గుర్రంలా పరిగెత్తే సెడాన్ కార్లు..బైక్‌లా 33 kmpl మైలేజ్.. రూ.6 లక్షల నుంచి లభ్యం!

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, SUVలు, MPVలు ఇలా ప్రతి రకమైన కార్లూ వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రతి కేటగిరీకి ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉండగా, సెడాన్‌లు మాత్రం సౌకర్యం, స్టైల్, డ్రైవింగ్ అనుభవం విషయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. దూర ప్రయాణాల్లో సౌకర్యవంతమైన సీటింగ్, విశాలమైన కేబిన్ స్పేస్, మెరుగైన రైడ్ క్వాలిటీ కారణంగా చాలా మంది సెడాన్ కార్లను ఎంచుకుంటున్నారు. మీరు కూడా ఒక కొత్త సెడాన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ప్రస్తుత మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన మూడు మోడల్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి, అవే మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, టాటా టిగోర్. వీటి గురించి ఈ కథనంలో చూద్దాం.

Tata Tigor: టాటా టిగోర్ భారతీయ మార్కెట్లో అందమైన, బడ్జెట్‌ ఫ్రెండ్లీ సెడాన్‌గా పేరు సంపాదించుకుంది. ధర పరంగా ఇది రూ.6 లక్షల నుండి రూ.9.55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉండటంతో, మధ్యతరగతి కుటుంబాలకు ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది. ఇందులో 5 సీట్లు ఉండటంతో చిన్న కుటుంబాలు లేదా ఫ్రెండ్స్‌ ట్రిప్స్‌ కోసం ఇది సౌకర్యవంతమైన ఎంపిక.

India Best Top Three Sedan Cars Tata Tigor Maruti Dzire And Amaze Price And Top Things

ఇంజిన్ పరంగా చూస్తే, టిగోర్ 1.2-లీటర్ పెట్రోల్/CNG ఇంజిన్ తో వస్తోంది.ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, ఇది 19 నుండి 28 kmpl వరకు మైలేజీని అందించడం దీని ప్రత్యేకత. ఈ కారుకు ప్రత్యేకతను తెచ్చేది దాని స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన కలర్స్ ప్రిస్టైన్ వైట్, సూపర్నోవా కాపర్, అరిజోనా బ్లూ, డేటోనా గ్రే వంటి షేడ్స్‌లో లభిస్తుంది.

భద్రతా విభాగంలో కూడా టిగోర్ అత్యుత్తమమైనది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చుతున్నాయి. ఫీచర్ల పరంగా టిగోర్, ప్రస్తుత జనరేషన్ అవసరాలకు తగిన విధంగా రూపొందించబడింది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఆధునిక సౌకర్యాలు లభిస్తాయి.

India Best Top Three Sedan Cars Tata Tigor Maruti Dzire And Amaze Price And Top Things

Maruti Suzuki Dzire: ఇండియాలో సెడాన్ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ ప్రత్యేకమైనది. దీని ధర రూ.6.84 లక్షల నుండి రూ.10.19 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్). డిజైన్ పరంగా కొత్త డిజైర్ చాలా స్టైలిష్‌గా, ఆధునిక టచ్‌లతో వస్తుంది. దీని ఆకర్షణీయమైన లుక్, రోడ్డుపై చూసిన వారందరి దృష్టినీ ఆకర్షించేలా ఉంటుంది. మధ్యతరగతి వినియోగదారుల కోసం ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది.

పర్ఫార్మెన్స్ పరంగా, కొత్త డిజైర్ శక్తివంతమైన 1.2-లీటర్ పెట్రోల్/CNG ఇంజిన్‌తో వస్తుంది. వేరియంట్‌ను బట్టి, దీనికి 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని ఇంధన సామర్థ్యం 24 నుండి 33 kmpl వరకు ఉండటం ఒక ముఖ్యమైన హైలైట్. అదనంగా, 37 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ దూర ప్రయాణాల్లో కూడా సౌలభ్యాన్ని కల్పిస్తుంది.

India Best Top Three Sedan Cars Tata Tigor Maruti Dzire And Amaze Price And Top Things

Honda Amaze: భారతీయ మార్కెట్లో ప్రాక్టికల్ సెడాన్‌గా పేరు తెచ్చుకున్న కారు హోండా అమేజ్. ధర పరంగా ఇది రూ.8.10 లక్షల నుండి రూ.11.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు లభిస్తుంది. కస్టమర్లకు ఇది V, VX, ZX వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది ఒక 5-సీటర్ సెడాన్, కాబట్టి చిన్న కుటుంబాలు లేదా డైలీ కమ్యూటింగ్ కోసం మంచి ఎంపిక.

ఇంజిన్ విభాగంలో, అమేజ్‌లో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందించబడింది. వేరియంట్‌ను బట్టి ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్యూయల్ విషయానికి వస్తే, ఇది 18 నుండి 19 kmpl మైలేజీ ఇస్తుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ADSS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, August 29, 2025, 16:04 [IST]
English summary
India best top three sedan cars tata tigor maruti dzire and amaze price and top things
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+