థార్ vs జిమ్నీ: జూన్‌లో ఎవరు గెలిచారు? ఏ కారును ఎక్కువ మంది కొన్నారు?
భారతదేశంలో SUV లకు ఉన్న విపరీతమైన డిమాండ్ మధ్య, మహీంద్రా థార్, మారుతి జిమ్నీ మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. మహీంద్రా థార్ ఇప్పటికే మార్కెట్లో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నప్పుడు, మారుతి సుజుకి దీనికి ప్రత్యామ్నాయంగా జిమ్నీ 5-డోర్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ సైజులో ఉండి, మెరుగైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో వస్తుందన్న హైప్‌తో, జిమ్నీ విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అప్పట్లోనే మార్కెట్ థార్ అమ్మకాలపై జిమ్నీ ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. అయితే, వాస్తవ పరిస్థితి కొంత భిన్నంగా పరిణమించింది. జిమ్నీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఆశించిన స్థాయిలో అమ్మకాలను సాధించలేకపోయింది. అయితే మరోవైపు, థార్ అమ్మకాలు అదే వేగాన్ని కొనసాగిస్తూ కొన్ని నెలల్లో మరింత పెరిగాయి కూడా.
తాజాగా జూన్ నెలకు విడుదలైన ఆటోమొబైల్ అమ్మకాలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. SUV విభాగం భారత మార్కెట్లో కొనసాగుతున్న ఉత్సాహానికి ప్రతిబింబంగా మారుతోంది. ముఖ్యంగా, ఆఫ్-రోడ్ లక్షణాలు కలిగిన కార్లకు ప్రత్యేక గిరాకీ పెరుగుతుండగా, వినియోగదారులు మంచి బ్రాండ్ పాపులారిటీతో పాటు బలమైన స్టైలింగ్, పనితీరు కోసం థార్ వైపు మొగ్గుచూపుతున్నట్టు స్పష్టమవుతోంది. అయినప్పటికి జిమ్నీ కూడా కొంత పుంజుకున్నట్లు కనిపిస్తుంది.

SUV ప్రియులు ఎదురుచూస్తున్న పోటీకి జూన్ నెలలో మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఒకవైపు మారుతి సుజుకి తన 5-డోర్ ఆఫ్-రోడ్ SUV అయిన జిమ్నీ అమ్మకాలను గమనించదగిన స్థాయిలో పెంచినప్పటికీ, మహీంద్రా థార్ మాత్రం మార్కెట్లో తన ఆధిపత్యాన్ని ఇంకా నిలబెట్టుకుంటూనే ఉంది. జూన్ 2025లో మారుతి మొత్తం 682 జిమ్నీ యూనిట్లు విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 274 యూనిట్లతో పోలిస్తే, గణనీయమైన వృద్ధి.
అంతేకాదు, మే 2025లో అమ్ముడైన 431 యూనిట్ల కంటే ఇది మెరుగైన వృద్ధి. ఇవన్నీ చూస్తే, జిమ్నీ అమ్మకాలు మెరుగవుతున్నట్టు స్పష్టమవుతోంది. కానీ, మహీంద్రా థార్ అమ్మకాలతో పోలిస్తే, ఈ గణాంకాలు ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి. జిమ్నీకి మార్కెట్‌లో స్పష్టమైన అవకాశం ఉందని గ్రహించిన మహీంద్రా, తన మూడో డోర్ SUV వేరియంట్ అయిన థార్ రాక్స్(Thar Roxx) ను ప్రవేశపెట్టింది. ఇది 5-డోర్ థార్ వెర్షన్‌గా రూపొందించబడింది.

మరింత ప్రాక్టికల్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ SUV కోసం ఎదురు చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని మహీంద్రా దీన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు థార్ 3-డోర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఈ కొత్త వెర్షన్ ద్వారా మహీంద్రా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మారుతి జిమ్నీకి మెల్లిగా ఆకర్షణ పెరుగుతున్నప్పటికీ, థార్‌కు ఇప్పటికే ఉన్న బ్రాండ్ వాల్యూతో పాటు పవర్, రోడ్ ప్రెజెన్స్ వంటివి వినియోగదారులను ఇంకా అదే వైపు మళ్లిస్తున్నాయి.
ఈ రెండు కార్లు 5-డోర్ సెగ్మెంట్‌లో తలపడుతుండగా, గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. జూన్ 2025లో మహీంద్రా మొత్తం 9,542 థార్ యూనిట్లను విక్రయించింది. ఈ మొత్తంలో 3-డోర్ వేరియంట్‌తో పాటు, థార్ రాక్స్ 5-డోర్ వేరియంట్ కూడా ఉంది. జీమ్నికంటే థార్‌కు ఎక్కువ డిమాండ్ ఉందని జూన్ నెల అమ్మకాల గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రధానంగా థార్ 5-డోర్ మోడల్, అనేకమందికి ఫ్యామిలీ యూజ్‌కు అనువైన ఆఫ్షన్‌గా కనిపిస్తోంది.

రాబోయే నెలల్లో మహీంద్రా థార్ అమ్మకాలు ఇంకా పెరుగుతాయని ఆటో పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం, కంపెనీ గణనీయంగా విస్తరించిన ప్రోడక్ట్ లైన్ అప్, ముఖ్యంగా థార్ రాక్స్ పేరుతో వచ్చిన 5-డోర్ వేరియంట్‌కు వినియోగదారుల నుండి వస్తున్న అనూహ్య స్పందన. ఇదే సమయంలో, మారుతి సుజుకి కూడా జిమ్నీ ద్వారా ఆఫ్-రోడ్ SUV విభాగంలో తన స్థానాన్ని దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.


Click it and Unblock the Notifications








