వీటిలో ఒకదాన్ని ఎలాగైనా కొనాలి! ఇండియాలో అతి తక్కువ ధరలో ఎక్కువ డిమాండ్ ఉన్న RWD కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో సాధారణంగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) కార్లను చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం వెనుక వీల్ డ్రైవ్ (RWD) వ్యవస్థతో పోలిస్తే ఈ కార్లు తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. తయారీదారులకు కూడా వీటిని సులభంగా తయారీ చేస్తారు. లోపల కూడా విశాలమైన స్థలం ఇవ్వడానికి వీలవుతుంది. అయితే ప్రస్తుతం దేశీయ మాస్ మార్కెట్లో వెనుక వీల్ డ్రైవ్ (RWD) వ్యవస్థతో పనిచేసే వాహనాలకు డిమాండ్ ఊపందుకుంది. ఇవి బాగా బ్యాలెన్స్డ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. కొన్ని మోడళ్లు ఆన్‌రోడ్‌తో పాటు ఆఫ్‌రోడ్‌లోను దూసుకుపోతాయి. ఈ కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారుల కోసం కొన్ని ప్రసిద్ధ మోడళ్ల గురించి కింది కథనంలో ఇవ్వడం జరిగింది.
Mahindra Bolero: దేశీయ దిగ్గజ కంపెనీ మహీంద్రాకు చెందిన బొలెరో ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న మోడల్. ఇది వెనుక చక్రాల డ్రైవ్ సిస్టమ్‌తో అమ్మకానికి అందుబాటులో ఉంది. దాని గట్టి నిర్మాణంతో అన్ని రకాల భూభాగాలలో కూడా మంచి సామర్థ్యాన్ని అందించడంలో బాగా ప్రసిద్ధి చెందింది. గ్రామీణ, ఆఫ్-రోడ్ పరిస్థితులకు అనువైనది. గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య అవసరాల కోసం బాగా వాడుతుంటారు.

బొలెరో నియో (TUV3OO రీబ్రాండెడ్) కూడా ఇదే RWD సెటప్‌తో వస్తుంది. ఇవి వాణిజ్య కార్యకలాపాలు చూడటం కోసం అనుకూలంగా ఉంటాయి. బొలెరో కారు ధర రూ.9.79-10.91 లక్షల మధ్య ఉంటుంది. అదే నియో విషయానికి వస్తే, రూ.9.95-12.15 లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇవి 1.5L డీజిల్ ఇంజిన్‌తో మంచి పెర్ఫామెన్స్ ఇస్తాయి.
Mahindra Scorpio: మహీంద్రా స్కార్పియో భారతీయ SUV మార్కెట్‌లో ఒక ప్రముఖమైన, ప్రతిష్టాత్మకమైన పేరు. స్కార్పియో RWD (వెనుక చక్రాల డ్రైవ్) వెర్షన్ దాని కెపాసిటీతో అన్ని రకాల భూభాగాలను అధిగమించగల మోడల్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌తో పాటు భారీ లోడ్ క్యారీయింగ్ అవసరాలకు అనువైనదిగా రూపొందించబడింది. స్కార్పియో క్లాసిక్, N సిరీస్ రెండు కూడా వెనుక చక్రాల డ్రైవ్‌ను కలిగి ఉన్నాయి.

స్కార్పియో క్లాసిక్ ధర విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లో ఇది రూ. 13.62-17.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య కొనుగోలుకు లభిస్తుంది. ఇది 2.2L డీజిల్ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అదే స్కార్పియో N ధర రూ. 13.99-22.76 లక్షల మధ్య లభిస్తుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఇది మాత్రం 2.0L పెట్రోల్, 2.2L డీజిల్ ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది.
మహీంద్రా స్కార్పియో RWDలో అనేక అధునాతన ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. లోపల పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ కండీషనర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటిని కలిగి ఉంది. ఈ ప్రసిద్ధ ఎస్‌యూవీలో 7 సీటర్ ఆప్షన్ ఉంది. పెద్ద కుటుంబం గల వినియోగదారులకు ఇది బాగా సెట్ అవుతుంది.

