్యతరగతికి ఇండియాలో బెస్ట్ కార్లు

కొత్త కారు కొనాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఆ కోరికను వాస్తవంగా మార్చే సమయంలో మాత్రం చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ముఖ్యంగా పెద్ద కుటుంబం ఉన్నవారు కార్ ఎంపికలో మరింత ఆలోచించాల్సి వస్తుంది. రోజువారీ ప్రయాణాలు మాత్రమే కాకుండా, ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లే సందర్భాలు, పండుగలు, ఫంక్షన్లు, లాంగ్ డ్రైవ్స్ వంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కారు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఒకేసారి అందరూ సౌకర్యంగా ప్రయాణించగలిగే కార్ కావాలంటే, 7 సీటర్ కార్లు ఉత్తమ పరిష్కారంగా నిలుస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో 7 సీటర్ సెగ్మెంట్‌లో కొన్ని కార్లు కస్టమర్లలో మంచి ఆదరణ పొందుతున్నాయి. వాటిలో రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్ క్లావిస్ కార్లు ముఖ్యమైనవి. వీటి గురించి ఈ కింది కథనంలో చూద్దాం.

Maruti Ertiga: మారుతి సుజుకి ఎర్టిగా భారత మార్కెట్‌లో సామాన్య కుటుంబాల నుంచి మంచి ప్రశంసలు పొందిన ఒక విశ్వసనీయ MPVగా నిలిచింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో 7 సీటర్ కారును కోరుకునే వారికి ఇది ఒక బలమైన ఎంపికగా మారింది. ప్రస్తుతం ఎర్టిగా ధరలు రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. 7 సీట్ల లేఅవుట్‌తో ఇది పెద్ద కుటుంబాలకు పూర్తిగా సరిపోతుంది.

India Best Three 7 Seater Family Cars Maruti Ertiga Renault Triber Kia Carnes Clavis Details

ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, వేరియంట్‌ను బట్టి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పాటు 1.5-లీటర్ CNG ఇంజిన్ ఎంపికల్లో లభిస్తుంది. మైలేజ్ పరంగా, ఎర్టిగా 20 kmpl నుంచి 26.11 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా CNG వేరియంట్ రోజూ ఎక్కువగా ప్రయాణించే వారికి ఖర్చు పరంగా పెద్ద ఉపశమనం ఇస్తుంది. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రయాణీకుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందించడం విశేషం.

Renault Triber: రెనాల్ట్ ట్రైబర్ భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన, సరసమైన ధరలో లభించే 7 సీటర్ MPVగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ట్రైబర్ ధరలు రూ. 5.76 లక్షల నుంచి రూ. 8.60 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఈ ధర శ్రేణిలో 7 సీట్లతో కూడిన కారును అందించడం ట్రైబర్‌కు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. నిర్వహణ ఖర్చుల విషయంలో కూడా ట్రైబర్ చాలా ఆర్థికంగా ఉంటుంది.

India Best Three 7 Seater Family Cars Maruti Ertiga Renault Triber Kia Carnes Clavis Details

ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త రెనాల్ట్ ట్రైబర్‌లో 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ పనితనం కన్నా ఎక్కువగా ఇంధన సామర్థ్యం, స్మూత్ డ్రైవింగ్‌పై దృష్టి సారిస్తుంది. మైలేజ్ పరంగా ట్రైబర్ 17 నుంచి 20 కి.మీ. వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఫీచర్ల జాబితాలో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటివి ఉన్నాయి.

Kia Carens Clavis: కియా కారెన్స్ క్లావిస్ ప్రీమియం ఫీల్ కోరుకునే కుటుంబాల నుంచి మంచి స్పందన పొందుతున్న 7 సీటర్ MPV. ధర పరంగా రెనాల్ట్ ట్రైబర్, మారుతి ఎర్టిగాల కంటే కొంచెం ఖరీదైనదే. ప్రస్తుతం కారెన్స్ క్లావిస్ ధరలు రూ. 11.08 లక్షల నుంచి రూ. 20.71 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే, కియా కారెన్స్ క్లావిస్ చాలా స్టైలిష్‌గా, ఆధునికంగా కనిపిస్తుంది.

India Best Three 7 Seater Family Cars Maruti Ertiga Renault Triber Kia Carnes Clavis Details

ఇంజిన్ ఆప్షన్ల విషయంలో కారెన్స్ క్లావిస్ చాలా బలంగా నిలుస్తుంది. ఇందులో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. వీటివల్ల కొనుగోలుదారులు తమ డ్రైవింగ్ అవసరాలకు తగ్గట్టుగా వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మైలేజ్ పరంగా చూస్తే, ఈ MPV లీటర్‌కు 15.34 నుంచి 19.54 కి.మీ. వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది, ఇది ఈ సెగ్మెంట్‌కు సరిపడే స్థాయి.

More from DriveSpark

Article Published On: Saturday, December 27, 2025, 17:01 [IST]
English summary
India best three 7 seater family cars maruti ertiga renault triber kia carnes clavis details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+