రూ.35 వేల జీతం ఉన్నవారు ఈ కార్లను ఈజీగా కొనచ్చు.. మైలేజ్‌లో రారాజులు.. పెర్ఫామెన్స్‌లో తోపులు
భారతీయ కుటుంబాల్లో కారుకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఒకప్పుడు బైక్ ఉంటేనే గొప్ప అనుకునే రోజులు. కానీ రాను రాను పరిస్థితి మారిపోయింది. ఇంట్లోని అందరు కలిసి బస్సులు, రైళ్లలో ప్రయాణించే బదులు కారులో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా వెళ్లవచ్చని ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు రావడంతో కొత్త కారును కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దేశంలో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు తమకు అందుబాటులో ఉండే ధరలో లభించే కారును కొనాలని చూస్తుంటారు. ప్రధానంగా నెలకు జీతం రూ. 35,000 సంపాదించే వారు తక్కువ ధరలో మంచి పెర్ఫామెన్స్ అందించే కారును కావాలని అనుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ జీతం సంపాదించే వారికి కూడా అందుబాటులో ఉండే ధరలో చాలా కార్లు ఉన్నాయి. మరి ఆ కార్ల గురించి ఒకసారి కింది కథనంలో తెలుసుకుందాం.
Maruti Suzuki Ignis: మారుతీ సుజుకీ ఇగ్నిస్ ఒక చిన్న కారు అని మాత్రం ఎవరూ అంచనా వేయకండి. దీనిలో ఉన్న స్టైల్, ఫీచర్లు ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తాయి. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మొదట చూస్తేనే ఆకట్టుకునే డిజైన్‌తో, పట్టణ జీవనశైలికి బాగా సరిపోతుంది. ధర విషయానికొస్తే, ఇగ్నిస్ ప్రారంభ ధర సుమారు రూ.5.85 లక్షల నుంచి రూ.8.12 లక్షల మధ్య ఉంటుంది. ఆన్‌రోడ్ మరింత ఎక్కువగా ఉంది.

తక్కువ జీతం తీసుకునేవారు కూడా ఈ కారును కొనుగోలు చేయవచ్చు. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 1.2 లీటర్ పెట్రోల్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ శక్తివంతమైన పనితీరును కనబరుస్తుంది. అదే సమయంలో దీని మెయింటనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మైలేజ్ గురించి చూసినట్లయితే ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 20.89 కి.మీల వరకు అందిస్తుంది. 5 మంది కలిసి ఈ కారులో హాయిగా ప్రయాణించవచ్చు.
Maruti Suzuki Celerio: మారుతీ కంపెనీకి చెందిన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో కారు కూడా ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న మోడల్. దీని ప్రారంభ ధర వచ్చేసి దాదాపు రూ.5.64 లక్షల నుంచి మొదలుకుని టాప్ ఎండ్ వేరియంట్ రూ.7.37 లక్షల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పవర్ ట్రెయిన్ విషయానికొస్తే, సెలెరియో పెట్రోల్, CNG వేరియంట్లలో లభిస్తుంది. సిటీ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

దీని పెట్రోల్ వేరియంట్ 25.24 నుండి 26.68 కిమీ మైలేజీ ఇస్తుంది, ఇది చాలా బైక్‌లకన్నా మెరుగైనదే. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది చిన్న కారైనా స్టైలిష్ ఫీచర్లు చాలా ఉన్నాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లతో పాటు, ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడానికి 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఈ కారులో ఉన్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబానికి ఇది బాగా సెట్ అవుతుంది.
Maruti Suzuki Eeco: మారుతీ సుజుకీ ఈకో ఎక్కువగా, మధ్యతరగతి భారతీయ కుటుంబానికి బాగా ఉపయోగపడుతుంది. చిన్న వ్యాపారాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.5.44 లక్షల నుంచి రూ.6.70 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. కొత్త ఈకో శక్తివంతమైన 1.2 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్‌లతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఇది 19.71 kmpl నుండి 26.78 km/kg వరకు మైలేజీని అందిస్తుంది. దీన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కారుగా నిలబెడుతోంది. ప్రత్యేకంగా CNG వేరియంట్ అయితే, నగర వాడకానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతే కాదు, ఈ కారులో సెమీ-డిజిటల్ స్పీడోమీటర్, 6 ఎయిర్‌బ్యాగులు వంటి భద్రతా ఫీచర్లతో పాటు, ప్రయాణికుల సౌకర్యం కోసం 5 లేదా 7 సీటింగ్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.


Click it and Unblock the Notifications