Maruti Eeco: మారుతీ ఈకో భారతీయ మార్కెట్‌లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. పెద్ద కుటుంబం కలిగిన వారికి ప్రయాణాలు చేయడానికి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలో అత్యంత తక్కువ ధరలో వెనుక చక్రాల డ్రైవ్ (RWD) ఆప్షన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు 5, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. మెయింటెనెన్స్ తక్కువ ఖర్చుతో అయి ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది.
ప్యాసింజర్ విభాగంలోనే కాకుండా చిన్న వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎక్కువ సీటింగ్ కార్ల జాబితాలో ఇది కూడా ప్రముఖ స్థానంలో నిలుస్తుంది. దీని ధర వచ్చేసి రూ. 5.44-6.70 లక్షల మధ్య ఉంటుంది. ఈకో వ్యాన్ 1.2L పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రన్ అవుతుంది. అలాగే CNG వేరియంట్‌లో కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Mahindra Thar: మహీంద్రా థార్, రాక్స్ భారతీయ ఆఫ్-రోడ్ SUV మార్కెట్‌లో ప్రముఖమైన ఎంపికలు. మొదటగా 3-డోర్ థార్ విడుదల కాగా, తర్వాత 5-డోర్ రాక్స్ వచ్చింది. దీని MX1, MX3, AX3 L, MX5, AX5 L, AX7 L వేరియంట్‌లు స్టాండర్డ్‌గా వెనుక చక్రాల డ్రైవ్ (RWD) ఆప్షన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అదే, థార్‌లో AX ఆప్ట్, LX వేరియంట్లు ఇదే సెటప్‌ను కలిగి ఉన్నాయి.
థార్ రాక్స్ RWD ఆప్షన్ ధర రూ.12.99-20.99 లక్షల మధ్య కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అలాగే, థార్ RWDల విషయానికి వస్తే, రూ. 11.50 లక్షల నుంచి రూ. 14.25 లక్షల వరకు లభిస్తాయి. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే దేశంలోని నగరాలను బట్టి మారుతాయి. 3 డోర్ థార్ పవర్‌ట్రెయిన్ 2.0L పెట్రోల్, 1.5L డీజిల్ ఇంజిన్‌లతో లభిస్తుంది.
అదే 5 సీట్ల ఆప్షన్‌లో లభిస్తున్న రాక్స్ కారు 2.0L పెట్రోల్, 2.2L డీజిల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. ఈ ప్రసిద్ధ రెండు ఎస్‌యూవీలు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తాయి. మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో కుటుంబ అవసరాలకు అనువైనది. స్టైలిష్ గా, పవర్‌ఫుల్ గా, అందరినీ ఆకట్టుకునేలా, ముందు గ్రిల్, మస్కులర్ బాడీ, హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఒక ఫెర్ఫెక్ట్ SUV లుక్స్ ని అందిస్తుంది.
MG Comet EV:ఎంజీ కామెట్ EV భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తుంది. ఇది వెనుక చక్రాల డ్రైవ్ (RWD) సెటప్‌తో రన్ అవుతుంది. ఈ కారు ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, బ్లాక్‌స్టార్మ్ అనే నాలుగు వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ మోడల్ ధర వచ్చేసి రూ. 6.99-9.84 లక్షల మధ్య ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది.
ఈ కారులో 17.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు ఒకే ఛార్జ్‌పై 230 కి.మీ.ల వరకు రేంజ్ అందిస్తుంది. ఇది నగర అవసరాలకు బాగా సరిపోతుంది. వినియోగదారులను ఆకట్టుకునే డజన్ల కొద్ది ఫీచర్స్‌ను ఈ కారులో అందించారు.


Click it and Unblock the Notifications








