ఫ్యామిలీ కోసం టాప్ బెస్ట్ కార్లు.. మీ బడ్జెట్‌లో బంగారం లాంటి మోడళ్లు! ఇవి మిస్ అవ్వకండి!
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగింది. ముఖ్యంగా కార్ల వినియోగం ఇక్కడ వేగంగా పెరుగుతుంది. ప్రజలు ఒకప్పుడు బైక్ ఉంటే చాలు అనుకునేవారు. కానీ కాలం మారింది. ప్రజల ఇష్టాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆదాయ స్థితి గతుల్లో కొంత మెరుగుదల కనిపించడం కారణంగా తమ ఆదాయం మేరకు కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒకప్పుడు జనాలు రూ.10 లక్షల లోపు మార్కెట్లో లభించే కార్లను కొనేవారు. ఆ ధరలో మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, అధునాతన ఫీచర్లు కలిగిన హ్యాచ్‌బ్యాక్ కార్లు, ఎంట్రీ లెవల్ సెడాన్‌లు ఎక్కువగా అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కస్టమర్ల అభిరుచులు, వారి లైఫ్‌స్టైల్‌లా మార్పులు వచ్చాయి.
ఇప్పుడు రూ.10 నుండి రూ.20 లక్షల మధ్యలో ఉండే SUVలు, మిడ్-రేంజ్ సెడాన్‌లు, ఎలక్ట్రిక్ కార్లు ఆదరణ పొందుతున్నాయి. కేవలం బడ్జెట్‌కి పరిమితం కాకుండా, సేఫ్టీ, లగ్జరీ, టెక్నాలజీ లాంటి అంశాలపై కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల మధ్య బడ్జెట్‌ను లక్ష్యంగా పెట్టుకుంటున్న నేపథ్యంలో అలాంటి వారి కోసం మార్కెట్లో లభిస్తున్న కొన్ని కార్ల గురించి కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మధ్యతరహా SUV విభాగంలో ఈ కారుకి ఉన్న ఆదరణ, వినియోగదారుల మనసుల్లో దాదాపు ఓ బ్రాండ్ గుర్తింపుగా మారింది. 2015లో మొదటిగా భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ SUV, అప్పటి నుంచీ తన ఏ మాత్రం తన డిమాండ్‌ను తగ్గిపోకుండా అమ్మకాలతో దూసుకుపోతుంది. ఆకర్షణీయమైన డిజైన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది.
2025 మార్చిలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఇది నిలిచింది. ప్రస్తుతం రెండవ తరం మోడల్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఈ SUV ధర రూ.11.11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, ఇక టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.20.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ రెండింటిలోనూ లభిస్తుంది. అలాగే, మారుతున్న ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ ఏడాది జనవరిలో క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది.

దీని ICE వేరియంట్ విషయానికి వస్తే, మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అందులో 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజిన్ 115PS పవర్, 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ రోజువారీ వినియోగదారులకు, ప్రత్యేకించి నగర రోడ్లలో తిరిగే వారికి అనుకూలంగా ఉంటుంది. రెండవది 1.5 లీటర్ కప్పా టర్బో GDi పెట్రోల్ ఇంజిన్. ఇది మరింత శక్తివంతంగా 160PS పవర్, 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది ప్రత్యేకించి హైవే డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక మూడోది 1.5 లీటర్ U2 CRDi డీజిల్ ఇంజిన్‌లో లభిస్తుంది. ఇది ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీతో పాటు, దూర ప్రాంత ప్రయాణాలు చేసే వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, IVT ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్, అలాగే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది.

Maruti Suzuki Ertiga: పెద్ద కుటుంబాలు, తరచూ ప్రయాణాలు చేసే వారు, లేదా ఎక్కువ సీటింగ్ అవసరమయ్యే వారందరికీ మారుతీ సుజుకీ ఎర్టిగాకి ప్రత్యేకంగా సెట్ అవుతుంది. ఈ 7-సీటర్ ఎంపీవీ K15C స్మార్ట్ హైబ్రిడ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 103PS పవర్, 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జోడించారు.
ఇది ముఖ్యంగా CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. CNG వెర్షన్ పవర్ అవుట్‌పుట్ కాస్త తక్కువైనా, మైలేజ్ పరంగా మాత్రం కస్టమర్లకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. CNG లో ఒక కిలోగ్రాముకు 26 కిలోమీటర్లకు పైగా, అలాగే పెట్రోల్ వేరియంట్ ఒక లీటర్‌కు 20 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఫీచర్ల పరంగా కూడా ఎర్టిగాలో డజన్ల కొద్ది ఉన్నాయి.

మారుతీ ఎర్టిగాలో 7 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ AC, రెండవ వరుసకు ప్రత్యేకంగా రూఫ్ మౌంటెడ్ AC వెంటిలేషన్, కలర్ TFT MID లాంటి వాడకానికి అనువైన స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. పరిమిత బడ్జెట్‌లో ఎక్కువ మంది ప్రయాణించడానికి ఈ కారు బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణికుల సేఫ్టీ పరంగా కూడా ఈ కారు అత్యంత నమ్మకమైనది అని చెప్పవచ్చు.
Kia Syros: కియా మోటార్స్‌కు చెందిన సైరోస్ భారతీయ వినియోగదారులను ఆకట్టుకునే మోడల్. సోనెట్ కంటే పెద్దదిగా, కానీ సెల్టోస్ కంటే కాస్త కాంపాక్ట్‌గా ఉండేలా రూపొందించిన ఈ బాక్సీ డిజైన్ SUV, కియా లైనప్‌లో కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.9 లక్షల నుంచి రూ.17.80 లక్షల వరకూ (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కారులో కస్టమర్లకు అవసరమైన డజన్ల కొద్ది ఫీచర్స్‌ను అందించారు.
ఇది 17 అంగుళాల స్టైలిష్ అల్లాయ్ వీల్స్, LED లైటింగ్, 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్యానెల్ (ఇన్ఫోటైన్‌మెంట్, క్లైమేట్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అన్నీ కలిపి) దీన్ని క్లాస్‌లో ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు. మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హర్మన్ కార్డన్ 8-స్పీకర్ సిస్టమ్, , రెండవ వరుస సీట్లకు వెంటిలేషన్, డ్యూయల్ పనోరమిక్ సన్‌రూఫ్, . భద్రతా ఫీచర్లలో లెవెల్-2 ADAS సిస్టమ్ వంటివి ఉన్నాయి.
Volkswagen Virtus: ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ బేస్ వేరియంట్ ధర రూ.11.56 లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ రూ.19.40 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. ఇది రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్లతో కొనుగోలు చేయాడానికి అందుబాటులో ఉంది. 1.0-లీటర్ TSI ఇంజిన్ 115 PS పవర్, 178 Nm టార్క్‌ను, రెండవ 1.5-లీటర్ TSI EVO 150 PS పవర్, 250 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కారులో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సొగసైన LED హెడ్‌లాంపులు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ప్రయాణికుల రక్షణ కోసం 40కి పైగా సేఫ్టీ ప్రమాణాలు, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు వంటి వాటిని కలిగి ఉంది. ఇది గ్లోబల్ NCAPలో 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ సాధించింది. దీని వల్ల కుటుంబంతో ప్రయాణించే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.


Click it and Unblock the Notifications








