పేద, మిడిల్‌క్లాస్ వారికి బడ్జెట్ ధరలో మంచి మైలేజ్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన టాప్ సీఎన్‌జీ కార్లు
భారతదేశంలో ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా ఉన్నాయి. దీంతో ప్రజలు పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా మరింత ఆర్థికంగా ఉపయోగపడే ఆప్షన్ల వైపు చూస్తున్నారు. అందులో భాగంగా CNG వాహనాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా, SUV సెగ్మెంట్‌లో ఫ్యాక్టరీ-ఫిట్‌డ్ CNG మోడళ్లకు డిమాండ్ పెరుగుతోంది. మారుతున్న ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ లైనప్‌లోకి CNG SUVలను చేర్చుతున్నాయి. ఇవి కేవలం అందుబాటు ధరలో లభించడమే కాదు, మంచి మైలేజ్‌తో పాటు లేటెస్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉండటంతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. పైగా వీటి ద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది.
ఇవి పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే తక్కువ మెయింటనెన్స్ ఖర్చుతో పని చేస్తాయి. ఫ్యాక్టరీలోనే అమర్చిన CNG కిట్ వల్ల భద్రతాపరమైన అంశాలు కూడా మెరుగయ్యాయి. అందుకే, ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని మోడళ్లకు కస్టమర్ల నుండి మంచి స్పందన లభించింది. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధరలో లభించే, ప్రజాదరణ పొందుతున్న CNG కార్ల గురించి కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

Hyundai Exter:హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG వెర్షన్‌ను పరిశీలిస్తే, ఇది ధర, పనితీరు పరంగా మంచి SUVగా నిలుస్తోంది. హ్యుందాయ్ ఇటీవల భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ మోడల్, ప్రధానంగా నగరాల్లో ప్రయాణాల కోసం చూస్తున్న వినియోగదారులకు, అదే సమయంలో ఖర్చు తక్కువ ఉండాలనుకునేవారికి ఒక సరైన ఎంపికగా మారింది. ప్రస్తుతం ఎక్స్‌టర్ SUV రెండు రకాల వేరియంట్లలో సింగిల్, డ్యూయల్ సిలిండర్ CNG ట్యాంక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
రెండింటి కెపాసిటీ కూడా 60 లీటర్లుగా ఉంటుండగా, అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ఈ SUV ధరలు రూ.7.51 లక్షల నుండి రూ.9.53 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండడంతో, ఇది CNG SUV సెగ్మెంట్‌లో ఒక కాంపిటీటివ్ ఎంపికగా నిలుస్తోంది. పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఎక్స్‌టర్ CNG మోడల్‌లో 1.2-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించబడింది, దీనిని ఫ్యాక్టరీలోనే CNG కిట్‌తో అమర్చారు.

ఈ ఇంజిన్ 69 bhp శక్తిని, 95.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జత చేయబడింది.స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. మైలేజ్ పరంగా చూస్తే, 27.1 కి.మీ/కిలో మైలేజీని ఇస్తుంది, ఇది దీని విభాగంలో అద్భుతంగా చెప్పవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ సరికొత్త డిజైన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ ఆప్షన్లు వంటి లేటెస్ట్ సౌకర్యాలతో వస్తుంది.
Tata Punch: టాటా మోటార్స్ అందించిన మరో కారు CNG SUV పంచ్. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన CNG SUVగా గుర్తింపు పొందింది. రూపంలో చిన్నదైనా, పనితీరు, భద్రత, టెక్నాలజీ పరంగా మాత్రం ఇది చాలా బలమైన పోటీదారుగా నిలుస్తోంది. టాటా పంచ్ CNG వెర్షన్ ధరలు సుమారు రూ.7.3 లక్షల నుండి ప్రారంభమవుతూ, టాప్ వేరియంట్‌కు రూ.10.17 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయి.

ముఖ్యంగా, ఇందులో టాటా అభివృద్ధి చేసిన "ట్విన్-సిలిండర్ టెక్నాలజీ" ఆకర్షణీయంగా మారింది. ఈ సాంకేతికత ద్వారా 60 లీటర్ల సామర్థ్యాన్ని కలిగిన రెండు చిన్న సిలిండర్లు బూట్ స్పేస్‌ను దెబ్బతీయకుండా అందించబడ్డాయి. ఇంజిన్ పరంగా చూస్తే, టాటా పంచ్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ యూనిట్‌తో వస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో జతచేయబడి ఉంది. ఇదే యూనిట్‌ను టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కూడా ఉపయోగించారు.
మైలేజ్ విషయానికొస్తే, టాటా పంచ్ ARAI ప్రమాణాల ప్రకారం CNG మోడ్‌లో కిలోకు 26.99 కి.మీ అందించలదు. ఇతర వాహనాలతో పోలిస్తే మరింత ఆర్థికంగా నిలుస్తుంది. ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ కారును నేరుగా CNG మోడ్‌లో స్టార్ట్ చేయవచ్చు, ఇది సాధారణంగా CNG కార్లలో అరుదుగా కనిపించే ప్రత్యేకత. సౌకర్యం. పంచ్ టాప్ వేరియంట్లలో సన్‌రూఫ్‌తో పాటు, నాన్-సన్‌రూఫ్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Maruti Suzuki Fronx: మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ CNG వెర్షన్, సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్‌లో స్టైలిష్ డిజైన్‌తో పాటు తక్కువ ధరలో మంచి ప్రయాణం కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించబడిన మోడల్. రోజూ ప్రయాణించే వారికి సరైన ఎంపికగా నిలుస్తోంది. ఫ్రాంక్స్ ధరలు రూ. 8.49 లక్షల నుండి ప్రారంభమై, రూ. 9.35 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయి. దీనిలో డజన్ల కొద్ది ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి.
దీని డెల్టా, సిగ్మా వేరియంట్లపై ఫ్యాక్టరీ-ఫిట్‌డ్ CNG కిట్‌ను అందుబాటులో ఉంచారు. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించబడింది, ఇది సుమారు 28.51 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌ను (CNG మోడ్‌లో) అందిస్తుంది, ప్రస్తుతం మార్కెట్లో లభించే అత్యధిక మైలేజ్ CNG SUVలలో ఒకటి. ఈ ఇంజిన్‌కు మాన్యువల్ గేర్‌బాక్స్ జతచేయబడింది, దాంతో డ్రైవింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

ఫ్రాంక్స్ CNG వెర్షన్ విశాలమైన ఇంటీరియర్, ఫీచర్-రిచ్ డాష్‌బోర్డ్, లేటెస్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా అంశాలతొ కూడా వస్తుంది. దీని స్పోర్టీ డిజైన్, స్మార్ట్ లుక్స్‌తో యువ వినియోగదారులను ఆకర్షిస్తుంది. మారుతీ బ్రాండ్ నమ్మకాన్ని నిలబెట్టడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుంది. రోజు ఉద్యోగాలకు వెళ్లే వారికి అలాగే కుటుంబ ప్రయాణాలకు అత్యంత అనువైన మోడల్‌గా నిలుస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








