60 నిమిషాల్లో 1.76 లక్షల బుకింగ్‌లు! సేఫ్టీలో 5 స్టార్.. ఆఫ్‌రోడ్ కింగ్ కోసం ఎక్కువ వెయిట్ చేయాల్సిన పనిలేదు!

దేశీయంగా రూపొందించబడిన మాస్ ఫేవరెట్ ఆఫ్-రోడ్ SUV అంటే అందరికి గుర్తుకు వచ్చేది మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx). ఒకవైపు మారుతీ సుజుకీ జిమ్నీ, మరోవైపు ఫోర్స్ గూర్ఖా లాంటి గట్టి పోటీదారుల మధ్యన, థార్ రాక్స్ తనదైన ముద్ర వేస్తోంది. దాని కఠినమైన రూపం, శక్తివంతమైన పనితీరు, స్టైల్‌తో కూడిన ఆఫ్-రోడ్ సామర్థ్యం SUV లవర్స్‌ను ఎంతగానో ఆకర్షిస్తోంది. గతంలో అమ్మకాల్లో మెరుగైన సంఖ్యలను నమోదు చేసిన థార్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకాలం థార్ రాక్స్ కోసం ఆసక్తితో ఎదురు చూసిన కస్టమర్లకు ఒక గుడ్‌న్యూస్ ఉంది. గతంలో, వాహనాన్ని డెలివరీ చేయించుకోవడానికి నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఈ మే నెల నుంచి, ఈ వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గిందని తాజా సమాచారం వెల్లడిస్తోంది.

5-డోర్ థార్ రాక్స్‌లోని MX1, AX7 L వేరియంట్లు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 6 నెలలలోపు డెలివరీకి సిద్ధంగా ఉంటాయని చెబుతున్నారు. ఇది ముందు టైంతో పోలిస్తే గొప్ప మార్పు. ఇక, MX3, AX3 L వేరియంట్లు కొంచెం త్వరగా, 4 నెలల వ్యవధిలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. వేరియంట్ ఆధారంగా వేచి ఉండే సమయం మారుతున్నా, మొత్తం మీదగా ఇది కస్టమర్ల కోసం మంచి ఊరట కలిగించే విషయం.

India Off Road King Mahindra Thar Roxx

ఈ వేచి ఉండే కాలం తగ్గడమంటే మునుపటి కంటే ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడటం మాత్రమే కాదు, మార్కెట్ డిమాండ్‌ను బట్టి మహీంద్రా తన సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి పూర్తిగా సిద్ధమైందని తెలుస్తుంది. థార్ రాక్స్ MX5, AX5 L పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లను డెలివరీ తీసుకోవాలంటే దాదాపు సగటున 4 నుండి 6 నెలల వరకు ఉంటుందని సమాచారం.

మహీంద్రా థార్ రాక్స్ SUV వైపు దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతుంది. ఆఫ్‌-రోడ్ మాస్ మార్కెట్‌లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ SUV తాజా బుకింగ్ డేటా చూస్తే, దాని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది. అత్యాధునిక డిజైన్, మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలు, 5 డోర్ లే అవుట్‌తో అందుబాటులో ఉన్న థార్ రాక్స్ దేశంలోని చాలా మందిని ఆకట్టుకుంటుంది.

Mahindra Thar Roxx Waiting Period

మహీంద్రా కంపెనీ కొత్త థార్ రాక్స్ కోసం అక్టోబర్ 3న బుకింగ్‌లను ప్రారంభించిన రోజే కేవలం 60 నిమిషాల్లోనే 1.76 లక్షల యూనిట్ల బుకింగ్‌లు నమోదు కావడం, మార్కెట్‌లో SUV కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో హైలైట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు బుకింగ్ రికార్డులు తిరగరాస్తూ, ఒక రేంజ్‌ డిమాండ్ కారుగా నిలిచింది. వినియోగదారుల వైపు నుంచి ఈ స్థాయిలో స్పందన రావడం అనేది, SUV సెగ్మెంట్‌లో థార్ బ్రాండ్‌ నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.

మహీంద్రా థార్ రాక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.99 లక్షల నుంచి రూ.23.39 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది. ఇది 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 5 సీటర్ల కంఫర్టబుల్ సెటప్‌తో వస్తుంది. ఈ SUV 2.4 నుంచి 15.2 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని అంచనా. ఫీచర్ల పరంగా చూస్తే, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

Thar Roxx Suv May 2025 Waiting Period

ఇంకా ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, LED DRL, ఇతర స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్, ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడానికి ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగులు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా పలు అత్యుత్తమ సేఫ్టీ అంశాలు కూడా ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది బీఎన్‌క్యాప్‌లో 5 స్టార్ పొందింది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 28, 2025, 15:20 [IST]
English summary
India off road king mahindra thar roxx suv may 2025 waiting period details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+