దేశంలో కుటుంబ ప్రయాణాలకు ఎక్కువ మంది కొంటున్న కార్లు! వీటి కోసం భారతీయులు క్యూలు కట్టారు

భారతదేశంలో 7 సీట్ల వాహనాలపై దృష్టి గత కొంతకాలంగా మారుతోంది. ఒకప్పుడు టాక్సీ వాడకానికి మాత్రమే ఉపయోగించబడే ఈ తరహా కార్లు, ఇప్పుడు ఎక్కువగా కుటుంబ అవసరాల కోసం కొనుగోలు చేస్తున్నారు. పెళ్లిళ్లకు వెళ్లడం కావచ్చు, వారాంతపు విహారయాత్రలు కావచ్చు, ఒకేసారి మొత్తం కుటుంబంతో ప్రయాణించాలనుకుంటే, ఇవి అత్యంత బాగా ఉపయోపడుతాయి. ఏడుగురికంటే తక్కువ మంది ఉంటే వెనుక సీట్లను మడిచి అవసరమైన లగేజీ కూడా సులభంగా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లల ఆటబొమ్మల నుంచి పెద్దల బ్యాగుల వరకూ అన్నీ సర్దుకోవచ్చును. ఈ విభాగంలో టయోటా ఇన్నోవా, మారుతీ సుజుకీ ఎర్టిగా వంటి పెద్ద ఎంపీవీ కార్లు బాగా సెట్ అవుతాయి.

2025 ఆర్థిక సంవత్సరంలో, భారతీయ ఆటోమొబైల్ రంగం మరోసారి కొత్త రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా 7-సీట్ల వాహనాల సెగ్మెంట్ ఆశించిన దానికంటే ఎక్కువ స్పందనను రాబట్టింది. ఒకప్పుడు కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలంగా కనిపించిన ఇవి, ఇప్పుడు ప్రధానమైన కుటుంబ వాహన ఎంపికగా మారిపోయింది. ఇది విక్రయాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. ఏప్రిల్ 1, 2024 నుండి మార్చి 31, 2025 వరకు జరిగిన అమ్మకాలను చూస్తే ఇది తెలిసిపోతుంది.

Top Best Selling 7 Seater Cars

తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ వాహనాల జాబితాలో మారుతీ సుజుకీ మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. దాని ప్రసిద్ధ మోడల్‌ ఎర్టిగా మళ్లీ టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అందుబాటులో ధర, మెరుగైన మైలేజ్, లేటెస్ట్ ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్ ఇవన్నీ కలిసి ఎర్టిగాను కుటుంబాల్లో అగ్రగామిగా నిలిపాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఎర్టిగా మొత్తం 1,90,972 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

గత ఆర్థిక సంవత్సరమైన FY24లో విక్రయించిన 1,49,757 యూనిట్లతో పోలిస్తే, ఇది 28 శాతం వృద్ధిని సాధించింది. ఇక రెండవ స్థానంలో నిలిచిన మహీంద్రా స్కార్పియో లైనప్, SUV అభిమానులకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దాని డిజైన్, శక్తివంతమైన పనితీరు SUV లవర్స్‌ను ఆకట్టుకోవడంలో పూర్తిగా విజయం సాధించింది. ఈ సంవత్సరం, స్కార్పియో లైనప్ అమ్మకాల పరంగా టయోటా ప్రసిద్ధ ఎంపీవీ మోడల్ ఇన్నోవాను కూడా అధిగమించింది.

india Fy2025 Top Best Selling 7 Seater Cars Innova

025 ఆర్థిక సంవత్సరంలో 7-సీటర్ వాహనాల విభాగంలో మహీంద్రా స్కార్పియో క్లాసిక్, స్కార్పియో N మోడళ్లకు మంచి ఆదరణ లభించింది. ఈ రెండు మోడళ్ల అమ్మకాలు కలిపి గణనీయంగా పెరిగాయి. డేటా ప్రకారం, FY24లో 1,41,462 యూనిట్లు అమ్ముడవగా, FY25కి ఈ సంఖ్య 1,64,842 యూనిట్లకు చేరింది. అంటే, 17 శాతం వృద్ధి సాధించడమంటే, SUV మార్కెట్‌లో స్కార్పియో బ్రాండ్‌కు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో తెలిసిపోతుంది.

ఇదే సమయంలో, టయోటా ఇన్నోవా మళ్లీ తన సత్తాను నిరుపించుకుంది. మూడో స్థానంలో క్రిస్టా, హైక్రాస్ మోడల్స్ కలిపి FY25లో 1,07,204 యూనిట్లు విక్రయాలను సాధించాయి. గత ఆర్థిక సంవత్సరం అంటే FY24లో అమ్మకాలు 98,181 యూనిట్లు కాగా, ఈ ఏడాది 9 శాతం వృద్ధిని నమోదు అయింది. ఇదే దాదాపు రెండు దశాబ్దాలుగా భారత మార్కెట్లో నిలబడి ఉన్న ఇన్నోవా బ్రాండ్‌కు ఎదురులేని స్థిరత్వాన్ని సూచిస్తుంది.

Kia Carens

తరువాత మహీంద్రా బొలెరో నాల్గవ స్థానంలో పొందింది. దీని అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 1,10,841 యూనిట్ల నుండి 15 శాతం తగ్గి 2025లో 94,750 యూనిట్లకు చేరుకున్నాయి. ఐదవ స్థానంలో మహీంద్రా ప్రసిద్ధ ఫ్లాగ్‌షిప్ SUV అయిన XUV700 మోడల్ ఉంది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో 79,398 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో 93,082 యూనిట్లను విక్రయించగా, ఇది 17 శాతం పెరుగుదల.

ఇక 64,609 యూనిట్ల విక్రయాలతో కియా కారెన్స్ ఆరవ స్థానంలో నిలిచింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇది 63,167 యూనిట్లుగా ఉంది. మారుతీ XL6 మోడల్ 37,111 యూనిట్లతో ఏడవ స్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరం 45,334 యూనిట్లతో పోలిస్తే ఈ మోడల్ 18 శాతం తక్కువ. టయోటా ఫార్చ్యూనర్ 32,785 యూనిట్లు, టాటా సఫారీ 20,034, రెనాల్ట్ ట్రైబర్ 19,905 యూనిట్లతో తొమ్మిదవ, పదవ స్థానాల్లో నిలిచాయి.

More from DriveSpark

Article Published On: Thursday, April 24, 2025, 17:47 [IST]
English summary
India fy2025 top best selling 7 seater cars maruti ertiga mahindra scorpio and etc
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+